Thursday, 5 March 2026

Blog

Featured

మనుబోలు మండలం లో రెండో రోజు జోరుగా సాగిన నామినేషన్లు.

మనుబోలు (పున్నమి విలేకరి)11,ఫిబ్రవరి :మనుబోలు మండలంలో గురువారం రెండో రోజు నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగింది మండలం లోని కట్టువవల్లిలో వైకాపా బలపరచిన అభ్యర్థి ఎస్ భారతమ్మ నామినేషన్ ను గుండాల ఆదినారాయణ జానకిరెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు. అదేవిధంగా కొలనుకుదురు టీడీపీ బలపరచిన అభ్యర్థి కసిరెడ్డి సునీల్ రెడ్డి నామినేషన్ వేశారు. అక్కంపేట వైకాపా బలపరచిన ఆభ్యర్ధి జాంబవతమ్మ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. వీరంపల్లిలో వైకాపా బలపరచిన అభ్యర్థి సుధాకర్ జెట్టి సురేంద్ర ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు.కొమ్మలపూడి లో రఘరామయ్య టీడీపీ బలపరచిన అభ్యర్థి గా శేషురెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. మానిటెరింగ్ అధీకారి సమాచారం మేరకు మూడుగంటల సమయానికి 30సర్పంచ్ అభ్యర్థులు. 172 వార్డుమెంబర్లకు నామినేషన్ లు దాఖలయ్యాయి. ఇదిలా వుండగా జట్లకొండూరు నామినేషన్ కేంద్రాన్ని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ తనిఖీ చేసి ఆర్వోలకు పలుసూచనలు సలహాలు చేశారు. ఎస్ఐ ముత్యాలరావు ఆధ్వర్యంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నాగరాజు ఆర్డీవో తోపాటు వున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

అనంత సాగరంలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్సార్ సీపీ ప్రచారం

అనంతసాగరం గ్రామంలో ముమ్మరంగా కొనసాగుతున్న వైసిపి ప్రచారం అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అఖండ మెజారిటీతో గెలిపించాలని బట్రెడ్డి జనార్దన్ రెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థి బొర్రాశోభ గారితో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ ఆత్మీయ నాయకుడి తో కలిసి అభిమానులు, కార్యకర్తలు అడుగులు కలపడంతో జనసంద్రంగా మారిన వీధులు.ప్రతి ఇంటికి పెన్నా నీటిని అందిస్తామని ఇప్పటికే 36 లక్షలు ఫండ్ శాంక్షన్ అయిందని ఎలక్షన్ కోడ్ కారణంగా పనులు ఆపేసి ఉన్నామని కోడ్ ముగిసిన వెంటనే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామమంతా పరిశుభ్రంగా ఉంచేందుకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసేందుకు గ్రామంలోని చెత్తను సేకరించేందుకు పారిశుద్ధ్య కార్మికులను నియమించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని , సిమెంట్ రోడ్లు లేని ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు.

Featured ఆంధ్రప్రదేశ్

మినగల్లు వైసీపీ సర్పంచ్, వార్డ్ మెంబర్ల నామినేషన్లు..

బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 10 ( పున్నమి విలేకరి ) మండలంలోని మినగల్లు గ్రామ పంచాయతీ సర్పంచి స్థానానికి వైసిపి మహిళ అభ్యర్థిగా అల్లం నిర్మలమ్మ మరియు 12 మంది వార్డ్ మెంబర్ లు పంచేడు గ్రామ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మినగల్లు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ లు అభ్యర్థులుగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి, మండల నాయకులు సురా శ్రీనివాసులు రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్, వార్డ్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచి చూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెము మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured

బి అగ్రహారం లో అవార్డు ఎన్జీవో వారిచే రైతు సమావేశం ఏర్పాటు

అనంతసాగరం మండలం బి. అగ్రహారం నందు అవార్డు ఎన్జీవో వారి ఆధ్వర్యంలో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో అనంతసాగరం రైతు ఉత్పత్తి దారుల సంఘం ఎఫ్ పి ఓ యొక్క మీటింగ్ జరిగినది ఈ మీటింగ్ ముఖ్యఅతిథిగా అనంతసాగరం మండలం యొక్క హార్టీకల్చర్ ఆఫీస్ హెచ్ ఒ మేడం లక్ష్మీ గారు వచ్చినారు వారు రైతులతో మాట్లాడుతూ రైతులు ఎఫ్ బి ఓ ను ఏర్పాటు చేసుకొనుట వలన రైతు సోదరులకు కలుగు లాభాలను గురించి మరియు యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉపయోగపడతాయని మరియు వారి నిధుల గురించి చక్కగా వివరించారు. ఎఫ్ బి ఓ రిజిస్టర్ గురించి చెప్పి మరియు రైతులందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలని చెప్పినారు. దాని ద్వారా రైతులు పండించిన పంటలను నేరుగా రైతులు అమ్ముకోవచ్చని తెలిపినారు. నాబార్డు వారు 75% మరియు తక్కువ ధరకు నాణ్యమైన ఎరువులు మరియు మందులు పంపిణీ చేయగలరని చెప్పినారు. ఈ సమావేశానికి ఎఫ్ బి ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఎఫ్ బి ఓ డైరెక్టర్ మరియు ఎఫ్ పి ఓ అధ్యక్షులు ఏ. అంకిరెడ్డి  గారు ,రామానుజుల రెడ్డి గారు ,వెంకటేశ్వర్లు ,ఎస్. సుబ్బారావు గారు,నర్రా వెంకట్రామయ్య ,పెంచల్ రెడ్డి ఇ మరియు అవార్డ్ ఎన్జీవో స్టాఫ్ శరత్ గారు,సహదేవ్ హాజరయ్యారు.

Featured ఆంధ్రప్రదేశ్

జొన్నవాడ క్షేత్రాన్ని దర్శించుకున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇన్కమ్ టాక్స్ కమిషనర్

బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 8 ( పున్నమి విలేఖరి ) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ఆదాయ పన్ను కమీషనర్ పీయూష్ సొంకర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బుచ్చిరెడ్డిపాలెము మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శ్రీవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  ఆలయ కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి  వారికి ఆలయ సంప్రదాయం స్వాగతం పలికారు, శ్రీవార్ల సన్నిధిలలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కమీషనర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రములతో ఆశీర్వచనం అందజేశారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీవార్ల శేష వస్త్రాలు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు ఆదాయపన్ను జాయింట్ కమిషనర్ డా. ఎస్ కె సెంథిల్ కుమార్ మరియు నెల్లూరు ఆదాయపన్ను అధికారి శ్రీ ఎం బాలేశ్వర్ సింగ్ శ్రీవార్లను దర్శించుకున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కును కాపాడుకుందాం….

బుచ్చిరెడ్డిపాలెం జనవరి 8 ( పున్నమి విలేఖరి ) విశాఖపట్నం లో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడు పైన ఉన్నదని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం తాసిల్దార్ కార్యాలయం వద్ద ఇరు పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1966 నుండి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నా ఈ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులు తమ ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్నరు. విశాఖ ఉక్కు సాధన కోసం 32 మంది ప్రజలు తన ప్రాణ త్యాగం చేశారు. అనేక రోజులపాటు నాయకులు నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు, రక్తాన్నిచిందీంచడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఇక్కడ కర్మాగారాన్ని స్థాపించేందుకు నిర్ణయించిందన్నారు. దీని నిర్మణానికి అనేక సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నష్టాల్లో ఉందన్న కారణం చూపించి కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి పూనుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి గనుల కేటాయించనందువల్లనే నష్టాలు వస్తున్నాయని వారు తెలిపారు. గనులు కేటాయించకుండా కర్మాగారాన్ని తమ అనుచర గుత్తేదారులకు అమ్మేందుకు ప్రయత్నించదాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో లో సిపిఎం పార్టీ నాయకులు షేక్ జానీ భాష, పోతంశెట్టి శ్రీనివాసులు, పటాన్ బాబు, యువజన సంఘం నాయకులు షేక్ కరీముల్లా, దుర్గా ప్రసాదు, పుగార రాజా, సిఐటియు నాయకులు షేక్ మునీర్ అహ్మద్, మల్లికార్జున కాంగ్రెస్ పార్టీ నాయకులు బిట్టా కిషోర్, పచ్చా మధు, కోవూరు మహేష్, షేక్ సర్దార్, షేక్ షాకీర్, కనిగెల్పుల సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్‌ ‌పాలసీలు !

