Friday, 6 March 2026

Blog

Featured

తిరుపతి పట్టణాభివృద్ధిసంస్థ)..లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల

తిరుపతి పట్టణాభివృద్ధిసంస్థ)..లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల (పున్నమి ప్రతినిధి) గూడూరు..నాయుడుపేట..సూళ్లూరుపేట.. మునిసిపాలిటీ లతో పాటు గూడూరు..నాయుడుపేట.. సూళ్లూరుపేట.. తడ..దొరవారిసత్రం..వాకాడు..కోట..ఓజిలి..పెళ్లకూరు… చిట్టమూరు..చిల్లకూరు.. బా లాయపల్లి ..వెంకటగిరి.. డక్కిలి మండలాలను (పాక్షికంగా)..TUDA (తిరుపతి పట్టణాభివృద్ధిసంస్థ)..లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల …..

జాతీయ అంతర్జాతీయ

విద్యుత్ వాహన బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలు ఇవ్వండి పార్లమెంట్లో అడిగిన ఎంపీ ఆదాల

దేశంలో రాష్ట్రాల వారీగా విద్యుత్ వాహనాల కోసం చిన్న బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వివరాలను ఇవ్వాల్సిందిగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పార్లమెంట్లో అడిగారు. బ్యాటరీల ఏకరీతి ప్రమాణాల కోసం అమలు చేసిన ప్రయత్నాలు ఏమిటని కూడా అడిగారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ దీనికి సమాధానం ఇస్తూ దేశంలో ప్రస్తుతం 54 బ్యాటరీ మార్పిడి స్టేషన్లు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో రెండు ఉన్నాయని రాతపూర్వకంగా తెలిపారు. బ్యాటరీ మార్పిడి విధానాన్ని అమలు చేయడానికి వాటాదారుల సంప్రదింపుల కోసం నీతి అయోగ్ ఆ విధానాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసిందని పేర్కొన్నారు.

Featured సాహితీ

చద్దిమూట:ఆరుపల్లి గోవిందరాజుల

చద్దిమూట ఆరుపల్లి గోవిందరాజులు రాఘవయ్య ఆధ్యాత్మిక చింతనగల వ్యక్తి. అజయ్, అరవింద్, అవినాష్ ముగ్గురు కొడుకులు చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాలు చేయడంలో తల దూర్చారు. ఎక్కడా ఎవరికీ ఏ చిన్న ఉద్యోగం లభించలేదు. వారు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తండ్రి ఎప్పుడూ అవసరార్థం ఏ పని పురమాయించినా విసుక్కునేవారు. మొదటి వాడికి చెబితే రెండో వాడికి చెప్పు, రెండో వాడికి చెబితే మూడో వాడికి చెప్పమనే వారు.. భార్య ,కొడుకులను సమర్థించుకుంటూ వచ్చేది. ఆ కారణంగా తను కొడుకుల దృష్టిలో చులకన అయ్యాడు. ఒక పర్యాయం రాఘవయ్య చిన్ననాటి స్నేహితుడు రామకోటి స్నేహితుడిని చూడడానికి వెళ్ళాడు. మాటలు పూర్తి అయ్యాక రామబ్రహ్మం హడావిడిగా ఇంటికి బయలుదేరాడు. స్నేహితుడు వెళ్ళిన కొంతసేపటికి రామకోటి తన గొడుగు విడిచిపెట్టినది గమనించి పెద్ద కొడుకుతో ఆ గొడుగును ఇచ్చి రమ్మన్నాడు. అది విని భార్య “వచ్చేది వర్షాకాలం తిరిగి ఎందుకు ఇవ్వడం? మనకు పనికి వస్తుంది కదా!” అంది. రాఘవయ్య ,”ఆ వస్తువు మనది కాదు. పైగా అతడు పేదవాడు తిరిగి కొనలేడు. పరుల సొమ్ము పాము వంటిది”అంటూ నీతి చెప్పాడు.అజయ్ తండ్రితో “నాకు ఈదినం ఊపిరి తీసుకోలేనన్ని పనులు ఉన్నాయి తమ్ముడిని వెళ్ళమనండి” అని తప్పించుకున్నా డు.తండ్రి మాటవినిన అరవింద్ “రేపు నేను ఉద్యోగం కోసం ఒక రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. చదువుకుంటున్నాను. తమ్ముడికి చెప్పండి” అన్నాడు. పెద్దల మాట చద్దిమూటగా భావించే అవినాష్ తండ్రి మాట కాదనలేక రామకోటి ఇల్లు చేరి గొడుగు అందించాడు.రామకోటి అవినాష్ ని ఎంతో ప్రశంసించి తను ఏం చేస్తున్నది వివరాలు అడిగాడు. “అవినాష్ తను చదివిన చదువు, కంప్యూటర్ కోర్సు అని చెప్పి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను” అన్నాడు. రామకోటి వెంటనే ఓ ఆఫీసుకు తీసుకువెళ్లి స్నేహితుడైన ఆఫీసరుకు అవినాష్ వివరాలు చెప్పి ఉద్యోగం కోరాడు. ఆఫీసరు వెంటనే రామకోటి మాటలు కాదనలేక ప్రశ్నలు కురిపించి ఎన్నిక చేసాడు. ఆ మాటలు విన్న రాఘవయ్య చూసావా బాబూ ధర్మాన్ని నువ్వు రక్షించావు గనుక ఏ ప్రయత్నం చేయకుండానే ఉద్యోగం లభించింది” అన్నాడు. అవినాష్ మనసులో నిజమే పెద్దల మాట చద్దిమూట అందుకే అన్నారు అని అనుకున్నాడు.       ఆరుపల్లి గోవిందరాజులు రాఘవయ్య ఆధ్యాత్మిక చింతనగల వ్యక్తి. 8801513061      

Featured

అచ్చులతో మాబడి గేయం:రచన: గుండాల నరేంద్రబాబు తెలుగు పరిశోధకులు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. సెల్: 9493235992.

అచ్చులతో మాబడి గేయం అదిగో అదిగో మా బడి ఆనందాల నారు మడి ఇలలో వెలసిన అసలు గుడి ఈలలు వేస్తూ పరుగులు తీసే మా బడి ఉత్సాహాల మాబడి ఊయలలూపే మా బడి ఋణమే తీర్చమంది మా బడి పితౄణమే తీర్చమంది మా బడి ఎప్పటిపని అప్పుడే చేయమన్నది మా బడి ఏనుగు అంత బలంగా ఉండాలన్నది మా బడి ఐకమత్యమే మహాబలo అన్నది మా బడి ఒoటెలాగా ఓర్పుగా ఉండాలన్నది మా బడి ఓర్పు నేర్పు నీకుంటే సాధ్యం కానిది లేదన్నది ఔరా అంటూ అందరూ ఆశ్చర్య పోతారన్నది అందాలా మాబడి ఆహ్లాదాలా పెట్టుబడి అoత:పురమే మాబడి ప్రాతఃకాలమే తెరువు బడి రచన: గుండాల నరేంద్రబాబు తెలుగు పరిశోధకులు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. తేది:20-05-2022 సెల్: 9493235992.

Featured

రైతులకు శుభ కృత్ నామ సం మరియు ఉగాది శుభాకాంక్షలు: రైతు సంఘం అధ్యక్షులు: బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి

రైతులకు శుభ కృత్ నామ సం మరియు ఉగాది శుభాకాంక్షలు. *మండల రైతు సంఘం అధ్యక్షులు: బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి* *మర్రిపాడు*:ఏప్రిల్ 2 (పున్నమివిలేకరి ) రైతే దేశానికి వెన్నెముక అంటున్న ప్రభుత్వాలు నోటిమాట వరకు మాత్రమే పరిమితమై చేతల రూపంలో ప్రభుత్వం రైతులను పట్టీపట్టని విధంగా చూస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా ఉంటానంటూ మర్రిపాడు మండల నూతనంగా ఎన్నికై రైతు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామాలల్లో పేద రైతులకు అండగా వారి సమస్యల నా శక్తి కొలది జిల్లా రైతు సంఘం నాయకుల అందతో రైతుల సమస్యల కోసం ముందుండి పోరాడుతా నాని పత్రికాముఖంగా రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. అంతే కాకుండ పొగాకు రైతులకుడ అండగా ఉంటానంటూ వారి కష్టాలను నా కష్టాలుగా భావిస్తాను అంటూ రైతులకు కొండంత అండగా నిలుస్తాను అంటూ ఓ ప్రకటన ద్వారా తెలియ పరిచారు.ఈ సందర్భంగా బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి మర్రిపాడు మండలం లోని యువత, ప్రజలు మరియు కార్మికులకు,శ్రామిక రైతులకు శ్రీ శుభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్

UTF ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

UTF ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ… మర్రిపాడు :మార్చి 31(పున్నమివిలేకరి ) . మర్రిపాడు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని,ఈ మెటీరియల్ ఉపయోగించుకొని పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మర్రిపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివ జ్యోతి,యు టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ అధ్యక్షులు షేక్ ఖాజా రసూల్,సీనియర్ నాయకులు జి.సుబ్బరాయుడు, ఎన్.సుబ్బరాయుడు,విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పూర్వవైభవం కోసం టిడిపి పాకులాట .. పార్టీ జండా ఆవిష్కరణ తో మర్రిపాడు టీడీపీ కి బలం చేకూరేనా —?

మర్రిపాడు మండలంలో టిడిపి పూర్వవైభవం కోసం పాకులాట *పార్టీ జండా ఆవిష్కరణ తో మర్రిపాడు టీడీపీ కి బలం చేకూరేనా —? మర్రిపాడు:మార్చి 30(పున్నమివిలేకరి ) మర్రిపాడు మండల కేంద్రంలో గత రెండున్నర సంవత్సరాలుగా టిడిపి పార్టీ కి కష్టకాలం నడిచింది. మండల నాయకులు ఒకరికొకరు దూరమవడం, కార్యకర్తలు బెదిరిపోవడంతో కాస్త నిస్తేజం నెలకొంది. ఐతే పార్టీ అధిష్టానం ఆదేశాలతో మార్చి 29 సోమవారం జరిగిన టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జరిగిన జండా ఆవిష్కరణ, పరిణామాలతో పార్టీలో కాస్త ఊపొచ్చిందని అటు టిడిపి కేడర్ లో ఇటు వైసీపీ నాయకులలోను చర్చ జరుగుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన తర్వాత మండల ప్రజల స్పందన కనిపిస్తుంది.నాయకులు ఒకరినొకరు పరిచేయాలు చెంచుకోవడం , పల్లెల్లో కార్యకర్తలు మండల కేంద్రానికి తరలిరావడంతో మర్రిపాడు మండలంలో పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమన్న సంకేతాలు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో సూన్యత ఏర్పడింది ఎన్ని కార్యక్రమాలు చేసిన ప్రజల లోకి అంతగా తీసుకువెళ్ల లేకపోయారు. దీంతో పాటు సీనియర్ నాయకులు ఒకరికొకరు పార్టీ పై నమ్మకం కోల్పోవడం ముక్యంగా నియోజక వర్గ లీడర్ ను నిర్ణయించుకోక పోవడం కొందరు పార్టీ లు మారడం ఇలాంటి లొసుగులతో తలపట్టుకున్న మండల కేడర్ తాజాగా జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పరిణామాలు మండల టిడిపి బలోపేతానికి ఊతమిచ్చాయని గ్రామాల ప్రజలు చెప్పుకుంటున్నారు.రెండున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్నా నిన్న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తో కొద్దిగా ఊపు అందుకున్నదని మండల వాసుల అభిప్రాయం అందుకే పార్టీ జండా ఆవిష్కరణ ముగిసిన తర్వాత మండల కేడర్. మోములోనవ్వులుకూడా కనిపించాయంటున్నారు. పలువురు మండల నాయకులు.తమకు వచ్చిన టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ రెండున్నరేళ్లపాటు నిలబెట్టుకోవడం పార్టీ నాయకులకు సవాల్ గా మారే అవకాశముందనే నేతలు కూడా లేకపోలేదు.మండలంలో కార్యకర్తలలో అంతర్గతంగా పార్టీ అభిమానం ఉన్న ప్రత్యక్ష పరచలేని స్థితిలో ప్రత్యర్థి పార్టీలు వైపు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన సందర్బం మండల నాయకులకు కార్యకర్తలకు కలిగిన జోష్ రానున్న రోజులలో అలాగే కోన సాగి పూర్వ వైభవం రావాలని మనందరం ఆశిద్దాం అప్పటివరకు వేచిసూద్దాం…

ఆంధ్రప్రదేశ్

అధిక ధరలకు వంట నూనెలు విక్రయిస్తే కఠిన చర్యలు

వంట నూనెలు అధికంగా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు .. ఇప్పటివరకు 146 కేసులు నమోదు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు నెల్లూరు జిల్లాలో పలు దుకాణాల్లో వంట నూనెలు అధిక ధరలకు విక్రయించడంతో పాటు ఇతర నిబంధనలు ఉల్లంఘించినందులకు 146 కేసులు నమోదు చేసి 31 కేసులకు సంబంధించి 3,47,000 రూపాయల అపరాధ రుసుము వసూలు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల కాలంలో వంటనూనెల ధరలు పెరగడంతో వాటిని నియంత్రించేందు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాలు, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ, తూనికలు కొలతల శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ బృందాలు జిల్లాలో విస్తృతంగా హోల్ సేల్, రీటైల్ వ్యాపార సంస్థలు, దుకాణాలను తనిఖీ చేశారన్నారు. జిల్లాలో అక్రమంగా నిల్వ ఉన్న 2767 క్వింటాళ్ల వివిధ రకాల నూనెల స్టాకులను సీజ్ చేయడం జరిగిందన్నారు. దీంతో చాలా వరకు వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. జిల్లాలో వంట నూనెలు అధిక ధరలకు అమ్మినా, అక్రమ నిల్వలు ఉంచిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నెల్లూరు, కావలి, గూడూరు పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు 135 రూపాయలకే వంట నూనెలు విక్రయించడం జరుగుతోందన్నారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేట, నవాబుపేట రైతుబజార్లతో పాటు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కావలి, గూడూరు లోని రైతు బజార్ల లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వంట నూనెలు 135 రూపాయలకే విక్రయించడం జరుగుతోందన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ————————–

ఆంధ్రప్రదేశ్

భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేయండి

భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను మరింత వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కెవీఎన్ చక్రధర్ బాబు *అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల భూసేకరణ, పరిహారం చెల్లింపులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ హెచ్ 67, 71, 167 బి, 167బిజి, కృష్ణపట్నం పోర్ట్ అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, నగదు చెల్లింపుల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎఫ్వో షణ్ముఖ కుమార్, ట్రైనీ కలెక్టర్ పర్హాన్ అహ్మద్ ఖాన్, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట ఆర్డివోలు హుస్సేన్ సాహెబ్, మురళీకృష్ణ, సరోజినీ, నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గోవర్ధన్, హైవేస్ తిరుపతి టెక్నికల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ తాసిల్దార్లు దానియేలు, శాంతకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు. ……………….

Featured

రక్తం.. అమూల్యం.. విభేదాలకు అతీతం! ఎంపిడిఓ…సుస్మిత రెడ్డి;

రక్త దానం అమూల్యమైనది. విభేదాలకు అతీతం అని మర్రిపాడు ఎంపిడిఓ సుస్మిత రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిపాడు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం నందు దివంగత నేత రాష్ట్ర ఐటి మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ని స్మరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రెసిడెంట్ కె.తిరిపాలు మండల కమిటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎంపిడిఓ సుస్మిత రెడ్డి, అభిరామ్ హాస్పటల్ ఎండి డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి బ్రహ్మణపల్లి మాజీ సర్పంచ్ అమరనాథ్ రెడ్డి, ఉదయగిరి న్యాయస్థానాల ఎజిపి రామగోపాల్ రెడ్డి , తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ఎంపిడిఓ మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. ఈ రక్తంలో గ్రూపులు ఉన్నాయి గానీ.. రక్తానికి ప్రాంతాలు లేవు, కులమత భేదాలు లేవు. సమైక్య భావనను ఈ రక్తం పూర్తిస్థాయిలో చూపిస్తుందనిఈ సందర్బంగా ఎంపిడిఓ సుస్మిత రెడ్డి తెలియజేసారు. కార్యక్రమంలోఆంధ్ర ప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ కె.తిరిపాలు,మండల కమిటీ సీఆర్పీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నయ్య,ప్రెసిడెంట్ జాన్సన్,సెక్రెటరీ కరిముల్లా కలిసి ఎంపిడిఓ సుస్మిత రెడ్డి కి ఆత్మీయ సన్మానం నిర్వహించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.