Friday, 6 March 2026

Blog

Featured

ప్రజల   మోయలేని భారాలు మోపుతున్న జగనన్న

  ప్రజల   మోయలేని భారాలు మోపుతున్న జగనన్న *సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్* *సంస్కరణల పేరుతో పేద ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేశ్ విమర్శించారు. నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ 2022 -23 పై సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞానకేంద్రంలో “నగరాభివృద్ధి -సంస్కరణలు- ప్రజలపై పన్నుల భారాలు” అనే పేరుతో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు.* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అన్ని రంగాలను ప్రైవేటీకరించడం, పౌర సేవలకు యూజర్ చార్జీలు వసూలు చేయడమే తమ విధానాలుగా అన్ని రాష్ట్రాలకు నిర్దేశించిదన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ లో వేగవంతంగా సంస్కరణలు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దానిలో భాగంగానే ఇంటి పన్ను భారీగా పెంచడం, చెత్త పన్ను విధించడం, నీటి కొళాయి లకు మీటర్లు బిగించడం లాంటి చర్యలకు పట్టణాల్లో, నగరాల్లో శ్రీకారం చుట్టి ఉన్నారన్నారు. ఇదే నిజమైన అభివృద్ధి గా ప్రచారాలు చేసుకుంటున్నారన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ బడ్జెట్టు గత సంవత్సరం 720 కోట్ల రూపాయలని అంచనా వేయగా 350 కోట్ల కు తగ్గిపోయింది అన్నారు. వాటిలో 139 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేశారన్నారు. ప్రజలపై భారాలు మోపడం లక్ష్యంగా పెట్టుకుని పని చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కరోనా లాక్డౌన్ కాలంలో ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న టువంటి ప్రజల పై భారాలు మోపడం సరికాదన్నారు.* *సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ గత సంవత్సరం 139 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయగా, రాబోయే సంవత్సరంలో దానిని 490 కోట్లకు అంచనాలుగా అప్పడం పాలకుల ఆలోచన ఏ విధంగా ఉందో స్పష్టం చేస్తోందన్నారు. రాబోయే సంవత్సరంలో ఇంటి పన్నులు 65 కోట్లు, మంచినీటి పన్నులు 15 కోట్లు, చెత్త పన్ను 10 కోట్లు, ట్రేడ్ చార్జీలు 3 కోట్లు, బిల్డింగ్ అనుమతుల పేరుతో 30 కోట్లు ఇలా అనేక పేర్లతో నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల భారాన్ని నగర ప్రజలపై మోపడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగేశ్వరరావు, పి. సూర్యనారాయణ, అత్తి మూర్తి శ్రీనివాసులు ప్రసంగించారు.* *సిపిఎం నగర కమిటీ సభ్యులు ఉడతా ప్రసాద్, ఆర్ శ్రీనివాసులు, మూలం ప్రసాద్, ఏమేలు, నరసింహ, చిరంజీవి, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు*

Featured ఆంధ్రప్రదేశ్

వైద్య పరికరాల దిగుమతుల తగ్గింపునకు ఏం చేశారు? పార్లమెంట్లో అడిగిన ఎంపీ ఆదాల

  వైద్య పరికరాల దిగుమతుల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో శుక్రవారం ప్రశ్నించారు. వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఉత్పత్తికి ప్రోత్సాహక పథకం (పి.ఎల్.ఐ) అమలు పరిస్థితి ఏమిటని కూడా అడిగారు.దీనికి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖామంత్రి భగవంత్ ఖుబా రాతపూర్వకంగా సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం (పి.ఎల్.ఐ) ని ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. 21 మంది దరఖాస్తుదారులు 3420 కోట్ల రూపాయల అంచనా తో దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇందులో 1058.97 కోట్ల రూపాయలతో కూడిన పెట్టుబడిదారులను ఆమోదించి ఆహ్వానించినట్లు తెలిపారు. వైద్య పరికరాల పార్కుల ఏర్పాటు కోసం మరో పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ పార్కులో సాధారణ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 400 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇవి ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.*

*ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.* *అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికిన సీయం* మర్రిపాడు :పీబ్రవరి.23. (పున్నమివిలేకరి ) కడచూపు చూచుటకు పిక్కటిల్లే తట్టు తరలి వచ్చిన జనసంద్రం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరు క్యాంపు కార్యాలయం నుండి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు మరియు అభిమానుల సందర్శనార్థం ఆత్మకూరు, డి సి పల్లి,మర్రిపాడు, నెల్లూరు సరిహద్దు, బ్రాహ్మణపల్లి మీదుగా అంతిమయాత్ర నిర్వహించి ఉదయగిరి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంత్రి అంత్యక్రియలు జరిగాయి.ఈ అంతిమ యాత్రకు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ గల్లా జయదేవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్ ఎల్ ఏ లు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.ఈ అంతిమ యాత్రకు విశేష జనవాహిని తరలి వెళ్లింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి స్నేహితుడ్ని మంచి క్యాబినెట్ మినిస్టర్ ని కోల్పోయానని దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతిమ యాత్రలో భాగంగా రోడ్డు పొడవునా మేకపాటి గౌతం రెడ్డి అమర్రహే అంటూ అభిమానులు, నియోజకవర్గ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలకడం జరిగింది. ఈ అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొని మిత్రునికి కడసారి వీడ్కోలు పలికారు.

ఆంధ్రప్రదేశ్

యువనేత గౌతమ్ రెడ్డి మృతిపై ఎంపీ ఆదాల తీవ్ర దిగ్భ్రాంతి

యువనేత గౌతమ్ రెడ్డి మృతిపై ఎంపీ ఆదాల తీవ్ర దిగ్భ్రాంతి దివంగత మంత్రి , యువనేత మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గౌతమ్ రెడ్డి అకాల మృతి తనను ఎంతగానో కలచివేసిందని బాధను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఒక క్రమపద్ధతిలో చేస్తూ గౌతమ్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అక్కడి ప్రజలకు తీరని లోటు అన్నారు. తనకు ఆయనతో ఎంతో ఆత్మీయత ఉందని, వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Featured

గుండె పోటుతో మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) ఆంద్ర పద్రేశ్‌ పరిశ్రమలు. ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (50) ఆకస్మికంగా మృతి చెందారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారం రోజుల పాటు దుబాయ్‌ ఎక్స్‌ పోలో పాల్గొని ఇండియా వచ్చారు. గౌతంరెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ న మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

Featured

రైతులకు యంత్ర పరికరాలు పంపిణీ

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) సబ్సిడీపై పలు రైతు గ్రూపులకు కలెక్టరేట్‌లో యంత్రపరికరాలను పంపిణీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, వి.వరప్రసాద్‌, కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డిల ఆధ్వర్యంలో వరి కోత యంత్రాలతో పాటు ఇతర యంత్రాలను రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో 270 రైతు గ్రూపులకు 2445 యంత్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. యంత్ర సేవా పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.6.09 కోట్లు సబ్సిడీ రూపంలో వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ హరేందిర ప్రసాద్‌, వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి తదితరులు పాల్గొన్నారు

Featured

సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం తగదు

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు) ప్రజలు తమ సమస్యలపై స్పందన కార్యక్రమంలో ఇస్తున్న అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలపై ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఫించన్‌లు, ఇళ్ళ పట్టాలు వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. జగనన్న ఇళ్లకు సంబంధించి పురోగతి వేగంగా ఉండాలన్నారు. ఓటీఎస్‌ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. నగదు చెల్లించిన వారికి సత్వరమే రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రతి ఇంటికి చెత్త బుట్టలను అందించాలన్నారు. ఈనెల 22న అమలు కానున్న జగనన్న తోడు, పీఎం స్వానిధి పథకాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో జేసీలు హరేందిర ప్రసాద్‌, గణేష్‌ కుమార్‌, జేసీ (ఆసరా) రోజ్‌మాండ్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌రావు, ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Featured

ఆలయ అభివృద్దికి కృషి చేయండి ` ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి.

(పున్నమి పత్రినిధి, విడవలూరు) నూతనంగా ఎన్నికైన ఛైర్మన్‌ సభ్యులు రామతీర్థంలో వెలసియున్న కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేయాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. రామతీర్థంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ పాలక మండలి సభ్యుల పమ్రాణస్వీకారం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జొన్నవాడ దేవస్థాన ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజే పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు రూ.5.5 కోట్ల విరాళాలను దాతల నుంచి తీసుకొచ్చారన్నారు. దాతల సహకారం చాలా అవసరమన్నారు. అవసరమైతే తాను వచ్చి విరాళాలు సేకరిస్తానన్నారు. అనంతరం పాలక మండలి ఛైర్మన్‌గా నాటారు చంద్రయ్య, సభ్యులుగా రమేష్‌, పసుపులేటి సుబ్బారావు, కటారి మల్లీశ్వరి, వెంకటశేషమ్మ, నాగమణి, వేణుగోపాల్‌, శ్రీకాంత్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్కాఫ్‌ ఛైర్మన్‌ కొండూరు అనీల్‌ బాబు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వీరి చలపతిరావు, డీఎల్‌డీఏ ఛైర్మన్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్‌, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ ఛైర్‌ పర్సన్‌ సుప్రజ, పుట్టా సుబ్రమణ్యంనాయుడు, జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, ఎంపీపీ భవానమ్మ, సర్పంచ్‌ సుప్రజ, ఎంపీటీసీ రమణమ్మ ఆవుల వాసు పాల్గొన్నారు.

Featured

సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

(పున్నమి ప్రతినిధి, బుచ్చి) సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఛైర్‌ పర్సన్‌ మోర్ల సుప్రజ పేర్కొన్నారు. స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు తెలియచేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఫీవర్‌ సర్వేను తప్పక చేపట్టాలని సూచించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లు పమ్రీలమ్మ, షాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

Featured

నారా పాదయాత్ర చేయబోతున్నారా……? ` నియోజకవ్గాలకు వెళ్తేనే పార్టీపై పట్టు సాధిస్తారంటున్న నేతలు

మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో బలమైన నేతగా ఎదిగేందుకు మాజీ మంత్రి నారా లోకేష్‌ త్వరలో కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే నారా లోకేష్‌ పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి విజయం సాధించడంతో అదే పందాలో లోకేష్‌ కూడా నడిచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సారి సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లోకేష్‌ ఈ నిర్ణయం తీసుకున్నారేమోనన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ పాదయాత్ర చేయడంతో 175 నియోజకవర్గాల్లోని కార్యకర్తలు, నాయకులుతో సమావేశాలు నిర్వహించి ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది నాయకులు మాత్రం పాదయాత్ర కన్నా స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు , ప్రజలతో కలిసి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి అనేదానిపై చర్చిస్తే మంచి ఫలితాలు ఉంటాయనే భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు పార్టీ నేతలతో ఎలా కలిసిపోయారో అలాగే లోకేష్‌ కూడా పార్టీ పై పట్టు సాధించాలంటే పార్టీ నేతలు, నాయకులతో కలిసి పోవాలని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయా…? లేదా..? అన్న విషయాన్ని పక్కన పెడితే పార్టీ నాయకులతో లోకేష్‌ కలిసి పోతే రాజకీయంగా అనుభవంతో పాటు పార్టీపై పూర్తి పట్టు సాధించుకోవచ్చని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్‌ పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలంటే తండ్రి చాటు బిడ్డలా కాకుండా తనకంటూ ఓ పత్య్రేకమైన మార్క్‌ను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే చందబ్రాబు రాజకీయ వారసురడిగా ఎదిగిన లోకేష్‌ నియోజకవర్గాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోగలలిగితే రాజకీయంగా అనుభవం కూడా వస్తుందన్నది కొందరు నేతల అభిప్రాయం. పాదయాత్రతో లోకేష్‌ తిరుగులేని నేతగా ఎదగడం సాధ్యపడదంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా లోకేష్‌ పాదయాత్ర చేస్తాడా… లేదా.. అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.