Thursday, 31 July 2025

Blog

Featured

అకస్మాత్తుగా గోడ కూలి చిన్నారి దుర్మరణం

31-05-2020మనుబోలు(పున్నమిప్రతినిధి)అకస్మాత్తుగా గోడ కూలి చిన్నారిపై పడడంతో దుర్మరణం మనుబోలు మండలంలోని పిడురూపాలెం గ్రామంలో గోడ కూలడంతో ఓ చిన్నారి దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిడూరు గ్రామానికి చెందిన కొండా వెంకట రమణమ్మ, రమణయ్య దంపతలకు ముగ్గురు కుమారులు ఉన్నారు.వీరికి మొదట ఒక కుమారుడు పుట్టగా రెండవ కాన్పులో ఇద్దరు మగపిల్లలు కమలలు జన్మిచ్చారు. ఆదివారం ఉదయం టిఫిన్ చేసి తిన్న ప్లేటు ను బయట ఉన్న బాత్రూమ్ వద్దకు తీసుకువెళ్లి పెడుతుండగా అకస్మాత్తుగా గోడ కూలి శ్రీరామ్(5)పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న చిన్నారి అనంత లోకాలకు వెళ్లడంతో కన్నీరుమున్నీరుగా విలపించడంతో ఈ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Featured

రాపూరు మండలం లో 18 రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం

రాపూరు, మే 30, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు ఇందులో భాగంగా సంక్రాంతి పల్లి సచివాలయానికి పోకూరుపల్లి కమ్యూనిటీ హాల్ నందు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ప్రెసిడెంట్ చెన్ను భాస్కర్ రెడ్డి ప్రారంభించి ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని ప్రతి ఒక్క రైతుక ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రతాప్, పొదలకురు సహాయ వ్యవసాయ సంచాలకులు కె.నాగేశ్వరరావు మరియు రైతులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.మరియు రాపూరు మూడవ సచివాలయం అనుసంధాన రైతు భరోసా కేంద్రం నవాపేట నుందు ఏర్పాటు చేయగా ఈ కేంద్రాన్నిఎంపీడీఓ ఆమోష బాబు ,EOPRD గంగయ్య , వ్యవసాయ విస్తరణ అధికారి బి.రాజ మోహన్ రెడ్డి ,శ్రీకిరెడ్డి శేశిధర్ రెడ్డి,ముని ప్రసాద ,మిగిలిన అన్ని రైతు భరోసా కేంద్రాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు,సచివాలయం సిబ్బంది, రైతులు ,గ్రామ వలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

Featured

రాపూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్ బాషా.

  రాపూరు, మే 30, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులు తనిఖీచేసి సిబ్బందికి పలు సూచనలు సలహాలు తెలియజేశారు అనంతరం గ్రామ పోలీసులకు గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా. ముఖ్యంగా చెన్నై నుంచి ఎవరైనా వ్యక్తులు వస్తే వారి సమాచారాన్ని పోలీసు స్టేషన్లోని అధికారులకు తెలియపరచాలని తెలియజేశారు తదుపరి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదైనదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేసు నమోదైన ప్రాతంలో కొన్ని రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని గ్రామస్తులు వాటిని తప్పక పాటించాలి లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాయనపల్లి గ్రామానికి నిత్యావసర సరుకులు, కూరగాయలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటామని తెలిపారు మరియు రాపూరు మండలం లోని ప్రజలు ఎవరైనా మండలంలో కి లేదా వారి గ్రామాలలో కి కొత్త వ్యక్తులు వచ్చిన, వివిధ ప్రాంతాలలో పని చేస్తూ తిరిగి సొంత ఊర్లకు వచ్చిన వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో లేదా రెవెన్యూ సిబ్బందికి తెలుపవలసిందిగా కోరారు.

Featured

కొవ్వూరు లొ ఘనంగా సి ఐ టి యు ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా సి ఐ టి యు ఆవిర్భావ దినోత్సవం కొవ్వూరు పట్టణం లోని బజార్ సెంటర్లో సి ఐ టి యు ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత జెండాను ఆవిష్కరించారు అనంతరం సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి శేషయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాల రాస్తున్నారని దుయ్యబట్టారు ఎన్నో ఏళ్ల క్రితం ప్రపంచ కార్మికులంతా పోరాడి సాధించుకున్న రోజుకు ఎనిమిది గంటల పని దినాలను రోజుకు 12 గంటలు మార్చటం దారుణమన్నారు కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేసి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు మండల ప్రధాన కార్యదర్శి , షేక్ ఖాదర్బాషా, భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శులు, హరి, అఫ్రోజ్, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

Featured

గ్రామ స్థాయిలో రైతులవద్దకే ప్రభుత్వ సేవలు..వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రలు ఏర్పాటు

30-5-2020మనుబోలు(పున్నమిప్రతినిధి )వ్యవసాయం సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ను మనుబోలు మండలంలో పలు గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కలసి ప్రారంభిచారు. రైతు భరోసా కేంద్రాలతో ప్రయోజనాలివే… రైతులకు అధిక ఆదాయం, ప్రజలకు ఆహార భద్రత ప్రధాన ఉద్దేశం. ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు. వీరు రైతులకు తలలో నాలుకలా ఉండి వాళ్లకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతాయి. భూసార పరీక్షలు జరుగుతాయి. భూసార పరీక్షల ఆధారంగా ఏయే పంటలు వేసుకోవచ్చో సలహా ఇస్తారు. నాణ్యమైన విత్తనాలు ఏవో గుర్తించి సూచిస్తారు. అనవసరంగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో తెగుళ్ల నివారణకు మార్గాలు చెబుతారు. ఈ కేంద్రాలకు అనుబంధంగా ఉండే అగ్రి షాప్స్‌ నుంచి వ్యవసాయ పనిముట్లు, పంటల సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణోపాయాలు, మార్కెటింగ్‌ మెళకువలు నేర్పుతారు. ఇ–క్రాప్‌ బుకింగ్‌కు రైతుకు తోడ్పడతారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులు, కౌలు రైతులు ఉన్నారో గుర్తించి ప్రభుత్వ రాయితీలకు సిఫార్సు చేస్తారు. విత్తనం వేసింది మొదలు మార్కెటింగ్, గిరాకీ సరఫరా వరకు ఈ కేంద్రాలు రైతులకు తోడ్పడేలా సిద్దం చేసింది ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయి. రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తాయి. ఆర్‌బీకేలో వ్యవసాయ సహాయకుడు ప్రతిరోజు పంటలను సమీక్షించి పంపే డేటాను మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షిస్తుంది. 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ‘కియోస్క్‌’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. మార్కెటింగ్‌ సేవలు రైతులకు అందుతాయి. ఇది దేశ చరిత్రలోనే తొలి ప్రయోగం.దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు. రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్‌ కియోస్క్‌ ఎదుట రైతు నిలబడి స్క్రీన్‌ను వేలితో తాకి, ఫోన్‌ నంబరును ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వంటి వాటి బొమ్మలు, వాటి ధరలు కియోస్క్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. రైతు తాను కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకొని, ఎంత పరిమాణంలో కావాలో, అవుతున్నదో ఒకటికి రెండు సార్లు సరి చూ అంతా ఓకే అనుకున్నాక క్లిక్‌ చే తయారవుతుంది. ‘హబ్‌’(గోదాము)కు తక్షణమే ఆ రైత చేయదలచిన సరుకుల ఆర్డర్‌ వెళుతుంద నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లో అందుతాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉత్పాదకాలను గ్రామ స్థాయిలోనే రైతులకు అందించవచ్చు.ఇ కేంద్రాల ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ను 155 251 ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కాల్ సెంటర్ ద్వారా రైతులకు కావలసిన సలహాలు సూచనలు అందజేస్తారు.మనుబోలుబిట్-1,మనుబోలుబిట్-2 వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం లో నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి,హరగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్,చేరెడ్డి రామిరెడ్డి, అన్నమాల ప్రభాకర్ రెడ్డి,దాసరి మహీంద్ర వర్మ,సుధాకర్ రెడ్డి,ఎంపీడీఓ వెంకటేశ్వర్లు,ఏ.ఓ జహీర్ వి.ఏ.ఏ లలిత సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Featured

జనసేన నాయకుడు మనుక్రాంత్ రెడ్డి కి మనుబోలు జనసేన ఆధ్వర్యంలో జన్మ దిన శుభాకంక్షాలు

29-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా ముఖ్య నాయకులు శ్రీ మనుక్రాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనుబోలు లో కేక్ కట్ చేసి జనసేన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసినారు. భవిష్యత్తు లో ఆయన మరిన్ని పదవులు చేప్పట్టాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలోజాకీర్ ,పవన్ ,సురేష్ ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Featured

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…డాక్టర్ సుబ్బరాజు

మనుబోలు 29-05-2020(పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామం హరిజనవాడలో మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా స్థానిక వైసీపీ నాయకులు ఆవుల.మనోహర్ రెడ్డి , అడపాల.శివకుమార్ రెడ్డి తమ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్యులను కోరిన క్రమంలో శుక్రవారం నాడు వెంకన్నపాలెం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆవుల.మనోహర్ రెడ్డి , అడపాల.శివకుమార్ రెడ్డి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Featured

వై. ఎస్. ఆర్ బీమా చెల్లింపు పత్రాన్ని అందచేసిన కాకాణి

29-05-2020( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో లో చెడిమాల వెంకటరమనయ్య ప్రమాదవశాత్తు చనిపోయినారు వారికి సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వై. ఎస్. ఆర్ బీమా పత్రాన్ని వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది, నామినిగా వారి కొడుకు చంచయ్య ఉంటే బ్యాంక్ అకౌంట్ లేకపోతే సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో చెంచెయ్యకు బ్యాంక్ పాస్ బుక్ ఇపించడం జరిగింది,తరువాత YSR బీమా లో పెట్టడం జరిగింది..కాకాని సహకారంతో వీరికి వై.ఎస్.ఆర్ బీమా రెండులక్షల రూపాయలు రావడం జరిగింది,మాకు సహాయం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాము అని వారు తెలియచేసినారు,ఈ కార్యక్రమంలో యర్రమాపు శరత్ కుమార్ రెడ్డి గారు,విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసి రామ్ యాదవ్,రైతు విభాగం మండల అధ్యక్షులు ఆవుల రమేష్ ,పల్లంరెడ్డి రాజా రెడ్డి,సోషల్ మీడియా ఇంచార్జ్ గుంజి రమేష్,మునగల సునీల్ కుమార్.ఉడుత మధుబాబు,బోయిన అదయ్య,ఈపూరు రవి,రవీంద్ర రెడ్డి,శశి,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Featured

మనుబోలు మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేసిన కాకాణి

29-05-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో పర్యటించి, ₹1కోటి 73లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ కార్డుల పంపిని మనుబోలు మండలంలో చిన్న గ్రామమైన అక్కంపేట గ్రామ పంచాయతీ లో ₹1కోటి 73 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం సంతోషంగా ఉంది. గ్రామంలో ₹55 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించాం. గ్రామంలో ₹ 33 లక్షల రూపాయలతో సైడు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. గ్రామంలో ₹57 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనానికి, రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశాం. గ్రామంలోని స్కూళ్లు మరమ్మతులకు మరియు ప్రహరీ గోడ మరమ్మతులకు ₹28లక్ష రూపాయల నిధులను మంజూరు చేసి, పనులు ప్రారంభించాం. ప్రతి గ్రామంలో అన్ని వసతి సదుపాయాలను కల్పించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా. ప్రజలకు అవసరమైన సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, తాగునీరు, సాగునీరు సదుపాయం, పిల్లల చదువుకు అవసరమైన అంగన్ వాడీ భవనాలు, పొలాలకు వెళ్లేందుకు దారులు, స్మశాన వాటికల అభివృద్ధి, మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. గ్రామాల్లో పర్యటిస్తే, ప్రజలు వ్యక్తిగత సమస్యల కొరకు అర్జీలు ఇవ్వాల్సిందే తప్పా, సామాజిక అవసరాల కోసం అర్జీలు ఇచ్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటాం. అధికారులు చిత్తశుద్ధితో పని చేసి, అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలి. జగనన్న ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో మీ ఇంటి బిడ్డగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టా. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అతిపెద్ద సేవకుడిగా సేవా కార్యక్రమాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానాని తెలిపినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామిలో భాగంగా ఒక్కో క్కటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. చేయబోయే సంక్షేమ పథకాలు ను తేదిలవారిగా ముందుగా ప్రకటించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. సర్వే పల్లిలో ముందుగా కూరగాయల పంపిణీ చేశామని దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు పంపిణీ జరిగిందని తెలిపారు.. రైతన్నకానుక రంజాన్ తోఫా అందించామని ఈ కార్యక్రమంలో అధికారులు చురుకుగా పనిచేశారని తెలిపారు. నియెజకవర్గంలో ఏ గ్రామంలో కూడా పలాన పని మిగిలివుంది అనిచెప్పకుండా చేస్తామని తెలిపారు. కరోనాకల్లోలంలో తొమ్మిది నెలలు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిఅర్హుడికి ఇళ్శ పట్టాలు రైతులకు రైతుభరోసా మత్స్యకారులు కు చేయూత దర్శిలకు ఆటోవాలాలకు చేయూత నిస్తుందన్నారు. కరోనాకారణంగా అభివృద్ధి మూడునెలల పాటు కుంటుపడిందన్నారు. అంతకముందు తమగ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు బాణా సంచా మేళా తాళాలతో కిరణ్ కుమార్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్ ,దాసరి మహేంద్ర వర్మ అంబటి శీనువాసురెడ్డి దోడ్ల శీనువాసురెడ్డి వైకాపా నాయకులు అన్ని శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Featured

ఆదర్శప్రాయుడు జక్కా వెంకయ్య జక్కా వెంకయ్య .. ముత్యాల గురునాథం

ఆదర్శప్రాయుడు జక్కా వెంకయ్య జక్కా వెంకయ్య గారు యువతకు ఆదర్శమని సిఐటియు మండల కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు శుక్రవారం బస్టాండ్ లో సిఐటియు ఆధ్వర్యంలో ముఠా వర్కర్స్ ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు జిల్లాలో పీడిత బాడీ బాధిత ప్రజల పక్షాన నిలిచి వారి అన్నారు ఆయన అనేక భూ పోరాటాలు ఇళ్ల స్థలాల పోరాటాలు నిర్వహించారు జిల్లాలో అనేక వేల మందికి ఇండ్ల స్థలాలు చౌడు భూములు ఆయన ఆధ్వర్యంలో చేసిన భూ పోరాటాలు వాళ్లని వచ్చాయన్నారు ఆయనకి స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శం అన్నారు ఆయన అడుగు జాడల్లో వెంకయ్య గారు నడిచి తన యావదాస్తిని సిపిఎం పార్టీ కోసం పేద ప్రజల కోసం ఖర్చు చేశారన్నారు ఆయన నిరాడంబరంగా జీవించేవారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ముత్యాల గురునాథం మాట్లాడుతూ తూ రెండు పర్యాయాలు అల్లూరు నియోజకవర్గం నుండి ఇ ఇ ఎమ్మెల్యేగా గా గెలుపొంది నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు అభివృద్ధి చేసి పెట్టారన్నారు పట్టణంలో ఆయన కృషి వల్లనే కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు పార్టీలకతీతంగా ఆయన పేదలకు సేవ చేశారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జానీ భాష నాయకులు కుంకాలు వెంకటేశ్వర్లు పడవల సుబ్రమణ్యం పులి మల్లయ్య ఆటో యూనియన్ నాయకులు రాదయ్య mohta యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు దారు మండల్ గ్రామం లో లో వెంకన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గన్నవరం శ్రీనివాసులు సురేష్ బెజవాడ మోహన్ రాగి రాములయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు కాగుల పాడు గ్రామంలో జక్కా వెంకయ్య రెండో వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిల్లా రఘురామయ్య రఘురామయ్య నేటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు పెనుబల్లి గ్రామంలో లో జక్కా వెంకయ్య రెండో వర్ధంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో నం నం మాధవ అ బాబు రమణయ్య తాళ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు జొన్నవాడ లో వెంకన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తమ్మి రమణయ్య వెంకట రమణయ్య ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు minagallu గ్రామంలో వెంకన్న వర్ధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళ్ల గుంట అంకయ్య బాలకోటయ్య లక్ష్మణ్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు 

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.