పున్నమి న్యూస్, అగనంపూడి, నవంబర్ 17:
గాజువాక 90వ వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని వార్డు కార్పొరేటర్ మహమ్మద్ రఫీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ దివ్య, శానిటేషన్ సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బందితో సమావేశమై వార్డులో పారిశుద్ధ్య పరిస్థితులపై సమీక్షించారు.
ముఖ్యంగా కణితి రోడ్డులో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని, చెత్త సేకరణ వాహనాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని, 90వ వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆన్సర్ వల్లి, విశ్వేశ్వరరావు, మోతి సురేష్, గణేష్ రెడ్డి, శివ, వెంకటరెడ్డి, రామారావు, రమేష్, స్వర్ణపుడి సత్యనారాయణ, స్వర్ణపుడి రాంబాయి, తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportపత్రికా ప్రకటన