Friday, 6 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ప్రతి కుటుంబానికి జగనన్న ఇచ్చిన ఆస్తి చదువే*

*: బహుజన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి* *: అంబేడ్కర్ కల జగనన్న నిజం చేశారు* *: జగనన్న అబద్దపు హామీలు ఇవ్వలేదు*   రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందించారని, అయితే జగనన్న ప్రతి కుటుంబానికి ఇచ్చిన అస్తి చదువేనని, ఆ చదువులో ప్రతి కుటుంబం భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి వెళ్లి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మంగళవారం బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో బహుజనుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి కుటుంబంలో చిన్నారులు చదువుకునేందుకు వారి తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడిని అందించారని, అంతేకాక ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారని, దీంతో మన రాష్ట్రంలో చదువుకునే వారి శాతం పెరిగిందని అన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదని, తన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చదువుల కోసం ఎన్నో ఇబ్బందులు వడ్డారని, ఆయన బాగా చదువుకోవడంతో మా కుటుంబమంతా ఉన్నతికి చేరుకుందని, మండలంలో విద్యాభివృద్ధి కోసం కూడా కృషి చేశారని పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి కుటుంబంలో ఒక్కరూ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని జగనన్న భావించారని, అందుకోసం తన ఐదేళ్ల పాలనలో విద్యపైనే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. జగనన్న మెనిఫెస్టో ప్రజలందరికి నమ్మకం ఉందని, మళ్లీ ఆయన ప్రకటించిన మెనిఫెస్టోపై ప్రజలంతా నమ్మకం కలిగి ఉన్నారని, సంక్షేమం రెండింతలు తప్పక అవుతుందన్నారు. గతంలో మెనిఫెస్టోలో రుణమాఫీ చేయాలని చాలా మంది చెప్పిన సందర్భంలో కూడా నేను చేయలని హామిని ప్రజలకు ఇవ్వలేనని, చెప్పిన ప్రతి హామిని నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని జగన్నన చెప్పారన్నారు. ఇలా గతంలో ఆయన ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజల్లో మెనిఫెస్టోపై నమ్మకం తీసుకురావడంతోనే ఆయన పట్ల ప్రజలందరికి నమ్మకం ఏర్పడిందని అన్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు నందా ఓబులేను సైతం ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకంతోనే మాకు మద్దతు తెలిపి మా వెంట నడిచేందుకు సిద్ధమయ్యారని వివరించారు. మెనిఫెస్టోలో జగనన్న 50 శాతం దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైగా ఉన్న వాటిని ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆయన హామి ఇస్తే తప్పక చేస్తారనే నమ్మకంతోనే నందా ఓబులేసు తదితరులు వైఎస్సార్సీపీ వెంట నడుస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులను కూడా భాగస్వాములను చేసుకోవాలని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి వధంలో నడిపిస్తామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.230 కోట్లు విలువ చేసే ఉదయగిరి ఇంజనీరింగ్ కళాశాలను దివంగత మంత్రి మా సోదరుడు గౌతమ్ రెడ్డి పేరున ప్రభుత్వానికి అంచచేయడం జరిగిందని, మా తండ్రి ఒకే మాట చెబుతారని, రాజకీయాల్లోకి వచ్చేది ప్రజా సేవ చేసేందుకేనని. ఆ విధంగా మేకపాటి కుటుంబం ముందుకు సాగుతుందని అన్నారు. గతంలో అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ రానున్న రోజుల్లో చేయబోయే మంచిని చెబుతూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేలా ప్రజలందరిని కోరాలనిని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లాయర్ నందా ఓబులేసు,ఆత్మకూరు చిన్నపిల్లల డాక్టర్ ఆది శేషయ్య,ఎంపీపీ గంగ వరపు శ్రీనివాసులు నాయుడు వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోండి..! కాకర్ల,

  ఓటమి భయంతోనే అసత్య ప్రచారాలు..! జర జాగ్రత్త వైసిపి మైండ్ గేమ్ ఆడుతుంది..! అబద్ధాలు నమ్మకండి నిజం గెలవాలి..! సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోండి..! చాకలి కొండ జనార్ధనపురం పంచాయతీలో పల్లె పల్లెకు కాకర్ల,- బ్రహ్మరథం పట్టిన పల్లెవాసులు అడుగడుగునా నీరాజనాలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో అపూర్వ స్వాగతం వింజమూరు ఏప్రిల్ 08 ఓటమి భయంతోనే వైసిపి నాయకులు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రసారాలు చేస్తున్నారని వాటిని తిప్పి కొట్టాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.వింజమూరు మండలం లోని చాకలి కొండ జనార్ధన పురం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల ఇంటింటి ప్రచారాన్ని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె ప్రజలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ సురేష్ అన్న నీ వెంటే మేము అంటూ ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట నడిచారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ పురిటిగడ్డ పై మమకారంతో జీవితాల్లో వెలుగులు నింపేందుకు వచ్చానని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి కొన్ని జీవితాలు మారుస్తానని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే పల్లెల్లో కనిపిస్తుందని వైసీపీ వల్ల ఒరిగింది ఏమి లేదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అధోగతి పాలై 20 సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కారన్నారు. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ముందుకు పోలేదన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి తప్ప మార్పు రాలేదన్నారు. మార్పు కావాలంటే పెద్దల గౌరవనీయులు అజాతశత్రువు అపర భగీరధుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా ట్రస్టు ద్వారా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న కాకర్ల సురేష్ అను నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించాలని కోరారు. ఏ మాత్రం పొరపాటు జరిగిన రాష్ట్రం అంధకారం అవుతుందని పిల్లల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతాయి అని ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు తీసుకొస్తాను అన్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని దాన్ని తిప్పి కొట్టవలసిన అవసరం ఉందన్నారు. అబద్దాల ప్రభుత్వాన్ని ఓడించి నిజాన్ని గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోవాలని తెలిపారు.ప్రతి పల్లెలో టిడిపి నాయకులు అభి మానులు కాకర్ల సురేష్ గారిని శాలువా గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కూనల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నదాన ప్రభు ఆరోగ్య ప్రదాత అభాగ్యుల ఆపద్బాంధవుడు కాకర్ల సురేష్ అని ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాజీ కన్వీనర్ గూడా నరసారెడ్డి క్లస్టర్ ఇంచార్జ్ దంతులూరు వెంకటేశ్వరరావు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి గణపం సుదర్శన్ రెడ్డి ఆరికొండ శ్రీనివాసులు బయ్యపు రెడ్డి కేశవులురెడ్డి జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ స్థానిక మాజీ సర్పంచ్ రమణారెడ్డి సర్పంచ్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర్లు మబ్బు బుచ్చయ్య దిండు మహేష్ దిండు వీరనారాయణ ఎస్ చెంచయ్య కేశవులు కే మాలకొండయ్య పి మాల్యాద్రి కే మాల్యాద్రి ఏలూరు గురవయ్య కాకర్ల హుస్సేన్ నాయుడు బత్తిన వెంకటేశ్వరరావు కాకర్ల మాల్యాద్రి షేక్ రసూల్ జి వెంకటేశ్వర్లు ఎస్టి ఖజా సయ్యద్ చుంచు మల్లికార్జున అడుసు మళ్ళీ తిరుపాలు వెంకటేశ్వర్లు చెరుకూరు వెంకటేశ్వర్లు పత్తిపాటి కృష్ణయ్య చెరుకూరి నాగేంద్రబాబు జి మాల్యాద్రి మాలకొండయ్య గున్న వెంకటయ్య నాయకులు తలప నేనీ వెంగయ్య బి గోపాలు పుల్లయ్య చెంచయ్య బసయ్య మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులు జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నీచ రాజకీయం…. బాబు కోసం శ్రమిస్తానన్న శాంతి..

మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నీచ రాజకీయం…. బాబు కోసం శ్రమిస్తానన్న శాంతి.. .. జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి) ప్రత్యర్థి పార్టీ ల మహిళలను దిగజార్చే విధంగా రాష్ట్రంలో నీచ రాజకీయం నడుస్తోందని తెలుగు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకపాటి శాంతి కుమారి ఆరోపించారు. మర్రిపాడు లో నిర్వహించిన దేశం నేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితులు నేడు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాల పట్ల ఆసక్తి తో వచ్చే ప్రతిపక్షాల మహిళలను తమ సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ సాధనాల ద్వారా తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని ఈ విధానాలకు స్వస్తి పలకగలిగేది చంద్రబాబు పాలన ఒక్కటే అని శాంతి కుమారి పేర్కొన్నారు. వైసీపీ పాలనపై విమర్శలు చేసిన మహిళ లను వారి భావి స్వేచ్చ కు భంగం కలిగించే చర్యలు చేపట్టి ఎన్నో ఘోరాలకు పాల్పడ్డారని శాంతి కుమారి విమర్శించారు. . బాబు ఒక్కరే మహిళలను గౌరవించే నేత అని , తనకు రాష్ట్ర స్థాయి పదవి కల్పించి రాజకీయం లో క్రియా శ్రీలక పాత్ర పోషించాలని ఆదేశించారని శాంతి కుమారి తెలిపారు. బాబు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని , ఎలాంటి ఇబ్బందులైన వెనుకాడేది లేదని శాంతి పేర్కొన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయగలిగిన పాలన చంద్రబాబు ఒకరి వలనే సాధ్యం అనేది ఇప్పటికే ఓటర్లకు స్పష్టత ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారిన నేపథ్యంలో వీటిని నిరసిస్తూ యమ్ యల్ ఎ మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి లు ముందుగానే తమ నిరసన వ్యక్తం చేశారని, దీని ఫలితంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ప్రభుత్వ వ్యతిరేకత నెలకొందని అన్నారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డిఫ్రభాకర్ రెడ్డి , అసెంబ్లీ అభ్యర్థులు విజయం కు కృషి చేస్తామని శాంతి కుమారి తెలిపారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు లో పోటీ “నరశింహస్వామి” ఆదేశమే… పదేళ్ల పాలనలో మేకపాటి ది శూన్యమే…… ఆనం రామనారాయణరెడ్డి…

ఆత్మకూరు లో పోటీ “నరశింహస్వామి” ఆదేశమే… పదేళ్ల పాలనలో మేకపాటి ది శూన్యమే…… ఆనం రామనారాయణరెడ్డి… జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి) ఆత్మకూరు లో మరలా పోటీ కి రావడం కేవలం నరశింహ స్వామి ఆదేశాలేనని ఆత్మకూరు దేశం అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆనం పాత ప్రత్యర్థులు, కొత్త మిత్రులు అయిన మాజీ యమ్ యల్ ఎ లు కొమ్మి లక్ష్మయ్య నాయుడు,కంభం విజయరామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి లతో కలిసి మర్రిపాడు లోని శేఖర్ రెడ్డి నివాసంలో ఎన్నికల ప్రచారం కు శ్రీకారం చుట్టారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన సంధర్భంగా ఒకటిన్నర దశాబ్దం రాజకీయం చేసిన రాపూరు ని వదిలి వై.యస్ సూచనల మేరకు ఆత్మకూరు లో అయిష్టత తోనే పోటీ చేశానని, ఆ సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తమ మండలాలు ఆత్మకూరు లో ఉన్నాయని అండగా నిలిచిన క్రమంలో పలువురు నేతల సహకారం తో విజయం సాధించి, మంత్రిని అయ్యానని అన్నారు. జిల్లాలో ని 46 మండలాలలో నీటి సమస్య ఉన్న ఏకైక మండలం మర్రిపాడు కు కనీసం తాగు నీరు అయినా అందించే క్రమంలో కొన్ని కోట్ల రూపాయలతో పధకం కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆ తర్వాత యమ్ యల్ ఎ బాధ్యతలు చేపట్టిన వారు , ముఖ్యమంత్రి కి సన్నిహితులు గా మంత్రి పదవి చేపట్టిన, ఆయన తర్వాత యమ్ యల్ ఎ అయిన మరో వారసుడు మొత్తం మీద పదేళ్ల పాటు పదవిలో ఉన్నా కనీసం ఆ పధకం ప్రారంభించు కోలేక పోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు పెత్తనం ఇస్తే ఏమి కొత్త గా చేయలేని వారు, కనీసం మొదలు పెట్టిన వాటిని కూడా పూర్తి చేయలేని అసమర్దులకు ఓటు అడిగే హక్కు ఎలా ఉంటుందని అన్నారు. అభివృద్ధికి కేరాఫ్ గా ఆత్మకూరు ను చేసే క్రమంలో పదవీ కాలం పూర్తి అయిందని,ఆ తర్వాత వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం చేయాల్సి వచ్చిందని రామనారాయణరెడ్డి అన్నారు. ఈ సారి కూడా ఎన్నో ఊహాగానాల మధ్య మరలా ఆత్మకూరు నుంచి పోటీ చేయడం.. ఖచ్చితంగా నరశింహస్వామి నిర్ణయమేనని అన్నారు. గతంలో తాను చేయలేక మిగిలిన అభివృద్ధి ని పూర్తి చేసేందుకే భగవంతుడు ఆదేశించారని, ఆత్మకూరు ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని, మిగిలిన అభివృద్ధికి పూర్తి స్థాయిలో రూపం కల్పిస్తానని రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. తనకు తోడుగా నిలిచిన సిద్దాంత పరమైన మాజీ ప్రత్యర్థులు, మిత్రులం కొమ్మి,కంభం, మేకపాటి లతో కలిసి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని ఆనంరామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లి నియోజక వర్గం లొ సోమిరెడ్డికి షాకా ???

*” *”సోమిరెడ్డి వేసిన కండువాలను 24 గంటల లోపే తీసిపారేసి వైకాపా వెంట ఉంటాం అంటున్న సర్వేపల్లి ప్రజలు”* *”సోమిరెడ్డి శిబిరంలో మరోసారి సోమిరెడ్డికి ఓటమి ఖాయమని తెలియడంతో బెంబేలెత్తి వైకాపాలోకి పరుగులు అంటూన్నారు *”సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, కోడూరు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 25 కుటుంబాలు”* *”సోమిరెడ్డి కండువాలు వేసిన 24 గంటల్లోనే సోమిరెడ్డి వద్దు బాబోయ్ అంటూ పరుగులు తీస్తున్న ప్రజలు”* *”సర్వేపల్లి లో సోమిరెడ్డి అవినీతి, అరాచకాలను తెలుసుకున్న వారందరూ సోమిరెడ్డి ధృతరాష్ట్ర కౌగిలి నుండి బయటపడి మంత్రి కాకాణి సమక్షంలో వైకాపా గూటిలోకి చేరుతున్నారు”* *”సర్వేపల్లి నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే బలమైన నాయకత్వం ఉండడంతోపాటు ఎన్నికల వేళలో చేరికలు ఊపందుకోవడంతో సోమిరెడ్డి అసహనంతో సమ్యమనం కోల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు”* *”సోమిరెడ్డి గత్యంతరం లేక గ్రామాలలో తనకు మిగిలిన ఐదు, ఆరు మంది కార్యకర్తలను భద్రపరచుకునేందుకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని అనేక తంటాలు పడుతున్నా.. మిగిలిన ఐదు, ఆరు మంది కూడా వైయస్సార్సీపి వైపు మొగ్గు చూపడంతో చేతులెత్తేస్తున్నాడు”* *”సోమిరెడ్డి ప్రచారానికి జనం రాక నెల్లూరు రూరల్ మండలం నుండి ఆటోలలో తోలుకోవలసిన దుస్థితి ఏర్పడింది”* *”సోమిరెడ్డికి కూలి జనం తప్ప కార్యకర్తలు ఎవ్వరూ ప్రచారంలో పాల్గొనడం లేదు అంటున్న తలమంచి సురేంద్రబాబు  

Featured ఆంధ్రప్రదేశ్

అనుకున్నట్లే కావలి సిద్దం…సక్సస్సే.. అసంతృప్తి కి..తెర పడేనా… గత హామీల పై …ప్రకటన ..నో..

అనుకున్నట్లే కావలి సిద్దం…సక్సస్సే.. అసంతృప్తి కి..తెర పడేనా… గత హామీల పై …ప్రకటన ..నో… జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో ( ఏప్రిల్ పున్నమి) వైసీపీ అభిమానులు ఊహించినట్లుగానే శనివారం సాయంత్రం కావలిలో సిద్ధం సభ కార్యకర్తల సందడితో సక్సెస్ అయ్యింది. కావలి ఎమ్మెల్యే పేర్కొనట్లుగా లక్షన్నర జనాభా తరలివస్తారని చెప్పినా అంతకుమించి జన సందోహం కనపడటం విశేషమే. అంతేకాకుండా వచ్చిన జనంలో కూడా జగన్ ప్రసంగించినంతసేపు భారీగానే స్పందన లభించడం కూడా పార్టీ నేతలను ఆనందానికి గురిచేసింది. సరిగ్గా వారం క్రితం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళంకు అంతగా స్పందన లేదని దీనికి సవాల్ గా జగన్ సభ ఉంటుందని పలు ప్రచారాల యుద్ధం మొదలైనా అది పూర్తిగా కావలి నియోజకవర్గం సభ కావడం, జగన్ సభ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమీకరణ కావడంతో రెండిటికీ పోల్చేందుకు ఎలాంటి అవకాశం లేదు. అయితే జగన్ సభకు విచ్చేసిన వారు ఆయన ప్రసంగాలకి ప్రతిస్పందించడం చంద్రబాబు సభలో అది అంతగా కానురాకపోవడం ప్రధాన తేడా. కానీ జగన్ ఏడాది క్రితం కావలిలో నిర్వహించిన సభలో కావలికి సంబంధించి పలు సుదీర్ఘ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ చేసిన ప్రకటనల ఫలితం ఏది లేకపోవడం కావలి వాసులను చర్చకు గురిచేసింది. కావలి ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సభ తర్వాత పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రకటనలు గుప్పించారు .అయితే ఆ ఫలితాలు ఏవి కనపడకపోవడంతో వాటి గురించి ప్రస్తావన వస్తుందని పలువురు రు ఆశించారు కానీ జగన్ రాష్ట్ర స్థాయిలో ప్రసంగాన్ని కొనసాగిస్తూ అభ్యర్థులను పరిచయం చేస్తూ మరల విజయం కలిగించాలని చంద్రబాబుపై భారీ విమర్శలను గుప్పించి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల శాసన సభ్యులను పరిచయం చేయగా ఎంపీ అభ్యర్థి విజయ సాయిలు మాత్రం అత్యంత ముఖ్యుడు , నమ్మకస్తుడు సన్నిహితుడు అని పేర్కొన్నారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ ఉన్న అతి తక్కువ మంచి వారిలో ఒకరని చెప్పిన అనంతరం వేదిక మీద మధు యాదవ్ ఆయనకు పాదాభివందనం చేయడం కనిపించింది. మొత్తం మీద తక్కువ సమయంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుకున్న విధంగా సభను తీర్చిదిద్దగా ఇతర ప్రాంతాల నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలించడంలో ఉదయగిరి నేతలు రాజారెడ్డి ఆయన తనయుడు అభినవరెడ్డి ప్రథమ స్థానం, ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి కందుకూరు నుండి కూడా భారీగా కార్యకర్తలు తరలి రావడం కనిపించింది. కావలి గ్రామీణ ప్రాంతాల నుండి అదేవిధంగా కార్యకర్తలను తరలించడంలో ప్రతాప్ రెడ్డి సఫలం అయ్యారు. జగన్ సిద్ధం సభ ఎన్నికల్లో వైసిపి పై ఉన్న అసంతృప్తి ని ఏ మేరకు భర్తీ చేస్తుందనే ది తేలాల్సి ఉంది.. ఎందుకంటే తరలింపు లో అన్ని పార్టీల‌ మాదిరిగా… తాయిలాలు… తాంబూలాలు ఉండడమె కారణం.

ఆంధ్రప్రదేశ్

పొత్తుల పార్టీల వారు చిత్తు కావడం ఖాయం*. ఎమ్మెల్యే మేకపాటి*

*జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షం* *: పేదల బతుకు మారింది వైఎస్సార్సీపీ వల్లే* *: పొత్తుల పార్టీల వారు చిత్తు కావడం ఖాయం* *: కరటంపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి* *: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి* *మర్రిపాడు: ఏప్రిల్ (పున్నమి ప్రతినిది)* రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమ పాలన అందించాలని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఇలాగే కొనసాగాలంటే మళ్లీ ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం కరటంపాడు, సాతానుపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. గడచిన ఐదేళ్లలో జగనన్న అందించిన సుభిక్ష పాలనను ప్రజలకు వివరించి మళ్లీ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మరిన్ని ప్రజా ఉపయోగకరమైన పనులు చేపడుతారని అన్నారు. ఐదేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదినే పించను అందించామని, దీనిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థ సేవలను అడ్డుకుని పించన్ దారులను కష్టాలకు గురిచేశారన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందచేశారని, ఒక్క కరటంపాడు పంచాయతీ పరిధిలోని రూ.12.63కోట్ల మేర డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా అందచేయడం జరిగిందని వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.22 లక్షలు అందచేయఢం జరిగిందని అన్నారు. పంచాయతీ పరిధిలో 171 మంది రైతులకు సంబంధించిన సుమారు 140 ఎకరాలకు సంబంధించి భూ సమస్యలను పరిష్కరించడం జరిగిందని వివరించారు. గత ఐదేళ్ల కాలంలో జగనన్న ఇంతటి సంక్షేమాన్ని అందించారని, రానున్న రోజుల్లో కరటంపాడు పంచాయతీకి చేయబోయే పనులను సైతం ఇప్పుడే తెలుపుతున్నామని అన్నారు. కమ్యూనిటి హాల్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, బస్ షెల్టర్ ఏర్పాటుతో పాటు పంట కాలువకు సిమెంట్ కాంక్రీట్ నిర్మాణం, శ్మశానానికి మౌళిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. గ్రామంలో మిగిలి ఉన్న అభివృద్ది పనులన్నింటిని పూర్తి చేస్తామని వివరించారు. సంక్షేమ సారధి జగనన్నను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటి చేయలేక ఒక సినిమా యాక్టర్ ను ముందు తీసుకొచ్చారని, అతనితో కూడా పనికాదని తెలుసుకుని ఢిల్లీకి పరుగెత్తి టిక్కెట్లు అందించి మరీ పొత్తులు పెట్టుకున్నారని, ఇలా పార్టీల పొత్తులతో పడి ప్రజలతో పొత్తు మరచిపోయారని, వారిని ప్రజలందరూ చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. సంక్షేమాభివృద్ది కోసం జగనన్న ప్రజలతో పొత్తు పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటి చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. ప్రజలే ఆయన వారధులుగా మారి మరోమారు సారధ్య బాధ్యతలు అప్పగించాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీలో చేరడంతో వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం కరటంపాడులోని మస్జీదే అక్సాలో ముస్లీం సోదరులతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి తొలుత ప్రత్యేక దువా కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లీం సోదరులతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ముస్లీం సోదరులకు ముందస్తుగానే రంజాన్ మాస శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో టిడిపి మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్ధన్ నాయుడు అధ్యక్షతన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయసమావేశం

*మర్రిపాడు లో టిడిపి ఆత్మీయ సమావేశంలో* *పాల్గొన్న అతిరధ మహారథులతో* *మేకపాటి చంద్రశేఖరరెడ్డి అదేర్యంలో* *ఆనం రామనారాయణ రెడ్డి భేటీ* *మర్రిపాడు: ఏప్రిల్ (పున్నమి ప్రతినిది* మండల కేంద్రంలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో టిడిపి మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్ధన్ నాయుడు అధ్యక్షతన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయసమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నేను వైఫల్యం చెందారన్నారు. రూ 2.70 వేల కోట్ల రూపాయలు నేరుగా అందరి ఖాతాలకు వేస్తున్నామని ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు 89 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగా వైసిపి ప్రభుత్వం వాటిని 69 లక్షలకు కుదించారని ఈరేషన్ కార్డులు తొలగించడానికి గల కారణాలను వైసిపి ప్రభుత్వం చెప్పాలన్నారు. టిడిపి హయాంలో రేషన్ కార్డు కలిగిన వారికి బియ్యంతో పాటు 8 రకాల సరుకులు అందజేశారని, వైసిపి ప్రభుత్వం బియ్యానికి పరిమితం చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం 5.65 వేల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఉచితంగా ఇస్తే జగన్ ముద్రించిన కార్డులకు ఇస్తున్నారన్నారు. రైతు భరోసా కింద రైతులకురూ 13500లు ఇస్తామని చెప్పిరూ7500లు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ కింద ఇచ్చే రూ 6000 లు కలుపుకుని మొత్తం నేనే ఇస్తున్నానని అనడం సిగ్గుచేటన్నారు. ఇలా పేదలను రైతులను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వక 70 పథకాలు రద్దయ్యాయన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమానికి 19 శాతం నిధులు ఖర్చు చేయగా, వైసిపి ప్రభుత్వం 15శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 16 లక్షల మంది పేద విద్యార్థులకు అందించామని, జగన్ ప్రభుత్వం 9 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చిందన్నారు. మద్యం తయారు చేసే కంపెనీలకు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి యజమానులుగా ఉండి విషపూరితమైన మద్యము తయారుచేసి కోట్లాదిమంది పేదల బ్రతుకులతోఆటలాడుకుంటున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారంలో లక్షల కోట్లు దోసుకుంటున్నారన్నారు. బాబాయిని చంపిన వారిని వెంటపెట్టుకొని తిరుగుతున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఒకసారి తండ్రిని మరొకసారి బాబాయ్ గుండెపోటు గొడ్డలిపోటని జగన్ చిత్రీకరించాడని ఎద్దేవా చేశారు. దోపిడి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని సొంత చెల్లెలు ప్రజలకు నిజాలు తెలియజేసేందుకు బయలుదేరారన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసి మండల ప్రజలకుసాగు త్రాగునీరుఅందిస్తామన్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు, ఐదేళ్లలో యువతకు 20 లక్షల మందికి ప్రైవేటు ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15వేలు, ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే రూ 30000, ముగ్గురు ఉంటేరూ 45వేలు ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ 20వేలు అందజేస్తామని, ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకురూ 15 వేలు చొప్పున 54 సంవత్సరాల వరకు ఇస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిదుల తో బీసీలను ఆదుకుంటామని , బలహీన వర్గాలవారికి 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. త్వరలో జరగబోయే మహాసంగ్రామం లో మొదటి ఓటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతకుమారి, వైసిపి నాయకులు రవీంద్రారెడ్డి గిరినాయుడు శాఖమూరి నారాయణ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైకాపాకు జై కొడుతున్న సర్వేపల్లి మహిళా లోకం”: తలమంచి సురేంద్రబాబు

*”* *”తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ మెజారిటీ తెచ్చే ఇస్కపాలెం గ్రామంలోనే తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో వైకాపాలో చేరికలు ఉదృతమయ్యాయి”*”సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సాధించే గ్రామమే లేకుండా పోయింది”*   వైకాపాకు జై కొడుతున్న సర్వేపల్లి మహిళా లోకం””పాపం సోమిరెడ్డి నెల్లూరు జిల్లాలో 6వ సారి, సర్వేపల్లి లో 5వ సారి ఓటమికి సిద్ధమైపోయాడు””సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి మహిళా శక్తి ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు తాటి బోయిన విజయమ్మ గారితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 మంది మహిళలు””సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపి దాదాపుగా ఖాళీ అయిపోయింది”**”గ్రామంలో మిగిలిన ఐదు, ఆరు మంది తెలుగుదేశం వారికే సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలో చేరారంటూ వారిని నిలుపుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నాడు”*”తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి లో కనుమరుగైపోయింది”*”మహిళల పట్ల చులకన భావం ఉన్న సోమిరెడ్డిని ఓడించి తీరుతామంటూ కంకణం కట్టుకుంటున్న సర్వేపల్లి మహిళా లోకం”**”ఇస్కపాలెం గ్రామంలో ఇప్పటికే రెండు విడతలుగా తెలుగుదేశం పార్టీ నుండి వివిధ నాయకుల ఆధ్వర్యంలో వైకాపాలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి దిక్కు లేకుండా పోయింది”**”మహిళలకు వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ఎన్నిసార్లు మెజారిటీ తెచ్చినా.. గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మంత్రిగా సోమిరెడ్డి విఫలమయ్యాడని.. మంత్రి కాకాణి గ్రామాలకి కోట్లు ఖర్చుపెట్టి సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేశారని అందుకే తామంతా ఏకపక్షంగా కాకాణి వెంట నడిచి కాకాణి కి భారీ మెజారిటీతో విజయం సాధించడానికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు”**”మహిళలు సమైక్యంగా, ప్రత్యేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తూ మహిళా లోకానికి తన ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో 80% మహిళలు తమకు వెన్నుదన్నుగా నిలిచినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి”**”సర్వేపల్లి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజారిటీతో మంత్రి కాకాణి విజయం సాధించడం ఖాయం అని స్థానిక నాయకులు అన్నారు

Featured

*ఆత్మకూరు రూరల్ మండలం తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న అనం*

  * ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు రూరల్ మండల కన్వినర్ సుంకర పెంచల చౌదరి, కేతా విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మకూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో పాల్గున్నా మాజీ మంత్రి వర్యలు, ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో అందరినీ ఆత్మీయంగా పలకరించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించి ఈ ప్రాంత అభవృద్ధికి తోడ్పాటు అందించే దానికి నన్ను అసెంబ్లీకి పంపిస్తా రని కోరుకుంటున్నాను. ఈ కార్య క్రమం లో తెలుగదేశం కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.