Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

పద్మనాభం మండలంలో రేపు… విద్యుత్ సరఫరాకు బ్రేక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పద్మనాభం మండలంలో రేపు… విద్యుత్ సరఫరాకు బ్రేక్

వార్త ముఖ్యాంశాలు

  • మూడు సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేత విశాఖపట్నం జిల్లా,పద్మనాభం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 16:: పద్మనాభం మండల ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సమాచారం అందించింది.
  • గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ జోన్–3, విశాఖపట్నం శ్రీ పోలాకి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రేపు (17-11-2026, మంగళవారం) పద్మనాభం మండల పరిధిలోని పద్మనాభం, రేవిడి, బోని మూడు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
  • వాతావరణ పరిస్థితులు, తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఫీడర్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర ముందస్తు నిర్వహణ పనులు చేపట్టనున్నారు.

మూడు సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేత

విశాఖపట్నం జిల్లా,పద్మనాభం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 16::

పద్మనాభం మండల ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సమాచారం అందించింది. గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ జోన్–3, విశాఖపట్నం శ్రీ పోలాకి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రేపు (17-11-2026, మంగళవారం) పద్మనాభం మండల పరిధిలోని పద్మనాభం, రేవిడి, బోని మూడు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

వాతావరణ పరిస్థితులు, తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఫీడర్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర ముందస్తు నిర్వహణ పనులు చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ముందస్తు మరమ్మతులు, భద్రతా చర్యల్లో భాగంగా చేపడుతున్న ఈ పనులకు మండల ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. ప్రజలు తమకు అవసరమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *