Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చిత్తూరు జిల్లా రగ్బీ జట్టుకు బత్తలవల్లం విద్యార్థిని ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిత్తూరు జిల్లా రగ్బీ జట్టుకు బత్తలవల్లం విద్యార్థిని ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం:(ఈనాటి వెలుగు) బత్తలవల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎస్.
  • అఖిల (10వ తరగతి) ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) U/17 రగ్బీ జట్టుకు ఎంపికైంది.
  • జిల్లా స్థాయి U/17 రగ్బీ జట్టు పల్లమాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.

వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం:(ఈనాటి వెలుగు) బత్తలవల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని
ఎస్. అఖిల (10వ తరగతి) ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) U/17 రగ్బీ జట్టుకు ఎంపికైంది.

జిల్లా స్థాయి U/17 రగ్బీ జట్టు
పల్లమాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన అఖిల జిల్లా జట్టులో చోటు సంపాదించింది.

ఈ నెల 12, 13 తేదీల్లో కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో అఖిల ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని అఖిలను, వ్యాయామ దర్శకుడు బి. కుమార్ ను ప్రధానోపాధ్యాయురాలు జయసుధ, ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *