Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

ఏపీలో చ‌క్రం తిప్పేందుకు బీజేపీ య‌త్నం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాగా వేయాల‌ని బీజేపీ ఎప్ప‌టి నుంచో ప్ర‌యత్నాలు చేస్తోంది. ఎలాగైనా జెండా పాతాలని ఉవ్విళ్ళూరుతోంది. అయితే స‌ఫ‌లం కావ‌డం లేదు. ఏపీలో బ‌ల‌మైన పార్టీలుగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలే ఉన్నాయి. ఆ త‌ర్వాత బీజేపీ, జ‌న‌సేన, లెఫ్ట్ పార్టీలు పార్టీలు కొన‌సాగుతున్నాయి. వైసీపీ అధికారంలో వుండ‌గా, టీడీపీ ప్ర‌తిప‌క్షంలో వుంది. ఇప్ప‌టివ‌ర‌కు నెమ్మెదిగా అడుగులు వేస్తోన్న బీజేపీ, ఇప్పుడు దూకుడు పెంచే దిశ‌గా కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టింది. తెలుగుదేశం పార్టీలో ఒక‌వైపు వరుసగా నేత‌ల అరెస్టులు, మ‌రోవైపు వ‌ల‌స‌ల‌త‌తో ఆ పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతోంది. వైసీపీలోకి మ‌రికొంత‌మంది టీడీపీ నేత‌లు జంప్ అయితే టీడీపీ ప్ర‌తిప‌క్ష హోదాను కోల్పోయే అవ‌కాశ‌ముంది. ఇదే అవకాశంగా తీసుకుని బలపడాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. అందుకు ఎత్తులు కూడా వేస్తోంది. అందులో భాగంగానే టీడీపీ నేత‌లు అక్ర‌మాలు చేసివుంటే అరెస్టు చేయ‌డం క‌రెక్ట్ అంటూ స‌మ‌ర్ధిస్తూనే, వైసీపీ త‌ప్పుల‌ను ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఏడాది పాల‌న‌పై వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళి ఎద‌గాల‌‌ని భావిస్తోంది. మ‌రోవైపు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ 2.0 పాల‌న‌లో జ‌రిగిన అభివృద్దిని వివ‌రిస్తూ క‌ర‌ప‌త్రాల‌ను ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించి, ఆ దిశ‌గా ముందుకుసాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రప్ర‌భుత్వం ఎంత స‌హాయం అందిస్తుందో, త‌ద్వారా ఎంత అభివృద్ది ప‌ధ‌కంలోకి దూసుకెళ్ళిందో తెలియ‌జేయాల‌నే కార్యాచ‌ర‌ణ‌తో పావులు క‌దుపుతోంది. ఇలా ప్ర‌తి ద‌శలోనూ బీజేపీ ప్ర‌భుత్వం చేస్తోన్న కృషిని ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా వివ‌రిస్తూ, వైసీపీని బుక్ చేయాల‌ని చూస్తోంది. ఏపీ రాజకీయాలు సామాజిక వర్గాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందువల్ల సామాజిక వర్గాల వారీగా నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాల‌ని చూస్తోంది. కేంద్రంలో ఉంది బీజేపీ ప్ర‌భుత్వ‌మే కాబట్టి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామనే భరోసా కల్పించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక‌ ఇప్పట్లో టీడీపీ కోలుకునే అవకాశం లేదని భావిస్తున్న తెలుగు త‌మ్ముళ్ళు కూడా, తమ భవిష్యత్ కోసం బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కమలం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి… ఆ పార్టీతో కలిసి సాగితే, తమ వ్యాపార వ్యవహారాలకు ఇబ్బందులు ఉండవని లెక్కలేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత‌లు క‌మ‌ల‌ద‌ళంలోకి చేరితే బీజేపీకి ఏపీలో మ‌రింత బ‌లం చేకూరుతుంది. ప్ర‌స్తుతానికి తెరవెనక సంప్రదింపులూ, సన్నాహాలూ జరుగుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు బూత్‌స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి, వాటిని స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించాల‌ని ఆలోచ‌న చేస్తోంది. బీజేపీ సిద్దాంతాలు, ప్ర‌ధాని మోడీ ఆలోచ‌నా విధాన్ని క్షేత్ర‌స్థాయిలోనూ బ‌లంగా తీసుకెళ్ళాల‌ని భావిస్తోంది. ఏపీలో 2024 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎద‌గాల‌ని ప్ర‌ణాళిక‌తో సాగుతోంది.

Featured ఆంధ్రప్రదేశ్ విజయనగరం 

వైసీపీ నెక్ట్స్ టార్గెట్ చిన‌బాబేనా ?

ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు అరెస్టుతో తెలుగుదేశం పార్టీలో వ‌ణుకు మొద‌లైంది. నిన్న‌మొన్న‌టి దాకా ఎక్క‌డో దాక్కున్న ప‌చ్చ త‌మ్ముళ్ళంతా ఇప్పుడు అక్ర‌మ అరెస్టులు చేస్తున్నారంటూ జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. అయితే ముందుంది ముస‌ళ్ళ పండ‌గ అంటూ వైసీపీ ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. ఇటీవ‌ల క్యాబినెట్ మీటింగ్ లో ఏపీ ఫైబ‌ర్ నెట్ లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, దీనిపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. అందులో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని తేలితే నారా లోకేష్ కు ఉచ్చు బిగుసుకున్న‌ట్లే. టీడీపీ హ‌యాంలో ఐటీ మంత్రిగా ప‌ని చేసిన లోకేష్ ఆంధ్రా ప్రజలకు త‌క్కువ ధ‌ర‌కే బ్రాడ్ బ్యాండ్ ఇస్తామంటూ ఏపీ ఫైబర్ గ్రిడ్ ని తెర‌పైకి తెచ్చింది. ఇందులో నిజంగా స్కామ్ జ‌రిగిందా లేదా అనే ప్ర‌స్తుతానికి తెలియ‌దు కానీ, ఒక‌వేళ ప్ర‌భుత్వం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తే, అందులో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని తేలితే మాత్రం చిన‌బాబు చిక్కుకున్న‌ట్లే. సీబీఐ కనుక పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి సారించి రంగంలోకి దిగితే.. ముందుగా అరెస్టయ్యేది వేమూరి హరిప్రసాద్. ఈఎస్ఐ స్కామ్ లో ఎలాగైతే రమేష్ కుమార్ ఏ-1 నిందితుడిగా మారారో.. హ‌రి ప్ర‌సాద్ ఏ-1 నిందితుడిగా చేర‌డం ఖాయం. గతంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంను దొంగిలించిన ఘన చరిత్ర ఈ హరిప్రసాద్ కు ఉంది. ఇక ఏ-2 అచ్చెన్నాయుడు ఎలా అరెస్ట్ అయ్యారో… లోకేష్ కు అదే గ‌తి ప‌ట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇప్ప‌టికే ఈఎస్ఐ అవినీతి తుట్టె క‌ద‌ల‌డంతో టీడీపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. పైకి గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా తెలుగు త‌మ్ముళ్ళ‌ల్లో మాత్రం భ‌యం ఆవ‌హించి వుంది. అదీగాక నారా లోకేష్ ఇటీవ‌ల “నన్ను టార్గెట్ చేయడమే మీ లక్ష్యమైతే ఆల్ ది బెస్ట్” అంటూ ట్విట్టర్ లో ఛాలెంజ్ కూడా చేశారు. ఇప్పుడు క‌న‌క వైసీపీ స‌ర్కార్ సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తే ప‌రిణామాలు ఎలా వుండ‌బోతాయ‌నేది కూడా ఊహ‌కు అంద‌ని విష‌యం. ప్ర‌స్తుతానికి మాత్రం ఫైబ‌ర్ గ్రిడ్ పై సీబీఐ విచార‌ణ చేయించాల‌ని మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకుంది. విచార‌ణ‌కు ఇంకా ఆదేశించ‌లేదు. ఆదేశిస్తే మాత్రం లోకేష్ సీబీఐని ఫేస్ చేయ‌క‌త‌ప్ప‌దు.

Featured

విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం సేవలు అభినందనీయం జాయింట్ కలెక్టర్ ✍

  పున్నమి తెలుగు దిన పత్రిక ✍ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం కు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భముగా కోవిద్-19 విపత్కర పరిస్థితులలో రక్తదాన శిబిరాన్నీ ఏర్పాటు చేసి సుమారు 50 యూనిట్స్ రక్తాన్ని సేకరించినందుకు జాయింట్ కలెక్టర్ డా. ఎన్ . ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. లాక్ డౌన్ సమయం లో రక్త నిల్వలు తరించుకు పోతున్న తరుణంలో ఎంతోమంది ముందుకు వచ్చి వారివంతు సాయంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదాతలను ప్రోత్సహించి రక్తదానం చేయించి నందుకు సుమారు 12 మందిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఈ రోజు రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ ది నీడీ సభ్యులు పార్థసారధి, రాజేష్, చైతన్య, అఖిల్ మరియు హరీష్ పాల్గొన్నారు రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడి, అమూల్యమైన సేవలను అందించినందుకు డా. ఉదయ్ శంకర్ ను రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు, రిజిస్ట్రార్ డా. యల్ . విజయ కృష్ణా రెడ్డి గారు మరియు పలువురు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

Featured

నెల్లూరు జిల్లాలో 34 కరోనా కేసులు✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నెల్లూరు జిల్లాలో తాజాగా 34 కరోనా పొజిటివ్ కేసులు నమోదయ్యాయి.నాయుడుపేటలో -1,వెంకన్నపాలెం-2,కోట-1ఓజిలి -1,బుజబుజ నెల్లూరు -1,బుచ్చి 5,ఇనమడుగు- 1,ఏఎస్పెట- 6,అరవీడు- 3,మాధవరం(చెన్నై) నమోదయ్యాయి. తాజాగా నమోదైన 25 కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 441 కి చేరింది.మరో 9 కేసులు వివరాలు తెలియాల్సి ఉంది.ఇప్పటి వరకు కరోనాతో ఐదుగురు మృతి చెందారు

Featured Others

సరస్వతీ పుత్రుడు

                                              విజయనగర చరిత్ర రచనపై తిరుగులేని ముద్ర వేసిన వ్యక్తి మన నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ ఆసూరి రంగస్వామి సరస్వతి. వీరు నేలటూరు వెంకరమణయ్య కంటే ముందే చరిత్ర పరిశోధనలో విశేష అనుభవాన్ని గడించారు. వీరి పరిశోధన ఫలాలు ఇప్పటికి ఎంతోమందికి మార్గదర్శకం అవుతున్నాయి. నెల్లూరు రంగనాయకుల పేట స్థానికుడు కాబట్టి ఆయన్ను రంగనాధ సరస్వతిగా పిలిచేవారు. పేరుకు తగ్గట్టు సరస్వతి పుత్రుడుగా చరిత్ర రచనలో మేధావిగా పేరు గడించారు.భారతీయ పురావస్తు శాఖలో సహాయ ఎపిగ్రాఫిస్టుగా పనిచేసిన ఆసూరి సరస్వతి రంగస్వామి అయ్యంగార్, నెల్లూరు పట్టణంలోని రంగనాయకుల పేటలో 17-6-1892 వ సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి ఆసూరి సరస్వతి నరసింహాచార్యులు చాలా సంవత్సరాలు నెల్లూరులోని vr హైస్కూలులో తెలుగు టీచర్ గా పనిచేశారు. వీరి పూర్వీకులు మద్రాసులో రామాయణ మహాభారతాల్లాంటి ఉద్గ్రంథాలను అచ్చు వేయించారు. వడగలి శ్రీవైష్ణవులు అయిన రంగస్వామి స్వమతాభిమానంపైన మక్కువ కలిగి ఉండేవారు వీరు నెల్లూరు వేంకటగిరి రాజా హైస్కూలులో ప్రారంభిక విద్య చదివి, మద్రాస్ పచ్చయప్ప కాలేజీలో బి.ఏ పూర్తి చేశారు. తెలుగు, తమిళము, సంస్కృతంనందు ఆపారానుభవం గడించారు. బి.ఏ తరువాత హిస్టారికల్ రీసెర్చ్ స్టూడెంట్ గా, మద్రాస్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కృష్ణస్వామి అయ్యంగార్ పంచన చేరారు. కృష్ణస్వామి తాను రచించిన విజయనగర చరిత్ర ( sources of vijayanagara history) అనే గ్రంధములో రంగస్వామి ప్రతిభ గురించి గొప్పగా చెప్పారు. వాస్తవానికి ఈ పుస్తక రచన మొత్తం రంగస్వామి పరిశోధనా కష్టంనుంచి జాలువారింది. పేరు మాత్రం కృష్ణ స్వామికి దక్కింది. ఇలాంటి ఘోస్ట్ రైటర్లు నేడు మన నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. ఒకరి పరిశోధనా కష్టాన్ని మరొకరు తమ   ” స్వంత రచనలవలె రాసుకోవడం “, నిజమైన హక్కుదార్లను ఎక్కడా ప్రస్తావించకపోవడం దుర్మార్గమైన విషయం. ఈ మధ్య కాలంలో ఇది సాంప్రదాయంగా మారింది.                                        యూనివర్సిటీ రీసెర్చ్ స్టూడెంట్ గా అనుభవం గడించిన తరువాత మద్రాస్ ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ లో సహాయకుడిగా రంగస్వామి ఉద్యోగం పొందారు. వీరి ఆధ్వర్యాన ఎన్నో చారిత్రకాంశాలు వెలుగు చూశాయి. నాగార్జున కొండ భౌద్ధ స్థూపములకు సంభందించి వీరు అపారకృషి చేశారు. వాజ్మయ ప్రకరణములే గాక మతాచారా విషయ గ్రంధములు, స్మ్రతి నిబంధన గ్రంధములు, చిత్రలేఖనం, శిల్ప గ్రంధములను పరిశోధించేవారు. శివతత్వ రత్నాకరం, విష్ణుధర్మములోని చిత్రలేఖనంపై గ్రంధము రచించారు. Mythic society journal, asiatic societry journals లో గొప్ప వ్యాసాలు రాసారు. 1) వసుబంధువు సుబంధువు ఒక్కరా, వేర్వేరు పురుషులా, 2) బోధాయనుడు, ఉపవర్షుడు 3) కృష్ణదేవ రాయుడి రాజనీతి సూత్రాలు మొదలగు విషయాలపై వ్యాసములు రాసి ఉన్నారు. కలకత్తా ఓరియంటల్ కాన్ఫెరెన్స్ లో పరిశోధనా వ్యాసాలు రాశారు. ప్రాచీన ద్రావిడ ప్రౌడకావ్యమగు ‘మణిమేఖల’ లోని ప్రమాణాలను ఉదాహరించారు.                                               మంచి వక్త కావడం చేత ఇష్టాగోష్టిలను రసవత్తరంగా నడిపించేవారు. పాతవారు కొత్తవారనే భేదంలేకుండా కలుపుగోలుతనంగా ఉండేవారు. పురాణ ఇతిహాసముల, ఉదాహరణములతో మనోహరంగా ప్రసంగించేవారు. శ్రోతలు వీరి ప్రసంగాలపై ఎంతో మక్కువ చూపేవారు. శారీరకంగా బలహీనులు కావడంచేత ఎక్కువగా రోగగ్రస్తులు అయ్యేవారు. పైగా పరిశోధనలు అంటూ ప్రయాణాలు చేయడం మూలాన వీరి ఆరోగ్యం చెడి కొన్ని నెలలు మద్రాస్ జనరల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చివరకు జులై, 11 1934 మరణించారు. అసూరి సరస్వతి రంగస్వామి అయ్యంగార్ పేరే గాకుండా రంగనాధ సరస్వతిగా, ఆసూరి సరస్వతిగా వీరిని పిలిచేవారు. నెల్లూరు జిల్లాలో ఎవరికి పెద్దగా తెలియకుండానే తన చివరిరోజులు గడచినట్టుగా సుభోధిని పత్రికలో వీరి గురించి పెద్ద వ్యాసాన్ని ప్రచురించారు.

Featured ఆంధ్రప్రదేశ్

*ఏపీ అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాకు నో ఎంట్రీ*

    అమరావతి: ఏపీలో 16నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియా కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ దృష్ట్యా మీడియా పాయింట్‌ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్‌ గ్యాలరీల వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Featured

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి

13-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో పర్యటించి, సుమారు 5 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి ఒక పైసా నిధులు ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా 15సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపిస్తాను. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు అవసరమైన పనులను మంజూరు చేయించి, 9 కోట్ల రూపాయల నిధులతో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్ట పడి పనిచేసే గిరిజనులు అభివృద్ధి పై దృష్టి పెట్టి వారికి అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తాము.టీడీపీ ప్రభుత్వ హయాంలో వైకాపా ఎమ్మెల్యే లకు నిధులివ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు లో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ ప్రారంభోత్సవాలు నాడు -నేడు కార్యక్రమంకు శంకుస్థాపన లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధిక లోటులో వున్నా ఇచ్చిన హామీలను 90శాతం అమలుచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. మందులకొనుగోలులో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు ను అరెస్టు చేస్తే బిసిలపై కక్ష సాధింపని చంద్రబాబు చెప్పారని ఈ రోజు జెసి ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేసారని ఆయన ఏసామాజిక వర్గమని ప్రశ్నించారు. అవినీతి అన్యాయంపై ఎలాంటివారినైనా క్షమించేదిలేదన్నారు. సర్వే పల్లిలో అన్నికాలనిలు అభివృద్ధి లో దూసుకుపోయేలా చేస్తామన్నారు. సంవత్సరం కాలంలో మండలంలో 12కోట్ల తో సిమెంట్ రోడ్లు 5కోట్ల తో డ్రైనేజీను నా ర్మించుకున్నామని గతంలో ఎప్పుడు ఈవిధంగా అభివృద్ధి జరగలేదని తెలిపారు.ఒక్క మనుబోలు లోనే నాలుగు కోట్ల కుపైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశామనితెలిపారు. ప్రతిపేదవాడికి తనచేతులమీదుగా ఇళ్ళ పట్టాలు అందచేస్తామన్నారు. బిసికాలనిలో గతప్రభుత్వంలో వేసినరోడ్డు రెండుసంవత్సరాల కే దెబ్బతిందని దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించి ఎంతటివారైనా వదిలేదిలేదన్నారు. అభివృద్ధి సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి చేస్తాము, కానీ అవినీతి చేస్తామంటే ఊరుకోము. ఎంతటివారైనా అవినీతి చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో అర్హులైన వారికి అన్యాయం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. సుదీర్ఘ కాలంగా స్కూల్స్ కు సంబందించిన సమస్యలు పరిష్కారం కోసం గతంలో ఎన్ని సార్లు అడిగిన నిధులు విడుదల చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడిపిస్తున్నారు కాబట్టే ప్రజలకు ముఖ్యమంత్రి గారిపై నమ్మకం ఏర్పడింది. ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాది. గతంలో పనిచేసిన ఏ ఎమ్మెల్యే అయినా ఒక్క మనుబోలు మండలంలో ఏడాది కాలంలో 17 కోట్లతో సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు నిర్మించారా! ఏడాది కాలంలోనే నేను ఎమ్మెల్యే గా మనుబోలు మండలంలో 17 కోట్లతో సిమెంటు రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించా. తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన సిమెంటు రోడ్లు లేచిపోతూ, గుంతలు పడి మున్నాళ్ల ముచ్చటగా తయారయ్యాయి. నాసిరకం సిమెంటు రోడ్ల నిర్మాణంలో బాధ్యులైన వారిపై విజిలెన్స్ విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటాం. అభివృద్ధి జరగాలని అనుకుంటాం తప్ప, అవినీతిని సహించేది లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా ఉన్నన్ని రోజులు ఎంతటి వారైనా, అవినీతికి పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు అని తెలిపారు .ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ,కడివేటిచంద్రశేఖర్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్ ,కిషోర్ నాయుడు ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి ,దాసరిమహేంద్ర వర్మ , చల్లానవకోటి, తులసి యాదవ్, వెంకటసుబ్బయ్య,గుంజి రమేష్ మండల స్థాయి అధికారులు మండల స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .

Featured

సహజ వ్యవసాయ పద్ధతిని అనుసరించాలి అనుసరిద్దాం

పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): పెట్టుబడి లేని సహజ వ్యవసాయ పద్ధతిని అనుసరిద్దాంని వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీ నాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండలంలోని గుండుగల్లు రైతు భరోసా కేంద్రంలో ఆయన స్థానిక రైతుల తో సమావేశమై పై విధంగా సూచించారు. మానవాళి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పండించే పంట లో రసాయన ఎరువులను పూర్తిగా తగ్గించి, సహజ సిద్ధి సేంద్రియ ఎరువులు ,జీవామృతం, ఔషధ మొక్కల ఆకుల కషాయం వినియోగించి సాగు పై పెట్టుబడి తగ్గించి మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. అలాగే వేరుశెనగ విత్తుకొనేందుకు తీసుకొను జాగ్రత్తలపై కూడా ఆయన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట రమణ , మండల వ్యవసాయ అధికారిని హేమలత, విఆర్ఓ కృష్ణ, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Featured

కరోనా అరికట్టెందుకు మాస్కులు తప్పనిసరి: ఎస్.ఐ సూర్యప్రకాష్ రెడ్డి

*మాస్క్ వేసుకోకపోతే ఇక ఫైన్ బాదుడే…* గ్రామాల్లో రూ.100, పట్టణాల్లో రూ.200 12-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు లో భాగంగా మండల పరిధిలోని ప్రజలు ఇళ్లలోనుంచి బైటకొచ్చేవాళ్లు కచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన విధించారు. బైక్ లపై వచ్చేవారు కానీ, ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణించేవారు కానీ కాలినడకన వచ్చేవారు కానీ విధిగా మాస్క్ ధరించాల్సిందే. ఒకవేళ అలా మాస్క్ కట్టుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 200 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారని ఈమేరకు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు అని మనుబోలు ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు . ఫైన్ విధిస్తున్నా కూడా ప్రజల్లో మార్పు రాకపోతే దాన్ని పెంచుతామని, మరిన్ని కఠిన చర్యలు అమల్లోకి తీసుకొస్తామని హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. షాపులు కస్టమర్లలో శారీరక దూరాన్ని పాటించాలని వివాహ సంబంధిత సమావేశాలు అతిథుల సంఖ్య 50 మించకూడదు అని అంత్యక్రియలు సంబంధిత సమావేశాలు: వ్యక్తుల సంఖ్య 20 మించకూడదు అనిబహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం జరిమానాతో శిక్షార్హంగా ఉంటుందని నియమాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు మొదలైనవి తీసుకోవడం నిషేధించబడింది అని బయటకు వచ్చే ఏ వ్యక్తి అయినా తన ముక్కు మరియు నోటిని కప్పి ఉంచే ఫేస్ మాస్క్ ధరించాలని మరోసారి తెలియజేస్తున్నామని ఫేస్ మాస్క్ ధరించని వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో రూ .100 / – (వంద రూపాయలు ) మరియు పట్టణ ప్రాంతాల్లో రూ .200 / – (రెండు వందల రూపాయలు ) తో జరిమానా విధిస్తారని . 188 ఐపిసి ఈ ఉత్తర్వులు విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి అని సుమారు 65 సంవత్సరాల వయస్సు ఉన్నవారు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు,అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇంట్లో ఉండాలని సూచించారు. పై నిబంధనలు ప్రజలందరూ పాటించి కరోన వ్యాప్తిని అరికట్టెందుకు పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు.

Featured

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు తీరును నిరసిస్తూ పలమనేరు టీడీపీ నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి సుమారు 100 పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆ అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయం అన్నారు దీన్ని కండిస్తూ తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందుశెట్టి, బాలాజీ రాయల్,పాలబాబు, బ్రహ్మయ్య , సుబ్రమణ్యం గౌడు, క్రిష్ణమూర్తి,ఆర్బీసి కుట్టి, ఎస్సీ సెల్ నాగరాజు, గిరిబాబు, చిన్ని,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.