Monday, 16 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఈఎస్‌ఐలోనూ అవినీతి జాడలు

భారీ మొత్తంలో గడువు తీరే మందులు కొనుగోళ్లు కార్మికుల వైద్యానికి కాస్మోటిక్‌ ఔషధాల్ణు విజిలెన్స్‌ విచారణలో వెలుగుచూస్తున్న అక్రమాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం – విజిలెన్స్‌ ఎస్పీ ఎం.వి.సుబ్బారెడ్డి. (నెల్లూరు, పున్నమి ప్రతినిధి) తలవెంట్రుకలు… పెరిగేందుకు… అక్కడ భారీఎత్తున ఔషధాలు కొన్నారు… అక్కడ ఈసీజీ..పరికరాలు.. లేకున్నా… వాటికోసం లక్షల్లో బిల్లులు చేశారు.. ఇదేదో కాస్మొటిక్‌… అవసరాలకు… కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లో బిల్లులు అనుకునేరు… నిరుపేద కార్మికులకు తూతూ మంత్రంగా సేవలందించే ఇఎస్‌ ఐ హాస్పిటల్స్‌ లో డ్రగ్స్‌ కొనుగోళ్లు మాటున జరుగుతున్న అక్రమాలు… జ్వరమొస్తేనే.. మాత్రలు లేవనే ఈ హాస్పిటల్స్‌ లో మందులపేరు తో జరిగిన దోపిడీలుపై విచారణ జరుగుతున్న నేపద్యంలో నెల్లూరులోనూ ఆశ్చర్యం కలిగించే అక్రమాలు బయటపడుతున్నాయి.. ఇంతకీ జిల్లాలో ఈ ఎస్‌ ఐ హాస్పిటల్స్‌ అక్రమాలేంటో మీరే చదవండి. ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో..కార్మికులకు అత్యవసరంగా చికిత్స అందించాలంటే… సవాలక్ష కారణాలు చెపుతారు.. అక్కడి వైద్యులు… ఏఒక్క జబ్బుకీ…సరైన మందులు కనిపించని ఆ వైద్యశాలల్లో.. సౌందర్యపోషణకు కూడా చికిత్స అందిస్తాయంట…అందుకోసమే వీరు మందులు కొనుగొలు చేసినట్లు రికార్డులు తయారు చేసారు.నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ పోర్స్‌ మెంట్‌ తనిఖీలలో నమ్మలేని వాస్తవాలు బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎస్‌ ఐ అసుపత్రులలో జరుగుతున్న తనిఖీలు దిమ్మ తిరిగే వాస్తవాలను వెలికి తెస్తున్నాయి.విన్న వారంతా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.తెలంగాణ రాష్టంలో ఈఎస్‌ ఐ అసుపత్రులలో జరిగిన మందుల కుంభకోణం తర్వాత ఎపిలో కూడా రాష్ట వ్యాప్తంగా విజిలెన్స్‌ ఇప్పుడు ఈఎస్‌ ఐ అసుపత్రులలో తనిఖీలు నిర్వహిస్తుంది.ఇందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాంతాలలో తనిఖీలు చేసింది.జిల్లాలో నెల్లూరులోని పోదలకూరు రోడ్డు లోని అసుపత్రి,కావలి ,సూళ్ళురు పేట లలో వున్నక్లీనిక్‌ లలో విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది.అక్కడ రికార్డులతో పాటు మందుల నిల్వ,ఎక్కడ నుంచి కొనుగొలు చేసారు.ఎలాంటి మందులు కొనుగొలు చేసారు లాంటి వాటిపై తనిఖీలు చేస్తున్నారు. కార్మికులు,ప్రయివేటు కంపెనీల సిబ్బందికి ఈఎస్‌ ఐ అసుపత్రులలో చికిత్స అందిస్తారు.నెల్లూరు నగరంలోరెండు,సూళ్ళురు పేటలో రెండు ,గూడురులో 1,తడ,కావలిలలో రెండు ఈఎస్‌ ఐ అసుపత్రులు నడుస్తున్నాయి.వాటి పరిదిలో కార్మికులకు ఎక్కువుగా చికిత్సలు అందిస్తారు. అయితే తనిఖీలలో విచిత్రమైన అంశాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.కావలి ఈఎస్‌ ఐ అసుపత్రిలో అయితే జుట్టు రాలకుండ వుండేందుకు వాడే మందులు 60-100 కేస్‌ ల వాడినట్లు రికార్డులు లలో వుంది.అయితే వ్యాదుల చికిత్సకు మందులు ఇవ్వాల్సిన అసుపత్రిలో సౌందర్యానికి ఉపయోగపడే మందులు ఎందుకు వాడారన్నది ఇప్పుడు విజిలెన్స్‌ అదికారులనే విస్మయానికి గురిచేసింది.సూళ్ళురు పేటలో ప్రభుత్వం పంపించిన మందులు కాకుండా బయట అధికంగా కొనుగొలు చేసినట్లు రికార్డులు చూపించారు. అంతేకాకుండా పది మంది రోగులు వస్తుంటే వారి సంఖ్యను నాలుగింతలు పెంచినట్లు విజిలెన్స్‌ తనిఖీలలో బయటపడింది.మిగిలిన వారికి కూడా మందులు పంపిణీ చేసి నట్లు రికార్డులు తయారు చేసుకున్నట్లు గుర్తించారు అదికారులు.తనిఖీలు మరింత కాలం కొనసాగుతాయని అంటున్నారు విజిలెన్స్‌ అదికారులు…అయితే పూర్తి వివరాలు తనిఖీలు ముగిసిన తర్వాత చెబుతామంటున్నారు. ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో అక్రమాలు తెలంగాణాకు పరియం8తమనుకున్న విజిలెన్స్‌ అధికారులకు ఇక్కడి మందుల కొనుగోళ్లు… వాటిపంపిణి చూసి మైండ్‌ బ్లాక్‌ అవుతోంది… ఊహించని జబ్బులకు మందులు కొనుగోలు చేశారు… గాయాలకు… జ్వరాలకు మాత్రలు దొరకని ఈ కార్మిక దవాఖానలో మాత్రం… కాస్ట్లీ మందులు భారీగా కొన్నారు.. అందులోనూ రికార్డుల్లో మాత్రమే… నిరుపేద కార్మికులకు వైద్యసేవలు అందించినట్లు సొమ్ముచేసుకున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి…

Featured ఆంధ్రప్రదేశ్

వివాదాలకు కేరాఫ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి

వివాదాలకు కేరాఫ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆయన ఓ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల ఇబ్బందులున్నాయంటూ సుదీర్ఘ పోరాటాలు చేసిన నేత. సాధారణ కుటుంబం నుంచి విద్యార్థి ఉద్యమ నేతగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎరిగిన వ్యక్తి కూడా. ఆయనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. రాజకీయంగా ఎలాంటి పూర్వ నేపథ్యం లేకుండా రెండు సార్లు శాసనసభ్యులయ్యారు. అధికారం చేపట్టిన అనంతరం అనుచరుల ప్రభావమో, కేడర్‌కు అండగా వుంటానన్న భరోసా కోసమో గత కొద్ది కాలంగా రాజకీయ వివాదస్పదుడిగా మారారు. ప్రత్యేకించి నెల్లూరు రూరల్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే దూకుడు పెంచారు. బెదిరింపులు, హుంకరింపులు, హెచ్చరికలు ఆ పై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు అంతలోనే వివరణలు ఇలా అడుగడుగునా ఆయన అధికార పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఒకప్పటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల అనుచరుడిగా రాజకీయ మెట్లెక్కి శాసనసభ్యుడిగా ఎదిగిన శ్రీధర్‌ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలలో వివాదాలకు కేరాఫ్‌గా మారారు.    తాజాగా వెంకటాచలం ఎంపీడీవో సరళ పై దౌర్జన్యం చేశారంటూ గత రాత్రి నుంచి శ్రీధర్‌ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టాయి. తన ముఖ్య అనుచరుడు, ఆంతరంగికుడు అయిన బిరదవోలు శ్రీకాంత్‌ రెడ్డి అతని స్నేహితుడు కలిసి వెంకటాచలం మండలం అనికేపల్లిలో ఏర్పాటు చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్‌కు సంబంధించి వివాదం తెరపైకి వచ్చింది. ఆ లేఅవుట్‌లో వెళుతున్న పైప్‌లైన్‌ నుంచి నీరు ఇవ్వాలంటూ చేసిన ప్రతిపాదన అనుమతులలో జాప్యం చేస్తున్నారంటూ ఎంపీడీవో సరళా పై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహించారు. గతరాత్రి కల్లూరుపల్లిలోని ఎంపీడీవో సరళ నివాసం వద్ద దౌర్జన్యం చేశారంటూ ఆమె ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. తెల్లవారుజామున ఆయన అనుచరుల పై కేసు నమోదు చేశారు రూరల్‌ పోలీసులు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పై కేసే నమోదు వరకు వెళ్ళింది. మొన్నటి ఎన్నికలు నాటి నుంచి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలకు ముందు తర్వాత వరుసగా పలువురిని బెదిరింపులు, ఫోన్లులో అసభ్యకరంగా మాట్లాడడం, భౌతిక దాడులకు దిగడం లాంటి ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల పై గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి వెళ్లాయి. ఆ తరువాత పార్టీ నేరుగా రంగంలోకి దిగి వివాదాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుండాలంటూ అధినేత జగన్‌ ఆదేశించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం పెత్తనాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి సోదరుడు దినకర్‌ రెడ్డికి అప్పగించారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించాలి. మిగతా సమయంలో అమరావతిలో అందుబాటులో వుండాలంటూ వైసీపీ పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు ఇటీవల విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో వరుసగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో కొన్నాళ్లు ఎమ్మెల్యే సైలంట్‌ అయ్యారు. నియోజకవర్గానికి కొన్ని రోజులు దూరంగానూ ఉన్నారు. ఇటీవల రొట్టెల పండుగ నుంచి ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టారు. వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో బిజీగా మారారు. ఇదే సమయంలో మరోసారి ఎంపీడీవో పై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే వ్యవహారం వివాదస్పదంగా మారింది. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలోకి వచ్చిన శ్రీధర్‌ రెడ్డి పై తాజాగా నెలకొన్న వివాదాలపై ఆ పార్టీ అధినాయకత్వం ఎలాగు వ్యవహరించబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీలోను హాట్‌టాపిక్‌గ మారింది.

Featured ఆంధ్రప్రదేశ్

సహకార పరపతి సంగం డైరెక్టర్‌గా పెళ్లకూరు

సహకార పరపతి సంగం డైరెక్టర్‌గా పెళ్లకూరు నెల్లూరు, అక్టోబర్‌ 4 (పున్నమి విలేకరి): నెల్లూరు రూరల్‌ పిడతాపోలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంగం డైరెక్టర్‌ గా మన ఆణిముత్యం జంగాలకండ్రిగ వాస్తవ్యులు పెళ్లకూరు శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈయన శనివారం డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా పంచేటి భరత్‌ నాగు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పిడతాపోలూరు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెళ్లకూరుకు శుభాకాంక్షలు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మగవారి సెక్స్‌ సామర్థ్యానికి విరోధులు

మగవారి సెక్స్‌ సామర్థ్యానికి విరోధులు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అది తెలుసుకోవటానికి ఆకలి నిద్ర, లైంగిక సామా ర్థ్యాలను అంచనా వేయటం ద్వారా తెలుసు కోవచ్చు. వీటిలో ఏ ఇబ్బంది లేకుండా బాగుంటే వారి ఆరోగ్యం ఇంకా చెడిపోనట్టే. దీని అర్థం మొత్తం బాగుందని కాదు. చెడి పోతూ ఉండవచ్చు. లైంగిక సామర్థ్యం చెడిపోకుండా నాలుగు కాలాల పాటు ఉంచుకోవాలంటే దానికి శత్రువులుగా ఉండే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వయసు పెరిగే కొద్ది లైంగిక సామర్థ్యం ముందు కంటే కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ మన చేతిలో ఉన్న అంశా లలో అప్రమత్తంగా ఉంటే ముందు ముందు తలలు బోడులైనా తలపులు బోడులు కాకుండా చూసుకోవచ్చు. బరువు : ప్రతి వారికి వారి వారసత్వ లక్షణాన్ని బట్టి, వారి ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి. ఇది ఇతరత్రా కూడా ఆరోగ్యకరం. జీవన విధానాన్ని బట్టి కొంత అటూ ఇటూ ఉండవచ్చు కానీ అతిగా బరువు పెరిగి ఊబకాయం తెచ్చుకుంటే లైంగిక సామర్థ్యం పడిపోతుంది. పరిధి దాటి పెరిగే ప్రతి కేజీకి బరువుకి కొంత సెక్సు సామర్థ్యం తగ్గు తుంది. లడ్డుగా ఉన్న వారిలో నలబై దాటాక లేపన సమస్య వస్తే బరువు తగ్గటం మొదలు పెట్టాలి. తిండి మీద అదుపు, ఒంటికి వ్యాయామం లేకుం డా మరి ఏ ఇతర పద్ధతిలో కూడా బరువు తగ్గటం సాధ్యంకాని పని. కొలెస్టరాలు : సాధరాణంగా మన శరీరంలో ఉండాల్సినంత కొలెస్టరాలు ఉంటుంది. అయితే కొంత మందికి అవసరానికి మించి ఉంటుంది. కోలెస్టరాలులో మంచి కొలెస్టరాలు, చెడు కొలెస్ట రాలు అని రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట రాలు తగ్గే కొద్ది లైంగిక సామర్థ్యం తగ్గుతూ వుం టుంది. కాబట్టి ఎవరికైయినా అధిక కొలెస్టరాలు ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవటానికి జాగ్ర త్తలు తీసుకోవాలి. దీన్ని మందులు వాడి తగ్గించు కోవటం కంటే జీవన సరళిని మార్చు కోవటం ద్వారా తగ్గిం చుకోవటమే మంచి పద్ధతి. వీలుకానప్పుడు మాత్రమే మం దులు వాడుకోవాలి. సోమరితనం : శరీరం కదలకుండా పనులు చేసే వారు లైంగికంగా బాగా ఉం డాలని ఆశించటం దురాశే అనుకోవాలి. హుషారుగా, చలాకీగా ఉన్న వారికి లైంగిక సామర్థ్యం బాగా ఉంటుంది. పైగా ఇలాంటి వారు కనీసం తిండిని అదుపులో ఉంచుకోక పోతే బరువు పెరగటం ఖాయం. పెరిగే బరువు మళ్ళీ సెక్సును తగ్గిస్తుంది. పొగాకు వాడకం : పొగాకు ఏ రూపంలో వాడినా లేపన శక్తి దాదాపు 20 పాళ్ళు తగ్గు తుంది. అయితే ఇందులో ఓ గమ్మత్తు వుంది. వయసులో వున్నప్పుడు పొగకు వాడినా దాని వల్ల తగ్గిన లైంగిక సామర్థ్యం పెద్దగా పట్టింపుకు రాదు. కారణం ఏమి టంటే వయసులో వున్నప్పుడు మనలో అవస రానికి మించి చాలా నిలువ లైంగిక సామర్థ్యం ఉంటుం ది. ఏ కారణం వల్ల లేపన శక్తి తగ్గినా అదనంగా ఉన్న నిలువ శక్తి దాన్ని భర్తీ చేస్తుంది. కాబట్టి వయసులో ఉన్నప్పుడు పొగాకు వాడకం వల్ల తగ్గిన సామర్థ్యాన్ని గుర్తించలేరు. వయసు మీరే కొద్ది నిలువ శక్తితో పాటు ఉన్న సామర్థ్యం కూడా తగ్గి లేపన సమస్య వస్తుంది. దీనికి తోడు పొగాకు కూడా వాడితే లేపన శక్తి మరీ దారుణంగా పడిపోతుంది. పొగాకు వాడే వారు తెలుసు కోవాల్సిన సత్యం ఏమిటంటే, లేపన సమస్య రానంత వరకూ పొగాకుతో ఎన్ని ఆటలు దాని ప్రభావం తెలియదు. కానీ ఒక సారి సమస్య వచ్చాక దాన్నుండి బయట పడాలంటే పొగాకు మానాల్సిందే. మానేసిన వారాని కల్లా దాని వల్ల తగ్గిన 20 పాళ్ళ లైంగిక సామర్థ్యం తిరిగి వస్తుంది. ఆల్కహాలు : అప్పుడప్పుడూ మందు కొట్టే వారికి మందు వల్ల సెక్సుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ అదే పనిగా తాగే వారి లో నరాలు చీకిపోయి చచ్చుగా తయార వుతాయి. దాంతో మెదడు నుండి కోరిక కరెంటును అంగానికి తీసుకు పోవటంలో తేడా వస్తుంది. నరాలు ఏ మేరకు చీకిపోతే ఆ మేరకు లేపుడు శక్తి తగ్గు తుంది.   ఇదీ నా సమస్య ప్రశ్న : నాకు 30 సంవ త్సరాలు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. నేను పదో తరగతి చదివేటప్పుడు నేను హాస్టల్లో ఉండే వాడిని. హాస్టలు వార్డను నా చేత ¬మోసెక్స్‌ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా తన ఫ్రెండ్సుని కూడా నాతో చేయిం చాడు. రాను రాను నాకు కూడా బాగా అలవాటు అయింది. భార్యతో కూడా సెక్సు చేయగలను కానీ మగ వారిని చేస్తున్నంత కిక్కు రాదు. ఆ మధ్య మా ఆవిడకు సంగతి తెలిసి పెద్ద గొడవ అయిం ది. ఆ వెధవ అలవాటు మానితేకానీ కాపురం చేయనంటుంది. ప్రస్తుతానికి దానికి దూరంగా ఉంటున్నాను కానీ పాత పరిచయం ఉన్న వారు అప్పుడప్పుడు ఫోను చేసి రమ్మన్నప్పుడు వెళ్ళాలని మనసు తహతహలాడుతుంది. వారు గట్టిగా పిలిస్తే మళ్ళీ పోతానేమో అని అనిపిస్తుంది. నాకు ఆ యావలేకుండా ఉండాలంటే ఏమి చేయాలి? – వి.వి.ఎస్‌., వేదాయపాళెం జవాబు : స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన వారు దాన్ని మానటానికి చాలా నిగ్రహ శక్తి కావాలి. ఎక్కువ మందికి దీని నుండి బయట పడాలని ఉన్నా ఆ సమయం వచ్చే సరికి అదుపు చేసుకోలేరు. ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. స్వ లింగ సంపర్కంలో ఉన్న బలహీనతే అది. ఈ పద్ధతి నుండి బయట పడాలన్న గట్టి సంకల్పం మీకు ఉంటే సైకో ధెరపీ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అనుభవజ్ఞులయిన సైకియాట్రిస్టులు, క్లినికల్‌ సైకాలజిస్టులు ఆ చికిత్సను చేస్తారు. డాక్టర్‌ పి. శ్రీనివాసతేజ, నెల్లూరు

Featured ఆంధ్రప్రదేశ్

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : నెల్లూరులో జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ శేషగిరిరావు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భారతావనికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన మహనీయులు మహాత్మాగాంధీ అని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివని తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 150వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచార్య . అందె ప్రసాద్‌ గారు విచ్చేసి గాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చాలు సమర్పించారు. రిజిస్ట్రార్‌ గారు మాటా ్లడుతూ గాంధీగారి ఆశయసాధనలో మనం అందరం పాలు పంచుకోవలని సూచించారు ,అదే విధంగా సత్యం, అహింస మార్గాలను ఈ తరం విద్యా ర్థిని, విద్యార్థులు ఆచరించాలని కోరారు. మన భారత ప్రభుత్వం గాంధీగారి 150 వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత -స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టారు . ఈ కార్య క్రమంలో విద్యార్థులందరూ విరివిగా పాల్గొ నాలని మరియు మన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని ప్లాస్టిక్‌ రహిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ జయంతి ఉత్స వాలను పురస్కరించుకుని గాంధీ యన్‌ స్టడీ సెంటర్‌ వివిధ సాహిత్య పోటీలను నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను అందజేసింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఆచార్య కె . వి. యస్‌ జవహర్‌ బాబు గారు, సి డి సి డీన్‌ ఆచార్య విజయనంద్‌ బాబు గారు, గాంధీయన్‌ స్టడీ సెంటర్‌ సమ న్వయకర్త డా. నీలమణికంఠ గారు, విద్యార్థి, విద్యార్థినులు, భోదన , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు .

Featured ఆంధ్రప్రదేశ్

వాకర్స్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

వాకర్స్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : 150వ గాంధీ జయంతి వేడుకలను చిల్డ్రన్స్‌ పార్కులో వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వహణ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిట్రపటానికి వాకర్స్‌ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. డాక్టర్‌ మోహన్స్‌ డయాబెటీస్‌సెంటర్‌ వారి చే ఉచిత షుగర్‌..బి.పి.పరీక్ష లను 250మందికి నిర్వహించారు.పినాకినీ లయన్స్‌ క్లబ్‌ వారి సహకారం తో 15మందిపార్క్‌ ఉద్యోగస్తులకు వస్త్రాలు పంపిణీ చేసారు. ఈకార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి సింగంసెట్టి మురళీ మొహాన రావు మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని స్వతంత్రం సాధించిన మహనీయుడు గాంధీ గారని వారి ఆసయాలకు ఊపిరి పొయవలసిన భాద్యత మన అందరిది అని అన్నారు. ఈ కార్యక్రమం లో సింగంసెట్టి మురళీ మోహన్‌ రావు..కొట్టే రామమూర్తి..పాముల రమనయ్య ..లయన్‌ కిషోర్‌ కుమార్‌..గవర్నర్‌ కిషోర్‌ కుమార్‌..లీలారెద్ది..సగిలి జయరాం రెడ్డీ. కె. పెంచల నాయుడు. ఎల్‌. బాబు మరియు వాకర్స్‌ పాల్గొన్నారు.

Featured Others

కొంప కాలి ఒకడు ఏడుస్తుంటే .చుట్టూ కాల్చు కున్నాడు ఒకడు. ఈ అమ్మాయి యవ్వారం అట్టా ఉంది

కుండపోతగా కురుస్తున్న వానలవల్ల బీహార్ రాజధాని పాట్నాలో అనేక ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల పలు జిల్లాల్లో దాదాపు 20 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. పాట్నాలో ఆస్పత్రులు, మెడికల్ స్టోర్లు, ఆస్పత్రులు నడుం లోతు నీళ్లలో మునిగిపోయాయి.నగరంలో అన్ని వైద్య సదుపాయాలున్న అతిపెద్ద నలందా మెడికల్ కాలేజి ఆస్పత్రి కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఓ యువతి చేసిన ఫోటోషూట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిట్) స్టూడెంట్ అదితి సింగ్.. వరదల్లోనే ఫొటోషూట్ చేయించుకుంది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మెర్మైడ్ ఇన్ డిజాస్టర్-పాట్నాలో వరద సమయంలో పరిస్థితి’ అనే టైటిల్ తో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆ యువతిని ఆడేసుకుంటున్నారు. ఈ ఫొటోషూట్ కాస్త క్రియేటివ్‌గా ఉందని… వర్షం, వరదలు వస్తే ఆమె తప్పేముంది? ఆమె నిట్ స్టూడెంట్ కాబట్టి తన క్రియేటివిటీని చూపించిందని కొందరు ఆ యువతికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు ప్రజలు సమస్యల్ని చెప్పే విధానం ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Featured

SBI మెనేజర్ ఆత్మహత్య?????

SBI మెనేజర్ ఆత్మహత్య????? గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ అంకిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం తెనాలి బ్రాంచ్ కు డిప్యూటీ మేనేజర్ గా అంకిరెడ్డి వచ్చాడు. పై అధికారుల వేధింపులే తన భర్త ఆత్మహత్యకు కారణమని భార్య ఆరోపిస్తోంది. పోలీస్ విచారణలో మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది        

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

షుగర్‌ జబ్బు ఉన్నవాళ్లు భార్యకు భర్త, భర్తకు భార్య పాదపూజ చేసుకోవాలి

షుగర్‌ జబ్బుకి పాదపూజకు సంబంధం ఏమిటి? భార్యకు భర్త పాదపూజ చేయడమేమిటి? నేను చదవడం తప్పా అని అనిపిస్తుంది కదూ! తప్పేమీ లేదు మీరు చదివింది వాస్తవమే. పూజ అంటే కాళ్లు కడిగి ఆ నీళ్లను తల మీద చల్లుకుని దండం పెట్టు కోవడం కాదు. వాళ్ల కేమైనా దెబ్బలు తగిలాయా అని చూసుకోవడమే దీని అర్థం. పది సంవత్సరాలు పైబడి షుగరు ఉన్నటువంటి వాళ్లలో చాలామందిలో అరికాళ్ళలో స్పర్శ తగ్గిపోతుంది. కాళ్ళకు తగిలిన చిన్న చిన్న దెబ్బలు తెలియవు. కాళ్లలో ముల్లు గుచ్చుకున్నా, రాళ్లు వత్తుకున్నా ,చెప్పులు కరిచినా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆ గాయాలే కాళ్ళు తీసి వేయాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు .అందుకే షుగర్‌ వుండి కాళ్లకు స్పర్శ తగ్గినటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కాళ్లకు ఇలాంటి దెబ్బలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకుని ,నిర్ధారించుకుని  ఉండడం మంచిది. గాయాలు ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవడం అవసరం. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇటువంటి పరిస్థితి ఉంటే వాళ్లు వంగి వాళ్ళ కాళ్ళను చూసుకోవడం చాలామందిలో సాధ్యం కాదు అందుకే వారి జీవిత భాగస్వామి ఆ పని చేయడం మంచిది అలా రోజూ కాళ్లను రోగి బంధువులు కానీ జీవిత భాగస్వామి కానీ ఎవరో ఒకరు కాళ్ల పరిశీలన కార్యక్రమం చేయడం అవసరం. జీవిత భాగస్వామి తోనే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి తప్పక భార్యకు భర్త ,భర్తకు భార్య రోజూ కాళ్ళను పరిశుభ్రం గా ఉంచే ప్రయత్నం చేస్తే మోకాలు కిందకి కాళ్లను తీసి వేసే పరిస్థితిని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్‌ యం.వి.రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్‌) డా.రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.