ఈ ఆర్టికల్‌ ‌క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యంగా మేనేజిమెంటు వారి కోసం, పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయిలో ఉన్న మేనేజర్‌ల కోసం రాయబడింది. ముఖ్యంగా శెలవు మంజూరు చేసే, లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం. ‘శెలవు’ అనేది తమ హక్కుగా ఉద్యోగులు భావిస్తారు. శెలవు అనేది బాధ్యతగా వాడాలనీ, అవసరం ఉంటేనే వాడాలనీ, ఉన్నాయి కదా? సంవత్సరాంతంలో మిగిలి పోయాయి కదా ? ‘మురిగి పోతాయేమో’ (వాడని లీవులు) అని అవసరం ఉన్నా లేకున్నా డిసెంబరులో సగం రోజులు శెలవు పెట్టే ప్రాక్టీసును పై అధికారులు హర్షించరు!! సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్‌ ‌వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ‌ఫ్రం హోం) సమూలంగా మార్చి వేసింది. ఉద్యోగినీ ఉద్యోగులు, పై స్థాయి మేనేజర్‌ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది. కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. సెలవు దొరకడం అత్యంత కష్టమైన , అత్యవసర సర్విసుల లో (ప్రభుత్వ మరియు ప్రైవేటు) పని చేసే కొందరు మిత్రులతో మాట్లాడుతూనే ఉన్నాను. ‘‘మీ దగ్గర శెలవు దొరకడం కష్టం కదా? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి?’’అని. ఒక గుడ్‌ ‌న్యూసు ఏమిటంటే, చాలా చోట్ల, మన వాడు ఫోన్‌ ‌చేసి, ‘నాకు జలుబు దగ్గు ఉంది సార్‌ / ‌మేడం ! మాస్కు కట్టుకుని రానా మరి?’ అని దాదాపు బెదిరించే టెర్రరిష్టు ధోరణిలో అడగడం, పై వారేమో ‘ఆహా వద్దు వద్దు ! కావాలంటే నువ్వు వారం శెలవు తీసుకో !’ అని ‘ఆరోగ్యం జాగ్రత్త’ అని ముక్తాయిస్తున్నారట! మన వాళ్ళు కొంత రిలీఫ్‌తో చెప్పారు. మీరు ఒక కంపెనీని నడుపుతూ ఉంటే, లేదా మీరు పర్యవేక్షక / లేదా పై స్థాయిలో పని చేసే సీనియర్‌ అధికారి (ణి) అయితే, మా వైపు నుంచి కొన్ని విజ్ఞప్తులు! (1) కుటుంబ సభ్యులని కోల్పోయిన ఉద్యోగులు దుఃఖంతో ఉంటారు. దశదిన కర్మ కంటే ఎక్కువ రోజులు, వారు మానసికంగా కోలుకునే వరకూ జీతం కూడిన లీవు ఇవ్వండి. (2) వారు శెలవులో ఉన్నప్పుడు, రెండు మూడు సార్లు ఫోన్‌ ‌చెయ్యండి. ఏమైనా సహాయం కావాలా అడగండి. ఇల్లు దగ్గర ఉంటే ఒకసారి పర్సనల్‌గా వెళ్ళి పరామర్శించండి. డబ్బు సాయం, ఆఫీసు నుంచి అడ్వాన్సు ఇప్పించడం, ఏవైనా ఆఫీసుల నుంచి నింపవలసిన దస్తావేజులు ఉంటే వాటిని తెప్పించి ఇవ్వడం, ఇలా ఏదైనా? (3) ఎవరెవరు చనిపోతే జీతంతో కూడిన లీవు ఇవ్వాలి? ఈ కరోనా సమయంలో ఇది సంక్లిష్టమైన ప్రశ్న. కేవలం కుటుంబానికే పరిమితం చేయకండి! (4) ‌మన మందరం ఎన్నో సంఘటనలు చూశాం, చదివాం. మన లొకాలిటీలో ఎవరో కరోనా బారిన పడి చనిపోతారు. వారి పిల్లలు పెళ్ళయి, ఇక్కడ లేక పోవచ్చు. ఈ దేశంలోనే లేక పోవచ్చు. వారు వచ్చే దాకా, చుట్టు పక్కల వారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు. శవాన్ని ఐస్‌ ‌బాక్సులో ఉంచడం లాంటివి . అందరూ ఉండి, ఆపత్కాలంలో ఎవరూ లేని అనాధలుగా చనిపోయే దయనీయ స్థితులను గత సంవత్సర కాలంగా ఎన్నో చూశాం కాబట్టి, కేవలం భార్య / భర్త / పిల్లలు / తల్లిదండ్రులే కాక, అత్త, పిన్ని, బాబాయి, మామయ్య ,చుట్టాలు, పక్కాలు, ఇలా ఎవరు హఠాత్తుగా గతించినా, మీ ఉద్యోగులలో ఒకరు ఆ కారణంగా లీవు అడిగినా, ఈ విపత్కర సమయంలో కాదనకండి, కాస్త పెద్ద మనసు చేసుకుని, మంజూరు చేయండి. ఏమి జరుగుతోందో, కనిపెట్టి ఉండి, కనుక్కోండి. (5) మీకు వాస్తవం తెలిస్తే, మీ ఉద్యోగి (ని) మరణానికి సంబంధించిన డెత్‌ ‌సర్టిఫికేటు, శ్మశానం నుంచి పత్రం, లేక డాక్టర్‌ ‌సర్టిఫికేటు, అలాంటివి అడగకండి . మరీ తప్పని సరి అయితే తప్ప, ఇలాంటి దస్తావేజులు లేకుండానే లీవు అప్రూవ్‌ అయేలా చూడండి. (6) మీ సంస్థ, ఎవరైనా సైకాలజిస్టుతో వ్యాపార ఒప్పందం అయి ఉందా? విపరీమైన మానసిక వత్తిడి ఉండి, పనిలో లీనం కాలేకపోతున్న ఉద్యోగులకు కాస్త కౌన్సెలింగ్‌ ఇప్పించండి. కంపెనీ ఖర్చుతో. ఆ సమయంలో అది వారికి అవసరం కావచ్చు. వీటిలో ఏవి వీలైతే అవి మీ సంస్థలో అమలు చేయండి. ఈ దేశం, ఆ దేశం అని కాకుండా, ప్రపంచం మొత్తం ఇలాంటి జీవన్మరణ సమస్యలో ఉన్నప్పుడు, మనం ఒకరి పట్ల ఒకరు కారుణ్యంతో, కాస్త పెద్ద మనసుతో మెలగడమే పరిష్కారం. ఆపత్కాలంలో మీరు చేసిన మేలు, మీ ఉద్యోగులు ఎన్నటికీ మరిచిపోరు. చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు. పదిమందికి చెబుతారు. C.V.Ramana, Hyderabad

Featured ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుచ్చి లో ఆర్డీవో పర్యటన

బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు జిల్లా ఆర్డివో హుస్సేన్ సాహెబ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, తాసిల్దార్ లకు ఎన్నికలు నిర్వహించవలసిన విధివిధానాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించబడునని, 16వ తేదీ ఉపసంహరణలను పరిశీలించి పూర్తి నివేదిక అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహారావు, తాసిల్దార్ షఫీ మాలిక్, స్పెషల్ ఆఫీసర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

వైసిపి నుండి టిడిపిలోకి వలస

బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామనికి చెందిన వైసీపీ పార్టీ చెందిన సీనియర్ నాయకులు ఆళ్ల శివ అతని అనుచరులతో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యమ్ వి శేషయ్య మరియు తెలుగుదేశం పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆద్వర్యంలో కోవూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెంపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు..

Featured ఆంధ్రప్రదేశ్

నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు

నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు వెంకటాచలం, ఫిబ్రవరి 7 (పున్నమి విలేఖరి): మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంఏఓ మంజుల ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటిఎంఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు. పంటల యాజమాన్య పద్ధతులు, ఈ పంట నమోదు – ఆవశ్యకత, ధాన్యం కొనుగోలు కేంద్రాలు – నాణ్యత ప్రమాణాలు, తదితర విషయాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.