Friday, 6 March 2026

Blog

Featured ప్రకాశం

శ్రీ సౌభాగ్య దుర్గంబిక మాత ఊరేగింపుకు ఏర్పాట్లు పూర్తి

  గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సౌభాగ్య దుర్గంబిక అమ్మవారి ఆలయంలో రేపు శనివారం దేవరపల్లి మూడు బొమ్మల సెంటర్ వద్ద 13వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా శ్రీ సౌభాగ్య దుర్గంబిక అమ్మవారి విగ్రహ వేలంపాట నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలియజేశారు. 12వ తేదీ బుధవారం దేవరపల్లి పురవీధుల్లో సౌభాగ్య దుర్గంబిక అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శనివారం రాత్రి 7.30గంటలకు జరిగే వేలంపాటకు హాజరవ్వాలి సూచించారు.

Featured Others

నారాయణపేట్ లో జరిగే ప్రగతిశీల మహిళ సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర 7వ మహాసభలను జయప్రదం చేయండి.

  మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.స్త్రీ పురుష సమానత్వం కై పోరాడలని అక్టోబర్ 8,9 తేదీల లో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) రాష్ట్ర 7వ మహాసభలను విజయవంతం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో మహాసభల గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతి శీల మహిళా సంఘం (పిఓడబ్లు) జిల్లా నాయకురాలు కోళ్ళ నాగమ్మ మాట్లాడుతూ నేడు అమలులో ఉన్న పితృ స్వామిక కుటుంబ వ్యవస్థలో పురుషుడు యజమాని కాగా స్త్రీ పరాదీనగా ఉంది పరస్పర ప్రేమ ఇష్టం,అంగీకారంగా,కులమతాలు,డబ్బు, హోదా,బంధుత్వం మొదలైన అంశాలపై ఆధారపడి వివాహ వ్యవస్థ వలన స్త్రీల హక్కులు హరించబడుతున్నాయి.స్త్రీలపై వివక్ష అణిచివేత పెత్తనం పురుషాధిక్యత లాంటి అనేక సమస్యలతో స్త్రీలు సతమతమవుతున్నారన్నారు. కుటుంబంలో ఆస్తులపై ఆధిపత్యం పురుషునిదే స్త్రీల కర్తవ్యం వారసులను కనడం కుటుంబానికి చాకిరీ చేయడం మాత్రమే అయిపోయింది.ఈ దేశంలో మతాలన్నీ స్త్రీలను అబలగా,పరాదీనగా చిత్రీకరించాయి సహనం, క్షమాగుణం, నమ్రత, సిగ్గు వంటి అనేక లక్షణాలకు ప్రతీకగా స్త్రీని చెబుతున్నాయి దీనిలో భాగంగానే స్త్రీలపై సతీసహగమనం, కన్యాశుల్కం, బాల్య వివాహాలు, పునర్వివాహా నిరాకరణ,బసివిని,జోగిని, దేవదాసి లాంటి దుర్మార్గమైన దూరచారాలకు ఎందరో స్త్రీలు బలైపోయారు రాజా రామ్మోహన్ రాయ్,విద్యాసాగర్, దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం, గురజాడ, పూలే లాంటి వాళ్లు ఎందరో సంఘసంస్కర్తలు ఈ దూరరాలకు వ్యతిరేకంగా గళం విప్పారని అన్నారు. నేడు విద్యలోనూ, ఉద్యోగాలలోను, బాధ్యతల నిర్వహణ లోను పురుషులతో పోటీ పడుతున్న స్త్రీని ఇంకా పితృస్వామికి భావాజాలం వెన్నడుతూనే ఉన్నది. బిజెపి అధికారానికి వచ్చిన తర్వాత స్త్రీలపై అత్యాచారాలు ప్రమాదకర స్థాయిలో పెరిగాయి కతువా లాంటి ఘటన లో అనేకంగా జరిగాయి,జరుగుతున్నాయి. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. భేటీ పడావో- బేటి బచావో అనేది నినాదం గానే మిగిలిపోయింది. మహిళలకు రక్షణ కరువైంది కేసీఆర్ ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉంది కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లో మహిళల కేటాయింపులు తగ్గిపోతున్నాయి. కళ్యాణ లక్ష్మి, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, ప్రసవ మహిళలకు కేసీఆర్ కిట్లు సరిగా అమలు కావడం లేదు. ఆకర్షణీయ పథకాలతో మహిళా ఓటర్లకు గాలం వేయడంలో కోసమే తప్ప మరొకటి కాదు. సమాజంలో ఉన్న రుగ్మతలు, అధిపత్య ధోరణి విడనాడాలని, స్త్రీ లపై జరుగుతున్న లైంగిక దాడులను, హత్యలను, వేధింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం అనేక పోరాటాన్ని నిర్వహిస్తున్నది అందులో భాగంగానే అక్టోబర్ 8,9 తేదీలలో POW రాష్ట్ర 7వ మహాసభలను నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుపుకుంటుంది. ఈ సభలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు నాయకులు సాయమ్మ, కోళ్ళ జయమ్మ,చంద్రకళ, చంద్రమ్మ, లక్ష్మమ్మ, మంగమ్మ, వెంకటమ్మ, రేనమ్మ, జయమ్మ లతో పాటు తదితరులు పాల్గొన్నారు…

Featured Others

సి ఐ ఎస్ ఐ వేధింపులు తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలింపు

24 గంటల అబ్జర్వేషన్ సీఐ కి ఫోన్ చేసి విలేకరులుగా వివరణ అడగగా డ్రైవింగ్ లో ఉన్నాను అంటూ దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది కానిస్టేబుల్ ని ఎంతగా ఇబ్బంది పెట్టారనేది హైదరాబాద్ అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి):- హైదరాబాద్లోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో, పనిచేస్తున్న పి సి ఆనంద్ రాజ్ కానిస్టేబుల్ మామ చనిపోతే పై అధికారిని సి ఎల్ సెలవు కోరగా ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా చులకనగా మాట్లాడారు అలాగే తన భార్య ను హాస్పిటల్ కి తీసుకెళ్లి హాస్పిటల్ చూపించి తిరిగి పోలీస్ స్టేషన్ డ్యూటీ కోసం వెళ్లగా లేట్ అయిందని నానా బూతులు మాట్లాడి దూషించారు తన తోటి ఉద్యోగుల ముందు దళిత కానిస్టేబుల్ అని అవమానించాడు ఎస్ఐ అశోక్ 2014 బ్యాచ్ కు చెందిన పిసి నాగేశ్వర్ వీళ్లిద్దరూ హెచ్ ఎస్ ఓ ఇన్స్పెక్టర్ కి ఆనంద్ రాజ్ పై లేనిపోని మాటలు చెప్పి మాసికం గా తనను ఒక దళిత కానిస్టేబుల్ అనే పదంతో దూషిస్తూ ఆనంద్ రాజ్ కానిస్టేబుల్ తో అవమానకరంగా మాట్లాడిన సీఐ. వంశి కృష్ణారావు . ఎస్ ఐ అశోక్. కానిస్టేబుల్ నాగేశ్వర్. వీరు ముగ్గురు ఆనంద రాజు పై మానసికంగా ఒత్తిడికి గురి చేయడంతో ఈ అవమానం భరించలేక షుగర్ టాబ్లెట్ వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇది గమనించిన తోటి కుటుంబ సభ్యులు స్నేహితులు వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించారు అక్కడ అడ్మిట్ చేసుకుని ప్రథమ చికిత్స అందించారు 48 గంటల్లో అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు తెలిపారు ఇలా కానిస్టేబుల్ హోంగార్డుల పై రోజు రోజుకి పై అధికారుల ఆగడాలు ఎక్కువై హోంగార్డ్స్ కానిస్టేబుల్ కుంగిపోతున్నారు ఎవరితో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎక్కడ ఏమి జరిగినా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్న కానిస్టేబుల్ పరిస్థితి దౌర్భాగ్యం గా ఉందని మరి ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర డి జి పి . ఐపిఎస్ అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. ఉత్తమ కానిస్టేబుల్ అవార్డు అందుకున్న ఆనంద్ రాజ్ కి, సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరమని ఆయన సిబ్బంది అన్నారు ఈ విషయమై ఇప్పటి వరకు స్థానిక సి ఐ. ఎస్ ఐ. నిర్లక్ష్యంగా ఉన్నారు నాకెందుకులే నేను స్టేషన్ మాస్టర్ ని అనే విధంగా ప్రవర్తిస్తున్నారు సిఐ.ఎస్ఐ. మరి ఇలా మానసికంగా ఒత్తిడికి గురి చేసిన సంతోష్ నగర్ పోలీస్ సీఐ ఎస్ ఐ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి పోలీసు వ్యవస్థను కాపాడుకోవాలని. ఈ విషయం తెలిసిన కుల సంఘాలు సదరు పోలీస్ హోంగార్డ్స్ కానిస్టేబుల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హోం మంత్రి మహమ్మద్ అలీ .తెలంగాణ డైరెక్టర్ డీజీపీ మహేందర్రెడ్డి . ఐపీఎస్ ఆనంద్ అధికారిని .ఆత్మహత్య ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ ఆనంద రాజుకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది

Featured Others

దేవరకద్ర నియోజకవర్గ అధికారులు , ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అప్రమత్తం చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల….*

*వర్షాలు అధికంగా కురుస్తున్న నేపద్యంలో దేవరకద్ర నియోజకవర్గంకు చెందిన అధికారులను ప్రజాప్రతినిధుల ను అప్రమత్తం చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం ద్వారా 5 గేట్లను ఎత్తి దిగువ కు నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలకు ఊకచెట్టు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది కనుక ఊకచెట్టు వాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సరళసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి స్వైపన్స్ తెరుచుకున్నాయి. కొత్తకోట నుండి ఆత్మకూరు వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి అటువైపు ఎవ్వరు వెళ్లకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వర్షాల వల్ల ఇళ్ళు కూలిపోతే ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు…. కాన్ఫరెన్స్ కాల్ లో ఎమ్మార్వో లు , ఎంపీడీఓలు , పోలీస్ అధికారులు , నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు….

Featured Others

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు* ఘన స్వాగతం పలికిన బిజెపి కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్

* సికింద్రాబాద్ ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 2022 సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ఆలయ దర్శనం కి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆలయానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, కావ్య కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలకిన రాంగోపాల్ పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు పాల్గొన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారును దర్శనం చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో చీర సుచిత్ర సత్యనారాయణ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు ఆకులు ప్రతాప్, ప్రధాన కార్యదర్శులు ఆనంద్ వ్యాస్,ఎస్.వి నరేష్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Featured Others

. 2. వీరవల్లి పాలెం గ్రామంలో స్కూలు భవన నిర్మాణం శంకుస్థాపన

అయినవిల్లి ( పున్నమి ప్రతినిధి) అక్టోబర్ 2022. వీరవల్లి పాలెం గ్రామంలో స్కూలు భవన నిర్మాణం శంకుస్థాపన . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో నాడు నేడు సెకండ్ స్టేజ్ లో 12 లక్షల రూపాయలతో స్కూల్ భవన నిర్మాణాలకు స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎక్కువ కృషి చేసి,మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇచ్చినారని తెలిపినారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం ఉన్నత స్థాయిలో జరుగుతున్నదని ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు గన్నవరం శ్రీను. మండల అధ్యక్షురాలు మట్టపర్తి విజయలక్ష్మి పండు, మండల ఉపాధ్యక్షులు అడప వెంకట నాగభూషణం, గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, విద్యా కమిటీ చైర్మన్ కోరపు తాతాజీ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, మిండగుదిటి చిన్ని. కుడుపూడి జిజ్జి, వార లక్ష్మీనరసింహ రామ్, మిండగుదిటి రాంబాబు, అడప బాలాజీ, కోరపు రవి, గొర్రె వెంకట్రావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured Others

ఘనంగా యానాం శ్రీ లలితా దేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు…

పున్నమి (ప్రతినిధి) యానాం పడవలరేవు వీధిలో శ్రీ దేవీ నవరాత్రులలో బాగంగా 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తున్న యానాం శ్రీ లలితా దేవి అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ  పాడ్యమి  నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఈ పండుగను మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పూజా కమిటి సభ్యులు మట్టా సత్యవేంకట సుబ్రహ్మణ్యం, చింతలపూడి రాంపండు, సత్యవరపు నూకరాజు, బేతాళం నాగేశ్వరావు, మాత సన్యాసి రావు, రామారావు, యానాం ప్రజలు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Featured Others

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్”* లో అమరచింత విద్యార్థినికి చోటు

*” వనపర్తి జిల్లా అమరచింత విద్యార్థిని కె.సింధూజ D% Late కావలి గోపి(TRS మాజీ పట్టణ అధ్యక్షులు) కుమార్తె 8th క్లాస్ విద్యార్థిని రెండేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదం లో తల్లి దండ్రులు కోల్పోయున తర్వాత TSWRIES (G) కొత్తకోట నందు 8 వ తరగతి చదువుతూ 2nd అక్టోబర్ 2022 నాడు TSWRS@JC.(G) కొత్తకోట లో నిర్వహించిన కార్యక్రమంలో అత్యంత వేగంగా 60 తెలుగు నెలల పేర్ల ను కేవలం 18.09 సెకండ్స్ లో చెప్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం

Featured Others

భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్ పంపిణీ

ఈరోజు వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మక్తల్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి తెలంగాణ జాగృతి మక్తల్ నియోజకవర్గ కన్వీనర్ సయ్యద్ కలాం పా ష ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నవభారత నిర్మాణం కొరకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితి గా టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ ఇకమీదట గా టిఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్ గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కెసిఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్వీట్ పంపిణీ చేయడం జరిగింది ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు N అలీ సయ్యద్ రాజ్ మొహమ్మద్ మహ్మద్ మజీద్ నజీర్ సురేందర్ వెంకటేష్ సుల్తాన్ తదితరులు పాల్గొనడం జరిగింది

Featured Others

గుర్తు తెలియని వాహనం తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి.

  గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి అక్టోబర్ (పున్నమి ప్రతినిధి). దేవరపల్లి మండలం దేవరపల్లి.16 వ నెంబర్ జాతీయ రహదారి జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు. ప్రమాదంలో. గుర్తు తెలియని వాహనం ఢీకొని. ఒక మహిళ మృతి చెందింది మహిళపై నుండి వాహనం వెళ్లడంతో  గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రమాద స్థలానికి దేవరపల్లి ఎస్సై కే శ్రీహరి రావు సిబ్బంది వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించారు ప్రమాదం ఈ విధంగా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.