Friday, 6 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

కొత్త సీసా పాత సారా వల్ల మంత్రులు పని చేయలేక పోతున్నార?????

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా…కొంత మంది మంత్రులు ఇంకా తమశాఖలపై పట్టుసాధించలేకపోతు న్నారు. ముఖ్యంగా నూతనంగా ఎమ్మెల్యేలు అయి తొలిసారి మంత్రివర్గంలోకి వచ్చిన పలువురు మంత్రులు విఫలం అవుతున్నారన్న భావన అటుపార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ‘చంద్రబాబు’ మంత్రివర్గంలో 24మంది మంత్రులు ఉంటే..వీరిలో నలుగురైదు గురు తప్ప మిగతా వారంతా…విజయవంతం కాలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు పాలనాపరంగా..అటు రాజకీయం గా కూడా వీరు తీవ్రంగా నిరుత్సాహానికి గురిచేస్తున్నాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదుగురు ఓకే…! ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్‌’ ‘నాదెండ్ల మనోహర్‌’, ‘నిమ్మలరామానాయుడు’, ‘సత్యకుమార్‌యాదవ్‌’ కొంత వరకూ ఉపముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్‌’లు మాత్రమే తమ తమ శాఖలపైపట్టు సాధించగలిగారు. ‘విద్యాశాఖ మంత్రి’ ‘నారా లోకేష్‌’ దూసుకుపోతు న్నారు. తన శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలను ఆయన చేస్తున్నారు. విద్యాశాఖపై ఆయన బాగానే పట్టుసాధించగలిగారు. ఎంతో కష్టమైన ‘విద్యాశాఖ’ను ఆయన తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్యలు వచ్చినా..ఆయన వాటికి వెంటనే పరిష్కారాలు చూపిస్తున్నారు. అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను, నిరుద్యోగులను ఆయన సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు. అయితే..కూటమి ప్రభుత్వ హామీ అయిన ‘మెగా డీఎస్సీ’ వెంటనే అమలు చేయకపోవడం, విద్యార్థులకు ఇస్తానన్న రూ.15వేలు వెంటనే వేయకపోవడం ఆయనకు మైనస్‌గా చెప్పవచ్చు. కాగా..‘లోకేష్‌’ కార్యాలయ సిబ్బంది విషయంలోనే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము ‘లోకేష్‌’ వద్ద పనిచేస్తున్నామన్న గర్వంతో..వారి వద్దకు వచ్చేవారిని చులకనగా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమస్యలపై వచ్చేవారిని కలవకుండా…తమకు ఇష్టం వచ్చిన వారినే కలుస్తున్నారని, మంత్రి కార్యాలయ అధికారుల వ్యవహారం బాగాలేదనే విమర్శలు ఉన్నాయి. కాగా జలవనరులశాఖ మంత్రి ‘నిమ్మల రామానాయుడు’ తనపని తాను చేసుకుంటూపోతున్నారు. ఆయన పనితీరును వంకపెట్టడానికేమీ లేదు. అయితే..ఆయనకూ, ఆ శాఖ కార్యదర్శికి మధ్య విభేదాలు ఉన్నాయని, వారిద్దరికి పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది. మంత్రిని ఆశాఖ కార్యదర్శి అసలు పట్టించుకోవడం లేదని, లెక్కచేయడం లేదని, ఆయనను మార్చాలని కోరినా ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ అలానే కొనసాగిస్తున్నారని ఇది మంత్రికి ఇబ్బంది అవుతోందనే ప్రచారం ఉంది. వైద్యశాఖ మంత్రి ‘సత్యకుమార్‌ యాదవ్‌’ కూడా తనశాఖపై పట్టుసాధించారు. ఆయన చురుగ్గా పనిచేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తాను చేయాలనుకునే పనులను నేరుగా చేసుకుంటూ వెళుతున్నారని, ఎవరి ఆదేశాల కోసం ఆయన చూడడం లేదని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారంటున్నారు. ‘జనసేన’కు చెందిన ‘నాదెండ్ల మనోహర్‌’ కూడా స్థిరంగానే పనిచేస్తున్నారు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఈయన తనశాఖపై బాగానే పట్టుసాధించారు. అయితే..అక్రమబియ్యం విషయంలో హడావుడి చేసి తరువాత..నెమ్మదించారని, దీని వెనుక ఏదో జరిగిందనే ప్రచారం సాగుతోంది. అయితే పాలనాపరంగా మాత్రం ఆయన బాగానే పనిచేస్తున్నారంటున్నారు. కాగా ఉపముఖ్యమంత్రి ‘పనవ్‌కళ్యాణ్‌’ తనశాఖపై పట్టుసాధించడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే..ఆయన పాలనను సీరియస్‌గా తీసుకోవడం లేదని, ముఖ్యమైన సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారని, దీంతో ఆయనకు పాలనపై పెద్దగా ఆసక్తి లేదనే ప్రచారం సాగుతోంది. అయితే..ఆయన కార్యాలయం బాగా పనిచేస్తుందని, దీనితో..ఆయన వచ్చినా రాకపోయినా..ఆయనశాఖ పనితీరు బాగా ఉంటుందంటున్నారు. కీలక మంత్రులు..వైఫల్యం…! కాగా కొన్ని కీలకమైనశాఖలకు మంత్రులుగా ఉన్నవారు..తమ పనితీరును మెరుగుపర్చుకోలేకపోతు న్నారనే విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా మున్సిపల్‌ మంత్రి ‘నారాయణ’, వ్యవసాయమంత్రి ‘అచ్చెంనాయుడు’, రెవిన్యూ మంత్రి ‘అనగాని సత్యప్రసాద్‌’, ఆర్థికశాఖమంత్రి ‘పయ్యావుల కేశవ్‌’ హోంమంత్రి ‘అనిత’, మైనింగ్‌శాఖ మంత్రి ‘కొల్లు రవీంద్ర’లు అంచనాల మేరకు రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని ‘అమరావతి’ విషయంలో ‘మంత్రి నారాయణ’ ఘోరంగా విఫలం అవుతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా..రాజధానిలో ఏమీ జరగడం లేదనే భావన ప్రజల్లో ఉంది. రాజధాని ప్రాంతంలో ఈమాటలు బాహాటంగా వ్యక్తం అవుతున్నాయి. ‘ఇక్కడ ఏమీ జరగడం లేదు..కనీసం…కరకట్టను కూడా వీళ్లు ఇంత వరకూ వెడల్పు కూడా చేయలేకపోయారు’..ఇంక రాజధానేమి కడతారు..అనే భావన వీరిలో ఉంది. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావడం లేదని వారు అంటున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఆలస్యం చేసి..గ్రాఫిక్స్‌ రాజధాని అంటూ ప్రత్యర్థుల ద్వారా ఎద్దేవా చేయించుకున్నారు. చివరకు అది ఎన్నికల్లో పెనుప్రభావాన్ని చూపించింది. ఈసారి కూడా ఇలా కాలాన్ని వృధా చేస్తే..గతంలో వచ్చిన ఫలితాలే వస్తాయి. ‘రెవిన్యూమంత్రి’ ‘అనగాని సత్యప్రసాద్‌’కు కీలకమైనశాఖ దక్కినా..ఆయన ప్రతిదానికి ‘లోకేష్‌’ వైపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం సృష్టించిన భూసమస్యలను పరిష్కరించలేక రెవిన్యూశాఖ కిందామీదా పడుతోంది. ఇది రోజు రోజుకు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. మరో మంత్రి ‘పయ్యావుల కేశవ్‌’ పనితీరు కూడా బాగాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన తనశాఖలో సగం పెత్తనం ఆయన స్నేహితుడికి అప్పగించారని, దీంతో..ఆయన పెత్తనం శాఖలో పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. సదరు మిత్రుడు అన్నింటిలో వేలు పెడుతున్నాడని, తద్వారా..మంత్రికి చెడ్డపేరు వస్తుందని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ‘కేశవ్‌’ మంత్రి అయిన తరువాత కనీసమాత్రంగానైనా మీడియా సమావేశాలు నిర్వహించడం లేదు. ఎందుకో..ఆయన ఒక కోటరిలో బందీ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వ్యవసాయశాఖ మంత్రి తన కార్యాలయ అధికారుల అవినీతిని కట్టడి చేయలేకపోతున్నారు. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా..చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. హోంమంత్రి ‘అనిత’ ప్రతివిషయానికి ‘లోకేష్‌’పై ఆధారపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. మైనింగ్‌,ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన ప్రత్యర్థి ‘పేర్ని నాని’ని కట్టడి చేయలేకపోతున్నారు. ‘పేర్ని’ అక్రమ బియ్యం విషయంలో అడ్డంగా దొరికినా..‘రవీంద్ర’ ఏమీ చేయలేకపోయారనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కాగా..మిగతా మంత్రుల్లో చాలా మంది తాము మంత్రులమనే విషయాన్నే మరిచిపోయినట్లుంది. అంతే కాకుండా..గత ‘జగన్‌’ ప్రభుత్వంలో పనిచేసిన వారికే వీరు పెద్దపీట వేశారనే విమర్శలను కొనితెచ్చుకుంటున్నారు. వారి కార్యాలయాల్లో పిఆర్వోఓలుగా వారినే కొనసాగిస్తూ..అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. పాలనాపరంగా వీరు కీలకంగా పనిచేయడం లేదు. దీంతో వీళ్లు పేరుకు మంత్రులు తప్ప..చేసేదేమీ ఉండదని వారి స్వంత మనుషులే చెప్పుకుంటున్నారు. మొత్తం మీద.. కూటమి మంత్రుల్లో’ పెక్కుమంది తమశాఖలపై పట్టుసాధించలేక విమర్శలు కొనితెచ్చుకుంటున్నారు. త్వరలో ‘నాగబాబు’కు మంత్రి పదవి ఇవ్వడానికి మంత్రివర్గ విస్తరణ చేస్తారని, ఈ సందర్భంగా ఘోరంగా విఫలమైన ముగ్గురు లేక నలుగురిపై వేటు వేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే..ఎవరిపైనా వేటు వేయరని..ఏడాదిన్నర తరువాతే..వీరిపై వేటు ఉంటుందనే ప్రచారం ఉంది. ఈలోగా అయినా..విఫలం అవుతున్న మంత్రులు…తమ పనితీరు మార్చుకోవాలని, అప్పుడే..వారి మంత్రి పదవి పదిలంగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Featured ఆంధ్రప్రదేశ్

అధోగతి పాలౌతున్న ఆంధ్రప్రదేశ్‌!! మోడీ మాయ, చంద్రబాబు మౌనం జగన్‌ మారం తో సరిపెట్టుకోనున్నారా?

(అమరావతి పున్నమి అసోసియేటు ఎడిటర్ సూరం మల్లికార్జున శర్మ) 2024 ఎన్నికలకు ముందు మన రాష్ట్రం తిరుగులేనిదిగా అభివృద్ధి చేస్తామని అభూత కల్పనలు కల్పించగల్గడం కూటమి ప్రభుత్వం సఫలీకృతుమైంది. ఎప్పుడూ, ఎవ్వరూ ఊహించని రీతిలో కూటమిని గెలిపించుకున్నారు. హామీల వెల్లువ కురిపించారు, ప్రజలు హామీల కంటే ప్రభుత్వ యంత్రాంగం యొక్క పని తీరులో మార్పును కోరుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వపు వైఫల్యాలు వెల్లడిరచడంలో కాలయాపన చేస్తూనే వున్నారు తప్పితే వారి మార్కు పాలన చూపడం లేదనే చెప్పాలి. జూన్‌లో మొన్ననే ప్రమాణ స్వీకారం చేశామన్నారు, జూలైలో ఇంకా రెండు నెలలు కూడా కాలేదన్నారు తరువాత ఖజనా ఖాళీగా వుందన్నారు, ఆ తరువాత ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నాము అని పది నెలలు గడిపారు తీరా ఇప్పుడు ప్రశ్నిస్తే అప్పుడే కొంపలేమీ మునిగి పోయాయి ఇంకా నాలుగేళ్లు వున్నాయంటున్నారు. మోడీకి తన పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీటు కొరకు పెట్టిన శ్రద్ధలో వందో వంతు ఆంధ్రా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాడా ఆయనే ఆత్మావలోకనం చేసుకోవాలి. గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయన పూర్తి స్థాయిలో నమ్మలేకున్నాడు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇంచు మించు ఇద్దరు వయస్సు పై బడ్డ నాయకులుగా మిగలనున్నారు. మోడీకి తన తరువాత ఏమిటి అని ప్రశ్నార్థకంగా వుంటే, చంద్రబాబు మాత్రం లోకేష్‌ తన వారసుడుగా నిలబెట్టుకోవడంలో సఫలీకృతుడౌతున్నాడు. ఇక చంద్రబాబు తాను 95 నాటి సిఎం నని పదే పదే ముసలి చాదస్తపు మాటలు తప్పితే తాను గ్రహణం పట్టిన చంద్రుడు వలె వ్యవహరిస్తున్నాడు, ఇక ఏమన్నా ప్రశ్నిస్తాడేమో అని జగన్‌ వైపు చూస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆ పై నన్ను మాజీ ముఖ్యమంత్రి స్థాయి గుర్తింపు ఇవ్వండి అని మారం చేస్తున్నాడు. ఈ వ్యవహారాలు ఇలాగే కొనసాగితే రాబోయే నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్‌ అధోగతి పాలవడం ఖాయమన్పిస్తూంది. ఇక పవన్‌ కళ్యాణ్‌ గురించి చెప్పాలంటే తనకే రాజకీయ పరిపక్వత రాలేదు, ఆయన అభిమానులు మాత్రం ఏ అంశం మీద అధ్యయనం చేసే దిశలో నిర్ధిష్టంగా ఆలోచించే స్థాయికి చేరుకోగల్గితే ఆ పార్టీకి మనుగడ వుంటుంది. ఇక సచివాలయంలో ఠాకూర్‌ సినిమాలో వలె నిత్యం ఫైల్స్‌, అధికారుల హడావుడి జరుగుతూనే వుంది, తద్వారా ఫలితమేముస్తుందో వేచి చూడాల్సిందే!

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు విద్యారంగంలో కొత్త అధ్యాయం.. జి.వి.కె ఇంటర్నేషనల్ స్కూల్ తో..

జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు బ్యూరో (మార్చి పున్నమి) విద్యా రంగ చరిత్రలో కొత్త అధ్యాయం కు శ్రీకారం చుడుతున్నామని ప్రఖ్యాత సి బి ఎస్ సి గర్ల్స్ స్కూల్ గా జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి వేదిక సిద్ధం చేసిందని కస్తూరి దేవి విద్యా కమిటీ పేర్కొంది .బుధవారం నాడు విద్యా కమిటీ కార్యదర్శి దొడ్లశేషారెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పి.వి.ప్రసన్నరెడ్డి, పుచ్చలపల్లి ఆదిశేషారెడ్డి, విశ్రాంత ఐ.ఎ.యస్ అధికారి రామ్ శేఖర్,జి.వి.కె ఇంటర్ నేషనల్ స్కూల్ ఇ.డి ఉషారెడ్డి విలేకరుల సమావేశంలో ప్రీమియర్ సి బి ఎస్ సి గర్ల్స్ స్కూల్ వివరాలను తెలిపారు. డాక్టర్. జివికె రెడ్డి జన్మభూమి మీద అభిమానంతో 25 కోట్ల విరాళం అందజేసిన నేపథ్యంలో ఈ స్కూలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికి అందుబాటులో ఉండేలా ఉత్తమ విద్యను అందించేందుకు సిద్ధమైందని వారు తెలిపారు. నాణ్యమైన బోధన లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో నూతన బోధన పద్ధతులతో ప్రశ్నా దారిత బోధన విధానాలు సాంకేతికతను విద్యార్థుల సృజనాత్మక జోడించి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. స్కూల్లో అత్యధిక ఆధునిక,లేబరేటరీలు అందుబాటులో ఉంటూ నిత్యం సీసీటీవీ ల పర్యవేక్షణతో కూడిన భద్రతా వ్యవస్థ మధ్య సురక్షితమైన విద్యను బాలికలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు దొడ్ల శేషారెడ్డి తెలిపారు. కస్తూరి విద్యాలయావరణంలో ఉన్న ప్రస్తుత ఉచిత పాఠశాల ఉచిత బోధనను యధాతధంగా అందిస్తుందని, నూతనంగా ఏర్పడిన పాఠశాల నో ప్రాఫిట్ నో లాస్ కింద విద్యను అందిస్తుందని పి.వి.ప్రసన్నరెడ్డి తెలిపారు. ఇది లాభార్జన కోసం అయితే ఖచ్చితంగా కాదని కేవలం నెల్లూరు ప్రాంత బాలికలకు ఉన్నత ఆధునిక విద్యను అందించాలనే జీవీకే ఆశయం కోసమని ప్రసన్న రెడ్డి తెలిపారు. ఇందులో 1500 మందికి విద్యాభోధన చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు ప్రాంత బాలికలకు ఇది ఒక వరమని ఆయన తెలిపారు. ఈ పాఠశాలను విజయవంతంగా తీర్చిదిద్దేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రామ్ శేఖర్, ప్రముఖ విద్యావేత్త ఉషా రెడ్డిలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు ప్రాంతంలో ఇప్పటి వరకు లేని విధంగా ఈ పాఠశాల తమ పని తీరు చూపించి నెల్లూరు లో బాలికా విద్య లో కొత్త చరిత్ర సృష్టించే విధంగా పని చేయడం ఖాయమని ఉషారెడ్డి తెలిపారు. జి.వి.కె. రెడ్డి ఉన్నతమైన ఆశయాలకు వేదికగా ఏర్పడిన ఈ పాఠశాల పర్యవేక్షణలో తనకు అవకాశం కల్పించడం తన అదృష్టమని విశ్రాంత ఐ.ఎ.ఎస్ అధికారి రామ్ శేఖర్ పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఉన్న ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకొని విజయవంతం చేస్తే డాక్టర్ జి.వి.కె.రెడ్డి జిల్లాలో విద్యా రంగం పై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుచ్చలపల్లి ఆదిశేషారెడ్డి తెలిపారు. పాఠశాల కు సంబంధించిన విద్యా వివరాలను ఎ.ఒ నరేష్ వివరించారు.

Featured ఆంధ్రప్రదేశ్

నగర మేయర్ కు ఇదే చివరి సమావేశమా. అవిశ్వాస తీర్మానానికి దేశం ప్రయత్నాలు .??

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో ( మార్చి పున్నమి) బుధవారం జరిగిన నెల్లూరు కార్పోరేషన్ బడ్జెట్ సమావేశమే స్రవంతి కి మేయర్ గా చివరి సమావేశం కానుందనే గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్పొరేషన్ల లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాలు పెట్టి వాటిని తమ ఖాతాలో వే‌సుకుంటున్న తరుణంలో నెల్లూరు కార్పోరేషన్ కూడా అదే బాటలో తమ జెండా కిందకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే అక్టోబర్ నాటికి కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సన్నద్ధం చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో బలం చేకూరడంలో . అదనంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు కూడా ఉండటంతో అవిశ్వాసం ఖాయం అనే ప్రచారం బలంగా ఉంది . అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నాలుగేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలోనే ముందుగానే జిల్లా పాలన అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి కార్పొరేషన్ అధికారులకు అవిశ్వాస తీర్మానం అందజేయాలనే వ్యూహం లో టిడిపి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే అక్టోబర్ కు ముందుగానే అవిశ్వాస తీర్మానం కార్పొరేషన్ లో ఇచ్చి నాలుగేళ్లు పూర్తి అవ్వగానే వెంటనే సర్వసభ్య సమావేశం తో మేయర్ ను తొలగించి నూతన మేయర్ గా నియమించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు మంత్రి నారాయణ, రూరల్ యమ్ యల్ ఎ శ్రీ ధర్ రెడ్డి చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. రానున్న ఆరు నెలల్లో రాజకీయ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో నూతన మేయర్ ఎంపిక లో ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయన్నది కూడా ఆసక్తి కరమే. సంవత్సర కాలం పదవి విషయంలో ఎలాంటి ఒప్పందాలు నెల్లూరు, నెల్లూరు రూరల్ మధ్య చోటు చేసుకుంటాయి నున్నది కూడా విశేషమే.ఇప్పటికే పలు ” యు” టర్న్ లు తీసుకున్న మేయర్ స్రవంతి మరో టర్న్ అనేది కూడా ఆసక్తి కరమే.. వేచి చూడాల్సిందే

Featured ఆంధ్రప్రదేశ్

జపాన్ కనెక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్’ సెమినార్‌లో శ్రీసిటీ ఎండీ,

జపాన్ కనెక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్’ సెమినార్‌లో శ్రీసిటీ ఎండీ, జపాన్ – ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: పెట్టుబడులకు కొత్త అవకాశాలు “జపాన్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యం” – ‘   శ్రీసిటీ, మార్చి (పున్నమి ప్రతినిధి) భారతదేశంలోని జపాన్ రాయబారి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి మండలి (ఈ.డి.బి), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్.ఐ.సి.సి.ఐ) సంయుక్తంగా, “పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంబంధాలు & విద్య” అంశాలపై నిర్వహించిన సెమినార్‌ బుధవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం జపాన్-ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వేదికగా నిలిచింది. ఈ సదస్సులో భారతదేశంలో జపాన్ రాయబారి ఓనో కెయిచీ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు & వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి, పాల్గొన్నారు. ఎఫ్.ఐ.సి.సి.ఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డా. గుణవీనా చద్ధా సమన్వయం చేయగా, విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ మేనుఫ్యాక్చరింగ్ సి.ఈ.ఓ జితేంద్ర నిమ్మగడ్డ అతిథులకు స్వాగతం పలికారు. . జపాన్ రాయబారి ఓనో కెయిచీ, భారతదేశంతో జపాన్ వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. జపనీస్ పెట్టుబడులకు శ్రీసిటీ ప్రధాన వేదికగా మారిందని గుర్తు చేశారు. మంత్రి టి.జి. భరత్ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్-జపాన్ కనెక్ట్ విధానం ద్వారా జపనీస్ కంపెనీలను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహాలను మంత్రి భరత్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దార్శనిక నాయకత్వాన్ని ప్రశంసించిన డా. రవీంద్ర సన్నారెడ్డి, జపాన్-భారత సంబంధాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలను, తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దక్షత గల నాయకత్వం, విదేశీ పెట్టుబడుల కోసం స్నేహపూర్వక వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, మొదలగు కారణాల వల్ల పెట్టుబడులకు రాష్ట్రం కీలక గమ్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. శ్రీసిటీ ప్రస్తుతం భారతదేశంలో రెండో అతిపెద్ద జపనీస్ టౌన్‌షిప్ గా రూపుదిద్దుకున్నదని తెలియజేశారు. ప్రస్తుతం ముప్పై ఒక్క జపనీస్ కంపెనీలు శ్రీసిటీలో అధునాతన ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయని వివరించారు. నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, స్థిరమైన పారిశ్రామికీకరణ వంటి అంశాల్లో శ్రీసిటీ ప్రధాన పాత్ర పోషిస్తోందని, తద్వారా స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. జపాన్-ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడుల విస్తరణ, ప్రజల మధ్య సంబంధాల అభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతికత రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించే దిశగా కట్టుబడి ఉన్నట్లు వెల్లడిస్తూ ఈ సదస్సు ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని జపాన్ వ్యాపార కేంద్రంగా మరింతగా ఎదుగుతుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

Featured ఆంధ్రప్రదేశ్

రాజకీయ నాయకులకు ప్రజలు బానిసలా???

కొంద‌రు రాజ‌కీయ నేత‌లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్టారాజ్యంగా చెల‌రేగిపోతారు. అవినీతి,అక్ర‌మాలు, అనైతిక కార్య‌క్ర‌మాలు..ఇలా ఒక‌టేమిటి..స‌మ‌స్థ అవ‌ల‌క్ష‌ణాలు వాళ్ల‌లోనే ఉంటాయి. అధికారం ఉన్న‌ప్పుడు తామేదో చ‌క్ర‌వ‌ర్తుల‌మ‌న్న‌ట్లు, ప్ర‌జ‌లంతా త‌మ బానిస‌లు అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తారు. తాము దోచుకోవ‌డానికి, ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చేయ‌డానికే పుట్టిన‌ట్లు భావిస్తారు. ఇష్టారాజ్యంగా ప్ర‌జ‌ల సొమ్ము దోచేసి..ల‌క్ష‌ల కోట్లు సంపాదిస్తారు. అయితే..ఇదంతా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం రాక‌ముందే. ప్ర‌జ‌ల్లో ఒకసారి చైత‌న్యం వ‌చ్చిందంటే..ఇటువంటి వారి ఆట‌లు సాగ‌వు. ఇప్పుడు అచ్చం అలాగే జ‌రుగుతోంది మాజీ మంత్రి ‘విడుద‌ల ర‌జ‌ని’ విష‌యంలో. వైకాపా’ హ‌యంలో మంత్రిగా ప‌నిచేసి ఈమె అప్ప‌ట్లో ఇష్టారాజ్యంగా చెల‌రేగిపోయింది. చిల‌క‌లూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె త‌రువాత మంత్రి అయ్యారు. అయితే..మంత్రి అయిన త‌రువాత‌..ఆమె, ఆమె అనుచ‌రుల దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. చిల‌క‌లూరిపేట త‌న సామ్రాజ్యం అయిన‌ట్లు..ఇక్క‌టి ప్ర‌జ‌లు త‌న బానిస‌ల‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించి..వారిని అష్ట‌క‌ష్టాల‌కు గురిచేసింది. ఇష్టారాజ్యంగా వ‌సూళ్లు సాగించింది. త‌న‌కు ఇష్టం లేనివారిపై పోలీసుల‌ను ప్ర‌యోగించి కేసులు పెట్టించింది. త‌నకు ఎదురుతిరిగిన వారికి శ్రీ‌కృష్ణ‌జ‌న్మ‌స్థానాన్ని చూపించింది. అయితే రోజుల‌న్నీ ఒకే విధంగా ఉండ‌వు క‌దా…! సార్వ్రత్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆమెకు ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. గ‌తంలో చేసిన అవినీతి, అరాచ‌కాలు, అనైతిక‌ప‌నుల‌పై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేయిస్తోంది. ఆమె అవినీతికి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆధారాలు ల‌భించ‌డంతో..ఇప్పుడు ఆమెపై ఏసీబీ కేసు న‌మోదు అయింది. చిల‌క‌లూరిపేట‌కు చెందిన వ్యాపారి బెదిరించి ఐదు కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన వైనంపై ఆమెపై ప‌క్కా ఆధారాల‌తో కేసు నమోదు అయింది. త‌న‌పై కేసు న‌మోదు కావ‌డంతో..ఈ మాజీమంత్రి ఇప్పుడు చిందులు తొక్కుతున్నారు. తాను బీసీ మ‌హిళ‌ను క‌నుకే త‌న‌పై కేసులు పెట్టార‌ని, న‌ర్స‌రావుపేట ఎంపి శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు, స్థానిక ఎమ్మెల్యే ‘పుల్లారావు’లు క‌లిసి త‌న‌పై కేసు పెట్టించి వేధిస్తున్నార‌ని, ఒక బీసీ మ‌హిళ‌ను ఈ విధంగా వేధిస్తారా..అంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎప్పుడూ ఆమె కులాల గురించి మాట్లాడ‌లేదు. ఒక్క‌సారి అధికారంపోయి..త‌మ అవినీతి, అరాచ‌కాలు బ‌య‌ట‌కు వ‌స్తున్న త‌రుణంలో ఆమె త‌న కులం గురించి, తాను మ‌హిళ అనే సంగ‌తి గుర్తొచ్చింది. అవినీతి, అరాచ‌కాలు చేసేట‌ప్పుడు గుర్తుకు రాని ఆమె కులం..ఇప్పుడు కేసు నమోదు కావ‌డంతోనే గుర్తుకు వ‌చ్చిందా..? ఇప్పుడు కులాన్ని అడ్డుపెట్టుకుని..ఆమె కేసుల నుంచి త‌ప్పించుకుంటుందా..?  కులం ఆమెను కాపాడుతుందా..? ఏమో… మొత్తానికి…టిడిపికి చెందిన ఈ మొక్క‌..అక్క‌డ సీటు రాక‌పోవ‌డంతో..వెంట‌నే వైకాపా’లోకి దూకి ఎమ్మెల్యే సీటు సంపాదించి…అనంత‌రం ‘జ‌గ‌న్‌’ను మెప్పించి మంత్రి అయ్యారు. చిన్న‌వ‌య‌స్సులోనే రాజ‌కీయాల‌ను బాగా వంట‌ప‌ట్టించుకున్న ఈమెకు..ఇప్పుడు ఆమె చేసిన అవినీతి, అక్ర‌మాల‌తో చిక్కుల్లో చిక్కుకున్నారు. అయితే..ఈ చిక్కుల‌ను త‌ప్పించుకోవ‌డానికి ఆమె కులాన్ని అడ్డుపెట్టుకుని బ‌య‌ట‌ప‌డాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చూద్దాం..ఆమె ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయోమో…?

Featured

పి ఆర్ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేదీ 23-3-2025 (ఆదివారం )ఉదయం 10:30 న కు గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు సమావేశం జరిగినది ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పలు అంశాలు చర్చించడం జరిగినది వాటిలో ముఖ్యంగా పరిపాలన అధికారుల పేరును డిప్యూటీ మండల పరిషత్ అధికారులుగా పేరు మార్పుపై మరియు రికార్డ్ అసిస్టెంట్ ల్యాబ్ లైబ్రరీ అసిస్టెంట్లు అప్క్రడేషన్ ఫైలు చర్చించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయిన లక్కాకుల పెంచలయ్య వీ దేవ ప్రసన్నకుమార్ కార్యవర్గ సభ్యులు వివి రామ్మోహన్ బీవీ రమేష్ బాబు సీనయ్య కిరణ్ వెంకటేశ్వర్లు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

ఫూలే టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా కమిటీ సమావేశం*

* *** నెల్లూరు నగరంలో ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి తుమ్మా రవి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి ఎప్రిల్ 11 సందర్భంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే గురించి వ్యాస రచన, కవితలు మరియు పాటల రచనా పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, సమాచారాన్ని టెక్స్ట్ మెసేజ్ రూపంలో పంపగలరని, ఎంపిక చేయబడిన కవితలు, పాటలు, వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించబడునని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు వారు ఫోన్ నెంబరు 9494615360 కు వాట్సాప్ ద్వారా పంపాలని తెలిపారు. ఈ పోటీలకు చివరి తేది 1/4/2025 అని, పాల్గొన్నవారికి ప్రశంసాపత్రాలు అందజేయబడునని తెలిపారు.మార్చి 23 తేదీన స్వాతంత్ర్యం కోసం ఉరితీయబడ్డ యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ ల వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర్య ఫలాలను సామాన్యులకు సైతం అందుబాటులో వచ్చేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని కోరారు.

Featured

నెల్లూరు అపోలో హాస్పిటల్ కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహాన*: డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ*

*కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి : ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు*   _*- నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం*_ _*- మీడియాతో డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ*_ _*- 100కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు వెల్లడి*_ _*- అన్నీ జబ్బులకు కిడ్నీ సమస్యలే కారణమన్న వైద్యులు*_ _*- కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని పిలుపు*_   నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏ.కే. చక్రవర్తి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి. మస్తాన్ వలీ వెల్లడించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రక్తాన్ని వడపోసే కిడ్నీలు దెబ్బతింటే దాని ప్రభావం శరీరమంతా ఉంటుందని, వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని అన్నారు. కిడ్నీకి సమస్య తలెత్తిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రతీ 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉంటుందని, సాధారణ వ్యక్తుల కంటే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించినట్లు డాక్టర్ శ్రీ రామ్ సతీష్, డాక్టర్ ఏకే చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ వెల్లడించారు.     కిడ్నీ సమస్యలు ఎదుర్కొనే వారికి గుండెపోటుతో పాటూ ఇతర స్ట్రోకులు, ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ఇతర జబ్బులు సోకకుండా ఉంటాయని వారు తెలియజేశారు. షుగర్, అధిక రక్తపోటు, ఊబకాయం సమస్యలతో బాధపడే వారికి కిడ్నీ సమస్యలు అధికంగా వస్తాయని కనుక ఆయా సమస్యలతో బాధపడే వారు సరైన చికిత్స తీసుకుంటే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చునని చెప్పారు. పరిశుభ్రమైన మంచినీరు తాగడం మూలంగా కూడా కిడ్నీ సమస్యలు దూరమవుతాయన్నారు. జనాభాలో 10 శాతం మంది ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, దీనిపై ప్రభుత్వం ఆలోచించి, కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ఇప్పటి వరకూ 100కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. కిడ్నీ సమస్యల చికిత్సతో పాటూ శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు అపోలో హాస్పిటల్ లో అనుభవజ్ఞులైన వైద్యులతో పాటూ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, కిడ్నీ రోగులు అపోలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు ఈ ఏడాది ” ఆర్ యూ కిడ్నీ ఓకే ?, డిటెక్ట్ అర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్… ! ” అనే నినాదంతో ముందుకెళుతున్నామని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో వారితో పాటూ హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కూడా పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

కార్పొరేషన్ లోని పార్కులను ఆధునీకరించాలి – ముక్కు రాధాకృష్ణ గౌడ్

కార్పొరేషన్ లోని పార్కులను ఆధునీకరించాలి – ముక్కు రాధాకృష్ణ గౌడ్ నెల్లూరు మార్చి ( పున్నమి ప్రతినిధి) నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లను కార్పోరేషన్ లోని పార్కుల సమస్యలపై జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 64 పార్కులు ఉన్నాయని సహజంగా పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు, యోగా సెంటర్లు, మినీ జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, షటిల్ కోర్టులు, కబడ్డీ కోర్టులు వివిధ ఆటలకు సంబంధించిన గేమ్స్ కు సంబంధించిన కోర్టులు చిన్నపిల్లలకు ఆట వస్తువులు వివిధ బొమ్మలు వృద్ధులకు సిమెంట్ బల్లలు, స్కేటింగ్ కోర్టు లు, కరాటే కోర్టులు, మంచినీరు పచ్చని మొక్కలు విద్యుత్ సౌకర్యం టాయిలెట్స్ డ్రైనేజీ సిస్టం మొదలగునవి తప్పకుండా ఉండాల్సి ఉండగా లేవని పేర్కొన్నారు.కానీ కొన్ని పార్కులలో ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయని పరికరాలను జిమ్ములను తక్షణమే అభివృద్ధి పరచాలని వాకింగ్ ట్రాక్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని అదేవిధంగా కొత్త కొత్త జాతుల మొక్కలను పెంచాలని ప్రైవేట్ వ్యక్తుల నుండి వారి ఆక్రమణల నుండి పార్కులను కాపాడాలని కోరారు.అధికారులు నిత్యం అన్ని పార్కులను విధిగా విజిట్ చేయాలని పార్కుల్లో ఆహ్లాదాన్ని అందాన్ని ఆక్సిజన్ ని ఇచ్చే మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచాలని కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్కులలో వ్యాపార సంస్థలు లాభాపేక్షతో చేసే కార్యక్రమాలకు విధిగా రుసుమును వసూలు చేయాలని అలాగే కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్కులలో వ్యామకారులకు, క్రీడాకారులకు, వాకర్స్కు వారి అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకునేందుకు పార్కులో ఉచిత వసతిని ఏర్పాటు చేయాలని ఉచిత శిక్షణా తరగతులు ఉచిత పౌచ్ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలు, ఆరోగ్యానికి సంబంధించిన వ సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎక్కడికక్కడ స్థానిక పార్కులలో ఉచిత అనుమతులు ఇవ్వాలని జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ తరపున కోరారు. పై కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కాయల.మధు పులిచెర్ల. ఉదయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు తిరకాల.శివ గౌడ్ జిల్లా కార్యదర్శులు తణుకు.ముని బాబు పైడి.చరణ్ తేజ మరియు తదితరులు పాల్గొన్నారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.