Wednesday, 11 March 2026

Blog

కామారెడ్డి

రామారెడ్డి లో ఘనంగా బాల్య సంరక్షణ – విద్య డే

కామారెడ్డి, 24జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో ఆంగన్వాడీ కేంద్రంలో ( ఈసీసీ ) ఘనంగా బాల్య సంరక్షణ – విద్య డే ఘనంగా నిర్వహించారు. ఆకర్షణీయ మేలవంటలు, పోస్టర్లు, చిత్రపటాలతో అలంకరించిన కేంద్రంలో పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళా- శిశు, బాల బాలికల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పిల్లల సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకం గా నిలిచింది. ఆకర్షణీయ గ్రీన్ కలర్ టేబుల్స్, మ్యాట్‌లపై కూర్చున్న పిల్లలు పుస్తకాలు చదివి, పాటలు పాడి సంతోషించారు.సంప్రదాయ దుస్తు లు ధరించిన టీచర్లు, వైట్ ఫ్లోరల్ డ్రెస్‌లలో మెరిసి న బాలికలు కార్యక్రమాన్ని రంగారంగిలో నడిపా రు.వైవిధ్యమైన కార్యకలాపాలు టీచర్లు నేర్పిన పాటలు, సాంస్కృతిక ఆటలు, విద్యా సంబంధిత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోషకాహారం, ఆరో గ్యం, అక్షరాలు గురించి తెలుగు పాటలు పాడారు. పిల్లలు.ఫోక్ డాన్స్‌లు, ఆటల ద్వారా సామాజిక విలువలు నేర్చుకున్నారు.తల్లిదండ్రుల ముందు పుస్తకాలు చదివి, కథలు చెప్పి అవగాహన పెంచా రు. తల్లిదండ్రులకు పిల్లల అభివృద్ధి, సురక్షిత ఆహారాలు, ఆరోగ్య చిట్కాలపై అవగాహన కల్పిం చారు. పిల్లల ప్రదర్శనలు చూసి అందరూ సంతో షంగా మునిగిపోయారు. స్థానిక ప్రాముఖ్యత రామారెడ్డి మండలంలో ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ పిల్లల విద్య, ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తు న్నాయి. తెలంగాణ వ్యవస్థలో ప్రతి నెల జరిగే బాల్య సంరక్షణ – విద్య డే లు పిల్లల భవిష్యత్తును మెరుగుపరుస్తున్నాయి. ఈ కార్యక్రమం స్థానిక సమాజానికి మైలురాయిగా నిలిచింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీసీల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిన జిల్లా బీసీ నాయకుడు బీద రవిచంద్ర.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి).మనుబోలు మండల బీసీ ఐక్యవేదిక సభ్యులు శనివారం జిల్లా బీసీ నాయకులు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఐక్యవేదిక సభ్యులు తమను తాము పరిచయం చేసుకుని, మండలంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారానికి సాయపడాలని కోరారు. అందుకు బీద రవిచంద్ర సానుకూలంగా స్పందించి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

E-పేపర్

బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్దపులి.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083 ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అంతర్వేది గూడెం, నాగులగూడెం పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్దపులి. కొవ్వాసి దూలయ్య, మల్లం కాంతమ్మ లకు చెందిన మూడు అవ్వులపై దాడి (అందులో ఒకటి సుడి ఆవు ) చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన ఫారెస్ట్ అధికారులు.

జోగులాంబ గద్వాల

జనవరి 26వ తారీకున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి పాఠశాల యందు విద్యార్థుల ముందు భారత రాజ్యాంగాన్ని ప్రదర్శించాలి… భీమ్ ఆర్మీ

జనవరి 26వ తారీకున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి పాఠశాల యందు విద్యార్థుల ముందు భారత రాజ్యాంగాన్ని ప్రదర్శించాలి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ప్రతి పాఠశాల యందు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుట తప్పనిసరి చేయాలి జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి వినతి పత్రం ఇచ్చిన భీమ్ ఆర్మీ నాయకులు భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మేళ్లచెరువు వర్షిత్ జోగులాంబ గద్వాల జిల్లాలో జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రతి పాఠశాల యందు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో భారత రాజ్యాంగాన్ని ప్రదర్శించాలి మరియు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తప్పనిసరి పెట్టుట చేయాలనీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్ గారు జిల్లా అధ్యక్షులు వర్షిత్ గారు జిల్లా కలెక్టర్ గారు సంతోష్ గారిని వినతిపత్రం అందజేశారు సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు తప్పనిసరిగా చర్య తీసుకుంటామని అన్నారు

సాహితీ

బాలిక జీవిత కథానాయిక (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

జాతీయ బాలిక దినోత్సవం (జనవరి24) సందర్భంగా… బాలిక జననం దైవాంశ పూరితం కుటుంబ పుష్టికి ఆనంద భరితం గృహిణిగా చేయూత పరిపూర్ణ చరితం అమ్మాయి నుండి అమ్మ వరకు అమ్మ నుండి అవ్వ వరకు చెల్లి నుండి అక్క వరకు భార్య నుండి బామ్మ వరకు రూపాంతర పరిమళ మాలిక వనితగ మహిళగ జీవితవేదిక *వ* – వయస్సు ఆధారంగా తన ఉనికిని ఉన్నతంగా ఉంచుకుంటూ *ని* – నిరంతరం తరంతరం కొనసాగిస్తూ… *త* – తను లేనిదే జీవనం నిర్జీవం అని మానవజాతి తలచే దేవత వనిత. *మ* – మనిషి పుట్టుటకు మనుగడకు మూలం *హి* – హితోక్తుల భావజాలానికి బలం *ళ* – కళాత్మక రూపాలను తీర్చిదిద్దే కలం అసలు సృష్టికే మూలం ఆప్యాయతలు పంచే సంసార సారిక అమ్మకు అమ్మయ్యే జీవన గమన దీపిక మహిళా సాధికారతకు దివ్యౌషధ మూలిక బాలిక జీవిత మధుర జ్ఞాపిక తరతరాల సుసంపన్న మాతృక బాలిక నుండి బాంధవ్య ఏలిక దాక విధి క్రీడలో అనుసరణీయ భాగ్యరేఖ స్మరణీయ కమనీయ కాలచక్ర కథానాయిక

వనపర్తి

జిల్లా తనిఖీ విభాగం సభ్యులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని

* *ప్రభుత్వ పాఠశాలల తనిఖీ విభాగంతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24/01/2026* *గత పది రోజులుగా వనపర్తి జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాలల జిల్లా తనిఖీ విభాగం సభ్యులతో వనపర్తి జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని గారు ఈరోజు సాయంత్రం తమ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది, ఇందులో టీం లీడర్ మరియు సభ్యులు తమ తమ తనిఖీల్లో చూసిన అంశాలు వివిధ పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న వినూత్న బోధనా పద్ధతులను మధ్యాహ్న భోజన పథకాలు డిజిటల్ మరియు ఎఫ్ ఎల్ ఎన్ పానెల్ వివిధ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విద్యా సంబంధమైన యాప్ లతో సరళతరంగా సులభతరంగా విద్యార్థులకు బోధిస్తున్నారని, ఈ ప్రక్రియ ఇలాగే భవిష్యత్తులో కొనసాగించాలని అప్పుడే ప్రభుత్వ పాఠశాలల పై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా బోధనల్లో తమతమ శైలిలో బోధన అభ్యసన ప్రక్రియలను తరగతి గదిలో బోధించాలని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తో ఆకట్టుకునే విధంగా వివిధ ఆక్టివిటీస్ బేస్ పద్ధతుల్లో బోధించాలని వారు తనిఖీ విభాగ టీం లీడర్ మరియు సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గణేష్, చంద్రశేఖర్, ఆనంద్, అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ మహానంది, ప్రతాపరెడ్డి, వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు టీం సభ్యులు శ్రీనివాసులు, వేణుగోపాల్ రెడ్డి, ఎంఎన్ విజయకుమార్, కబీర్, రవి, లక్ష్మీదేవి, నరసింహ, కే మధుసూదన్, కృష్ణ ,కురుమూర్తి, తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు*

కామారెడ్డి

అటవీలో ఎలుగుబంటుల గుంపు భయం!

రామారెడ్డి గ్రామ కూలీలు ఆందోళనరాజమ్మ తండా ప్రాంతంలో ఉపాధి హామీ పనులు ఆపాలి.. జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలి కామారెడ్డి, 23జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం శివారు ప్రాంతంలోని రాజమ్మ తండా అటవీ ఎత్తైన ప్రదేశం మృత్యువు తప్పడం గురించే పోరాటం. ఉపాధి హామీ కార్మికులు ఇక్కడ పని చేస్తుంటే, ఎలుగు బంటులు గుంపులుగా కనిపించడంతో భయభ్రాం తులు చెందారు.వెంటనే పనులు ఆపి, సురక్షిత ప్రదేశానికి మార్చాలని కూలీలు డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పంచాయ తీ అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని స్థాని కులు కోరారు.రామారెడ్డి గ్రామం నుంచి వచ్చిన 40 మంది కూలీలు రాజమ్మ తండా అటవీ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధి శ్రామికుల సంఘం (NREGA) పనులు చేస్తున్నారు. నేడు మధ్యాహ్నం పని సమయంలో ఎలుగుబంటులు దగ్గరలో గుంపుగా కనిపించాయి. “మేం పని చేస్తుంటే ఆ జంతువులు మా వైపు వస్తున్నాయని ఆరోపించారు.గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ మాట్లాడుతూ,ఈ ప్రాంతం అటవీ శివారు. ఎలుగుబంటులు, మొండెలు తరచూ కనిపిస్తాయని చెప్పారు.ఉపాధి హామీ పనులకు ఇక్కడ ఎందుకు ఎంపిక చేశారు? ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ వెంటనే సైట్ ఇన్‌స్పెక్షన్ చేసి, పనులు షిఫ్ట్ చేయాలని కోరారు. సంబంధిత అధికారులు మాట్లాడుతూ, సమాచారం తెలిసిన వెంటనే ఫీల్డ్ స్టాఫ్‌ను పంపాము. సురక్షితత కోసం పనులు తాత్కాలికంగా ఆపేస్తాం ఐని చెప్పారు. జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి అటవీ ప్రాంతం లో జంతువుల కదలికలు సహజం. కానీ మానవు ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తాము.పట్రోలింగ్ పెంచు తామని చెప్పారు.గ్రామంలో ఆందోళన రామారెడ్డి గ్రామంలో ఈ సంఘటనతో టెన్షన్ నెలకొంది. ఒక్క రికి ఏమైతే ఊరంతా దెబ్బతింటుంది. అన్ని డిపార్ట్‌ మెంట్లు కలిసి పనులు వేరెక్కడికి మార్చాలని అంటూ కూలీలు, ప్రజలు ఐక్యంగా కోరారు. గ్రామ ప్రజలు, అధికారుల సహకారంతో ఈ సమస్యకు సత్వర పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు.జిల్లా కలెక్టర్, డీఎస్పీలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగ ణించి, వెంటనే చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కూలీల జీవనోపాధి, భద్రతలు రక్షించబడాలని అన్నారు.

E-పేపర్

భక్తులకు కనబడిన ఎలకలతొ ప్రసాదం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాత్రి పూట 11 గంటలకు అన్నవరం ప్రసాదం ( హైవే అన్నవరం వైజాగ్) కొనడానికి వెళ్ళిన బాటసారిలకు ( భక్తులు )కనిపించిన దృశ్యం ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు. ప్రసాదం అమ్మినవాడిని అడిగితే అవును అలాగే ఉంటాయి మీకు ఇష్టమైతే కొనుక్కుంటే లేకపోతే పోండి అనీ వాడి సమాధానం…. END. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి లోకేష్ గారి జన్మదిన వేడుకలు

దుత్తలూరు Date:23-1-2026 దుత్తలూరు మండలం దుత్తలూరు సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి ఈ సందర్భంగా,ఉండేలా గురువారెడ్డి దుత్తలూరు మండలటీడీపీ కన్వీనర్, మరియు,మల్లంపాటి గురవయ్య నాయుడు నర్రవాడ మాజీ సర్పంచ్రి వారి ఆధ్వర్యంలో దుత్తలూరు మండలంలో 350 ST మహిళలకు చీరల పంపిణీ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారికి మరియు మాజీ శాసనసభ్యులు కంభం విజయరామ్ రెడ్డి గారికి దుత్తలూరు మండలంలోని టిడిపి నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు

కామారెడ్డి

కుటుంబ సమస్యలతో మంగలి లింబయ్య గడ్డి మందు తాగి మరణం..

కామారెడ్డి,23 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కుటుంబ సమస్యలతో మంగలి లింబయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని గడ్డి మందు తాగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుందని ఎస్సై రాజ శేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరా లు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గడ్డి మందు మరణాలు దారు ణంగా కనిపిస్తున్నాయి. మొదట రామారెడ్డి గ్రామానికి చెందిన 43 ఏండ్ల మంగళి లింబాద్రీ కుటుంబ సమస్యలతో గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయారు.మంగలి కులానికి చెందినవారు. కులవృత్తి చేస్తూ జీవణం కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుప త్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయారు.కుటుంబ సమస్యలు పరిణా మాలుగా ఈ ఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు.రెండు మరణాలూ రామారెడ్డి మండలం లోనే జరగడంతో ప్రజల్లో భయం వాతావరణం నెలకొంది.పోలీసులు కేసుల్లో విచారణ చేపడుతు న్నట్లు ఎస్ఐ వివరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.