Friday, 6 March 2026

Blog

Featured

104సేవలు సద్వినియోగం సేసుకోండి. డాక్టర్ ప్. వి. కిషోర్

104సేవలు సద్వినియోగం సేసుకోండి. డాక్టర్ ప్. వి. కిషోర్ మర్రిపాడు :పీబ్రవరి 15(పున్నమివిలేకరి ) మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి గ్రామ సచివాలయం నందు 104 వాహనం రావడం జరిగింది. ఈ కార్యక్రమం లో దీర్ఘకాలిక జబ్బులు ఉన్నటువంటి షుగర్,బిపి,అలర్జీ,ఆస్తమా థైరాయిడ్ ఉన్నటువంటి వారికీ డాక్టర్ జి.బాలాజీ అశోక్ గారుపరీక్షలు జరిపి ఒక నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.మొబైల్ మెడికల్ క్లినిక్ ప్రోగ్రాం ని ఉద్దేశించి డాక్టర్ జి బాలాజీ అశోక్ మాట్లాడుతూ ప్రతిఒక్క గర్భవతి కి ECG తీయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు అందించు సలహాలు,సూచనలు, పాటిస్తూ పౌష్టి కాహారం తీసుకొంటు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ ఎస్.కె ఖాజామోహిద్దీన్ హెచ్ వి సంపూర్ణమ్మ,MLHP రజిని,సచివాలయ ఏ ఎన్ యం.యం.లావణ్య,ఆశ,అనిత,DEO ప్రసన్న,పైలట్,ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.  

Featured

కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?*

  *25 ఏళ్లలీజు ముసుగులో దేశంలోనే పర్యావరణహితమైన ప్రాజెక్టుగా పేరుపొందిన థర్మల్ ప్లాంటును అదానీ పరంచేస్తే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం.* *ఈ పవర్ ప్లాంట్ పరిస్థితిపై ఏనాడైనా విద్యుత్ శాఖ మంత్రి ఒక్క గంటైనా సమీక్ష చేశారా?* *థర్మల్ పవర్ ప్లాంటుకు ఆస్ట్రేలియా నుంచి 4లక్షల టన్నుల మట్టిబొగ్గు సరఫరా చేసింది అరబిందో కంపెనీ వారికి చెందిన నాలెడ్జ్ కంపెనీ కాదా?* *మట్టితో కూడిన బొగ్గుని సరఫరా చేసిన కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?* *ఆ కంపెనీనుంచి బొగ్గు సరఫరా చేసుకోవాలని చెప్పిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?* *సీఎం ఆదేశాలతో విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అంతాతానై వ్యవహరిస్తున్నారు* *సీఎం మెప్పు కోసం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యం చెప్పిందల్లా వింటూ శ్రీకాంత్ విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నారు* *షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యం షాడో విద్యుత్ మంత్రిగా వ్యవహరిస్తోంది* *అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* 2400 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్) ను చేపట్టారు తొలి యూనిట్ 800మెగావాట్ల సామర్థ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైతే, రెండో యూనిట్ 800మెగావాట్ల సామర్థ్యంతో టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ దేశంలోనే తొలి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ లో, తొలిరెండుదశల్లో 1600యూనిట్ల చొప్పున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. మూడో యూనిట్ పనులు 97శాతం వరకు పూర్తయ్యాయి. 1200 ఎకరాల్లో రూ.21వేల కోట్ల పెట్టుబడితో గత ప్రభుత్వాలు, సీఎంలు, ఎంతో ప్రతిష్టాత్మకమైన థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తే, ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడం అన్యాయం అదానీ సంస్థకు కృష్ణపట్నం పోర్టును అప్పగించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్ కూడా ధారాధత్తం చేయడానికి సిద్ధమయ్యారు. 400 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, 1200 మంది పరోక్షంగా దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. కనస్ట్రక్షన్ ఉద్యోగులతో కలిపి దాదాపు 3వేలమంది బతుకులు ప్రాజెక్టుపై ఆధారపడిఉన్నాయి. ఇంతటి కీలక పవర్ ప్రాజెక్ట్ ని ప్రైవేట్ పరం చేసే హక్కు, ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న వారు, దానితో సరిసమానమైన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎలా ప్రైవీటీకరిస్తారు బొగ్గు నిల్వలు సరిపడా నిల్వచేసుకోకుండా, థర్మల్ ప్లాంట్ నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం 10 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు థర్మల్ పవర్ ప్లాంట్లలో పెట్టుకోవాలని రాష్ట్రాలకు చెబితే, ఏపీ ప్రభుత్వం రెండు, మూడు రోజుల నిల్వలు కూడా ఉంచలేని స్థితిలో ఎందుకుంది బొగ్గు నిల్వలకు ప్రభుత్వం ఏటా రుసుము చెల్లించాలి. అది చేయలేకనే బొగ్గు నిల్వ చేసుకోలేకపోతున్నారా? కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను అదానీ పరంచేయడానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది కాదా? 2020 జనవరిలో ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న 4 లక్షల టన్నుల బొగ్గు మట్టితో కూడి ఉందని, దాంతో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని అప్పట్లోనే కార్మికులంతా ధర్నాకు దిగారు. అయినా వినిపించుకోకుండా ఆ బొగ్గుని విద్యుత్ వినియోగానికి వాడారు. ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలపడంతో పెడుతున్నారని లక్ష టన్నులు మాత్రమే వినియోగించలేదు. ఎర్రమట్టి కలిసిన లక్ష టన్నుల బొగ్గు ఇప్పటికీ అలానే నిల్వఉంది. దాన్ని సగం ధరకు కూడా ఈప్రభుత్వం అమ్మలేకపోయింది. ఆస్ట్రేలియా నుంచి ఆనాడు దిగుమతి అయిన బొగ్గు నాలెడ్జ్ కంపెనీ నుంచి వచ్చింది. ఆ నాలెడ్జ్ కంపెనీ విజయసాయిరెడ్డికి చెందిన అరబిందో పరిశ్రమకు చెందినది. సీఎం తన బంధువులకు మేలు చేయడం కోసం ఆఖరికి థర్మల్ ప్లాంట్ నే మూతపడేసేందుకు దిగజారాడు. దాని విలువ సుమారు రూ.700 కోట్లు, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటుపై ఒక గంట పాటు సమీక్ష చేసే స్థితిలోకూడా విద్యుత్ శాఖ మంత్రి లేరా? విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సీఎం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ, అంతాతానై వ్యవహరిస్తున్నాడు. ఆఖరికి ట్రాన్స్ ఫార్మర్లు కావాలన్నా శ్రీకాంత్ అనుమతి కావాల్సిందే. ఒక రెడ్డి గారికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ పెత్తనం సాగుతోంది సదరు కంపెనీ యజమాని సిఫార్సుతో మూడు ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ విభాగాలకు రిటైరైన వ్యక్తులను తీసుకొచ్చి, పదవులు కట్టబెట్టారు. విజయవాడలోని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్థన్ రెడ్డి వైసీపీ నేత బంధువు కాదా? ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్లు, ఫ్యూజులు సహా అన్నీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నుంచే వస్తున్నాయి. వెయ్యి రూపాయలుండే సింగిల్ ఫేజ్ మీటరును షిర్డీసాయినుంచి రూ.1500లకు పవర్ జనరేషన్ కంపెనీలు కొనాలా? రూ.1,30,000 విలువైన ట్రాన్స్ ఫార్మర్ ని , రూ.1,75,000లకు కొనాలా? రూ.10వేల విలువైన ఫీజ్ సెట్ బాక్స్ స్థానంలో టెక్నాలజీపేరుతో ఎంసీబీ బాక్స్ లని పెట్టారు. దాన్ని రూ.30వేలకు కొంటున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ముందు సీపీడీసీఎల్ ఎండీ పద్మాజనార్థన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తారు ఆ తరువాత రాష్ట్రమంతా అమలయ్యేలా చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో షాడో ఎలక్ట్రిసిటీ మంత్రిగా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తోంది. రాష్ట్ర విద్యుత్ రంగం సర్వనాశనమయ్యేలా వారు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అంతా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు చేసేటప్పుడు, ఇక ప్రభుత్వం దేనికుందని ప్రశ్నిస్తున్నాం? సీలేరులోని హైడ్రోపవర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కు కూడా రివర్స్ టెండర్లు పిలవండి. ఎవరు తక్కువధరకు హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి, ఎన్ని సంవత్సరాలకు పవర్ ఉత్పత్తిచేస్తారో ఆలోచించి టెండర్లు పిలవండి. పెట్టుబడి పెట్టలేని ప్రభుత్వం థర్మ ల్ పవర్ స్టేషన్లను ప్రైవేట్ పరం చేసుకుంటూపోతే, చివరకు రాష్ట్రం చీకట్లలో మగ్గడంఖాయం. పోలవరంలోని హైడల్ పవర్ ప్రాజెక్ట్ నవయుగకంపెనీకి వస్తే, దాన్ని రద్దుచేసి ఈ ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు పిలిచాడు. నవయుగ కంపెనీ పెట్టుబడులు పెట్టాక, ప్రభుత్వం రూ.500కోట్లు వెచ్చించాక, ఆ.కంపెనీ టెండర్లు రద్దు చేశారు. టెండర్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చిన రూ.300 కోట్ల నష్టాన్ని ఎవరు బరిస్తారు? ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మట్టిబొగ్గు కారణంగా వచ్చిన రూ.700 కోట్లు, విద్యుత్ ఉత్పత్తి నిలిచిన కారణంగా వాటిల్లిన వేల కోట్ల నష్టాన్ని ఎవరు బరిస్తారు ఇలా అనేక పాపాలు ఈ ప్రభుత్వ నిర్వాకంతో జరగలేదా? ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిచేయాలంటే 0.5శాతం ఉద్యోగులు కావాలి. కానీ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్లో 0.2కంటే తక్కువమంది ఉద్యోగులే ఉత్పత్తిచేస్తున్నారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ దేశానికే మోడల్. అలాంటి కంపెనీని అదానీ పరంచేస్తామంటే ఊరుకోం..తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నాం 25 ఏళ్లపాటు లీజు అని పైకిచెబుతూ థర్మల్ పవర్ స్టేషన్ ని అదానీ సంస్థ పరం చేయాలనిచూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నాం. 25 ఏళ్ల తర్వాత థర్మల్ ప్లాంట్ మొత్తం తుక్కుతుక్కుఅయితే అప్పుడుఎవరు బాధ్యత తీసుకుం టారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం, ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి మేలుచేస్తున్న కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటును ఎలా ప్రైవేట్ పరంచేస్తుంది?

Featured

పి ఆర్ ఉద్యోగుల నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన : ఆనం అరుణమ్మ

ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నెల్లూరు నూతన సంవత్సరం సందర్భంగా 2022 నూతన క్యాలెండర్ ను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ  మరియు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి  శ్రీనివాసరావు  చేతుల మీదుగా గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య భోగ్యం రమేష్ బాబు జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ కుమార్ అనిల్ శ్రీధర్ శీను కరం తుల్లా దేవ ప్రసన్న కుమార్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

గూడూరు లోని శ్రీ సాయి సత్సంగం నిలయంలో మహామృత్యుంజయ హోమం

శ్రీ సాయి సత్సంగం నిలయం కోటా సునీల్ కుమార్, జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గూడూరు లోని శ్రీ సాయి సత్సంగం నిలయంలో మహామృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, రుద్ర హోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి  హోమం, ఆయుష్షు హోమం, దుర్గా త్రిశతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్  డాక్టర్ ఎల్. విజయ్ కృష్ణ రెడ్డి హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల కోసం విక్రమసింహపురి యూనివర్సిటీ లో అందిస్తున్న  కోర్సులను వివరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్,  జర్నలిస్ట్ ఫ్రెండ్స్  నాగరాజు, పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 110 మంది జర్నలిస్టులకు రైస్ బ్యాగ్, నిత్యవసర వస్తువులను విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్టర్ విజయ్ కృష్ణా రెడ్డి అందజేశారు.. ఈ సందర్భంగా సాయి సత్సంగం నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ లో జర్నలిజం కోర్స్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఇస్తున్న సబ్సిడీ పోను మిగిలిన  ఫీజును తాను అందజేస్తామని ప్రకటించారు.

Featured

పడమటి కంభంపాడు ఇసుక రీచ్ లో గ్రామస్తుల ఆందోళన

*పడమటి కంభంపాడు ఇసుక రిచ్ లో ఉద్రిక్తత* *భారీగా తరలివచ్చి గ్రామస్థులు* *యంత్రాలు..లారీలు అడ్డంగా కింద పడుకున్న వైనం* *నిబంధనలుకు విరుద్ధంగా.. అక్రమ రవాణా జరుగుతుందంటూ ఆందోళన* *అధికారులు మొద్దు నిద్ర పోతున్నట్టు ఆగ్రహం* *భూగర్భజలాలు అడుగంటుతున్నాయంటూ ఆవేదన* *త్రాగడానికి మంచినీళ్లు లేక అల్లాడుతున్నామంటూ ఆగ్రహం* *రాత్రి..పగలు తేడా లేకుండా జోరుగా అక్రమ రవాణా* *కన్నెర్ర చేసిన పీకే.పాడు పంచాయతీ ప్రజలు* *పోలీసులు మొహరింపు* *కూలీల నోరు కొడుతున్న బడా బాబులు* *అడిగే వారు ఎవరు* అనంతసాగరం మండలం లోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్ లో శుక్రవారం పడమటి కంభంపాడు సర్పంచ్ కత్తి లావణ్య అద్వర్యం లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ కత్తి లావణ్య మాట్లాడుతూ ఇసుక త్రావకాల ద్వారా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని తద్వారా మూడు గ్రామాలకు త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.ప్రొక్లెయిన్లతోటి విచ్చల విడిగా ఎక్కడపడితే అక్కడ లెక్కపక్క లేకుండా త్రవ్వకాలు సాగిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో కూలీల ద్వారా ఇసుక పోసేవారు.అయితే ఇప్పుడు యంత్రాలతో లోడింగ్ చేయడం తో కూలీలు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులకు గురిఅవుతున్నారు.జిల్లా ఉన్నతాధికారులుకు ఎన్ని సార్లు పిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక పోవడంతో ఆందోళనకు డిగామన్నారు.దీంతో లారీలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఉన్నతాధికారులు మాకు ఉపాది కల్పించాలని కూలీలు కోరారు.ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకోవాలని పీకే.పాడు పంచాయితీ ప్రజలు కోరారు..

Featured

మనుబోలులో భాజపా మండల అధ్యక్షుడు ఓడూరు ఆధ్వర్యంలో సేవ-హి-సంఘటన

మనుబోలు (పున్నమి విలేఖరి)30,మే: ప్రధానమంత్రి గా నరేంద్రమోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం మరియు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సేవ-హి-సంఘటన్ కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ మనుబోలు మండల అధ్యక్షులు ఓడూరు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు సేవా- హి -సంఘటన్ సేవాకార్యక్రమాలుచేపడుతున్నామని తెలియజేశారు మొదటి రోజు మనుబోలు మండల ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియా విలేకరులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ మరియు 108 సిబ్బందికి కూరగాయలు మరియు యాత్రికులకు ఆహార ప్యాకెట్లు ,నీళ్ల బాటిల్ లు పంపిణీ చేశారు . ఆహారం ప్యాకెట్లు మరియు నీళ్ళ బాటి ళ్లు మహత్తరమైన కార్యక్రమానికి మనందరం ఒకరికొకరు తోడై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుదాం సామాన్యులకు సహాయ పడదాం అని అన్నారు రోజురోజుకు కొవిడ్​ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయని… ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు.

Featured

జర్నలిస్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు

మనుబోలు (పున్నమి విలేకరి)30,మే:కరోనా కల్లోలంలో మృత్యువాత పడిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బిజేపి జిల్లా నేత బోల శ్రీనివాసులు డిమాండ్ చేశారు .పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది ఏఎన్ఎం లకు 50 లక్షలు బీమా ప్రకటించిన ప్రభుత్వం జర్నలిస్టు సేవలను కూడా గుర్తించి వారికి కూడా 50 లక్షల బీమా ప్రకటించాలని కోరారు. కుటుంబాలను వదిలేసి అంకితభావంతో ముందుకు సాగుతున్న జర్నలిస్టుల ను ఆదుకోవాలని కోరారు. వార్తలు సేకరించడం లో పని ఒత్తిడి వేగంగా వార్తలు సేకరించడం లో ఎందరో జర్నలిస్టులు కరోనా కాటుకు బలయ్యారు అని ఆయన గుర్తు చేశారు. వారి కుటుంబాలు వీధిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే తగినంత సాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విలయతాండవం లో జర్నలిస్టు చేస్తున్న సేవలు మరువలేనివని సంబంధిత మంత్రి స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. పక్క రాష్ట్ర మైన తమిళనాడు ప్రభుత్వం పదిలక్షలు మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రకటించి అండగా నిలిచిందన్నారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని పేర్కొన్నారు..

ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేడు నమోదైన కరోనా వివరాలు

  పున్నమి తెలుగు పత్రిక ✍️✍️ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1,17,027కి చేరింది. వైద్యఆరోగ్యశాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. జిల్లాలో ప్రస్తుతం 14,456 మంది కోవిడ్ తో చికిత్స పొందుతుండగా ఆరుమంది మహమ్మారి కి బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 809కి చేరింది.

Featured హెల్త్ టిప్స్

శారీరకంగా కొత్త ప్రాబ్లెమ్స్ వచ్చిపడతాయి.: పారిష్కరం మీకు నచ్చిన డైటీషన్ తో మాట్లాడి పరిష్కరించు కోగలరు

కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఈ సమ్మర్ లో ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఏం చేయాలో తోచకల ఇబ్బంది పడుతున్నారు చాలామంది. దాంతో పగలు కూడా నిద్రపోవడం, రాత్రిళ్లు లేట్‌గా పడుకోవడం లేదా మేల్కొని ఉండడం లాంటివి చేస్తున్నారు. కానీ నిద్ర ఎప్పుడు, ఎంత ఉండాలో అంత ఉంటేనే మంచిది. లేకపోతే మానసికంగా, శారీరకంగా కొత్త ప్రాబ్లెమ్స్ వచ్చిపడతాయి. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనని అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చేసేదేమీ లేక పోవాల్సినదానికంటే కాస్త ఎక్కువే నిద్ర పోతున్నారు. అయితే ఎక్కువగా నిద్ర పోవడం వల్ల రక్తంలో -రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-లు పెరిగిపోయి బీపీ, టైప్-2 డయాబెటీస్‌‌తో పాటు గుండె సమస్యలు కూడా వస్తాయి. నిద్ర ఎక్కువైతే.. చిరాకు, కోపం, అసహనం లాంటివి కూడా పెరుగుతాయి. ముఖ్యంగా పగటి పూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల బరువు పెరగడం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే వయసుకు తగ్గట్టు నిద్రించే సమయాన్ని పాటించాలి. ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. వయసుల వారీగా.. వయసుని బట్టి నిద్రపోయే టైంను ప్లాన్ చేసుకోవాలి. నాలుగు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు 11 నుంచి 12 గంటల వరకు నిద్ర అవసరం. ఐదు నుంచి ఎనిమిదేళ్ల వయసు పిల్లలు కనీసం పది గంటలైనా నిద్రపోవాలి. అలాగే ఎదిగే వయసులో ఉన్న పిల్లలు అంటే.. ఎనిమిది నుంచి పదేళ్ల వయసుండే పిల్లలు 9 నుంచి 10 గంటలు నిద్ర పోవాలి. టీనేజ్‌లో ఉన్న వాళ్లు 8 నుంచి 9 గంటలు, ఇరవై ఏళ్లు దాటిన వాళ్లు ఆరు నుంచి ఏడు గంటల వరకూ నిద్రపోవాలి. నిద్ర తక్కువైనా ఎక్కువైనా.. మెదడు నిలకడగా ఉండదు. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే సరైన నిద్రకు సరైన సమయాన్ని కేటాయింకోవాలి.

Featured

కొడుకు చేతిలో తండ్రి హతం

అనంతసాగరం మండలం ఏప్రిల్ 30 (పున్నమి విలేఖరి): రేవూరు గ్రామం నందు శుక్రవారం సాయంత్రం తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవలో రేణంగి వెంకటసుబ్బయ్య ( 55) మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేణంగి వెంకట సుబ్బయ్య మద్యం మత్తులో పొలం చదును చేసే విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండడంతోవెంకటసుబ్బయ్య కుమారుడు రేలంగి ప్రవీణ్ తండ్రికి ఎంత చెప్పినా వినకుండా దాడికి దిగడంతో కత్తిపీట తో దాడి చేయగా వెంకటసుబ్బయ్య తీవ్ర గాయాలయ్యాయి. అతనికి వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ సోమయ్య గారు అనంతసాగరం ఎస్సై ఎన్.ప్రభాకర్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.