Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

చిట్వేల్‌లో వినాయక మండపాలను సందర్శించిన బత్యాల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిట్వేల్‌లో వినాయక మండపాలను సందర్శించిన బత్యాల

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్‌: వినాయక చవితి వేడుకల్లో భాగంగా 11వ రోజు చిట్వేల్‌ టౌన్‌లోని పలు వినాయక మండపాలను మాజీ ఎమ్మెల్సీ గౌరవ శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు గురువారం సందర్శించారు.
  • స్థానికుల ఆహ్వానం మేరకు రాములవారి గుడి సమీపంలోని మండపంతో పాటు మెయిన్‌ రోడ్డులో లాయర్‌ బాలాజీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు బత్యాల చంగల్ రాయుడు గారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు…
  • ఆయనకు మేళతాళాలు, బాణసంచా నడుమ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.

చిట్వేల్‌: వినాయక చవితి వేడుకల్లో భాగంగా 11వ రోజు చిట్వేల్‌ టౌన్‌లోని పలు వినాయక మండపాలను మాజీ ఎమ్మెల్సీ గౌరవ శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు గురువారం సందర్శించారు. స్థానికుల ఆహ్వానం మేరకు రాములవారి గుడి సమీపంలోని మండపంతో పాటు మెయిన్‌ రోడ్డులో లాయర్‌ బాలాజీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు బత్యాల చంగల్ రాయుడు గారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనకు మేళతాళాలు, బాణసంచా నడుమ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *