Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

APCOB 4వ బోర్డు సమావేశం – కీలక నిర్ణయాలకు ఆమోదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
APCOB 4వ బోర్డు సమావేశం – కీలక నిర్ణయాలకు ఆమోదం

వార్త ముఖ్యాంశాలు

  • విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCOB) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 4వ బోర్డు సమావేశం విజయవాడలోని సహకార భవన్‌లో ఘనంగా జరిగింది.
  • ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ DCCB చైర్మన్ కోన తాతారావు ప్రొఫెషనల్ డైరెక్టర్లు, NABARD CGM సోమనిందర్ సింగ్ APCOB మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
  • *సమావేశంలో సమీక్షించిన అంశాలు:* బ్యాంకు నిధుల స్థితి, పెట్టుబడులు, CRR/SLR సమ్మతి, NABARD రుణాలు, DCCBల రుణ స్థితి, RBI నిబంధనలు, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, KYC అప్‌డేషన్ పై సమగ్ర సమీక్ష జరిగింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCOB) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 4వ బోర్డు సమావేశం విజయవాడలోని సహకార భవన్‌లో ఘనంగా జరిగింది.

ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ DCCB చైర్మన్ కోన తాతారావు ప్రొఫెషనల్ డైరెక్టర్లు, NABARD CGM సోమనిందర్ సింగ్ APCOB మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

*సమావేశంలో సమీక్షించిన అంశాలు:*
బ్యాంకు నిధుల స్థితి, పెట్టుబడులు, CRR/SLR సమ్మతి, NABARD రుణాలు, DCCBల రుణ స్థితి, RBI నిబంధనలు, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, KYC అప్‌డేషన్ పై సమగ్ర సమీక్ష జరిగింది.

*బోర్డు ఆమోదించిన కీలక నిర్ణయాలు:*

1. రెపో రుణ పరిమితిని రూ.200 కోట్ల నుండి రూ.400 కోట్లకు పెంపు.
2. 2026-27కి మెస్సర్స్ రావు & కుమార్ సంస్థను చట్టబద్ధ ఆడిటర్‌గా నియామకం.
3. APCOB ప్రధాన కార్యాలయంలో Central IT Coordination విభాగం ఏర్పాటు.
4. RBI మార్గదర్శకాల మేరకు SHGల NPA వర్గీకరణకు ఆమోదం.
5. APCOB CTIలో శిక్షణ కోసం నలుగురు అధ్యాపకుల నియామకం.
6. APCOB చైర్మన్ గన్ని వీరాంజనేయులు NAFSCOB బోర్డుకు నామినేట్.

చివరగా, రైతులకు SAO కింద వ్యవసాయ రుణాలను మరింత పెంచాలని, క్షేత్రస్థాయిలో రుణ ప్రవాహాన్ని బలోపేతం చేయాలని బోర్డు సూచించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *