Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు బహిరంగ ప్రకటన చేయాలి: సీపీఎం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అరకు: షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు బహిరంగ ప్రకటన చేయాలి: సీపీఎం

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ మండలం, పెదలబుడు పంచాయతీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు బహిరంగ ప్రకటన జారీ చేసి, లాటరీ పద్ధతిలో స్థానిక నిరుద్యోగ గిరిజన యువతకు దుకాణాలు కేటాయించాలని సీపీఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు.
  • ఈ మేరకు భూములు కోల్పోయిన స్థానిక యువతతో కలిసి తహశీల్దార్, ఈఓపీఆర్డీ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
  • పశుసంవర్ధక శాఖ స్థలంలోని 29, 30 ప్లాట్లలో 55 సెంట్ల భూమిలో నిర్మాణాలపై గతంలో ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.

అరకులోయ మండలం, పెదలబుడు పంచాయతీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు బహిరంగ ప్రకటన జారీ చేసి, లాటరీ పద్ధతిలో స్థానిక నిరుద్యోగ గిరిజన యువతకు దుకాణాలు కేటాయించాలని సీపీఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు భూములు కోల్పోయిన స్థానిక యువతతో కలిసి తహశీల్దార్, ఈఓపీఆర్డీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పశుసంవర్ధక శాఖ స్థలంలోని 29, 30 ప్లాట్లలో 55 సెంట్ల భూమిలో నిర్మాణాలపై గతంలో ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలపై అప్పటి కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే బాధితులు, నిరుద్యోగ యువతతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కిల్లో జగన్నాథం, కిలో సహదేవ్, తాంగుల హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *