Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి ఆగస్టు 24 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయము నందు మండల జనరల్ బాడీ సమావేశము జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
  • ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు పదవీకాలం ముగియనుండడంతో లాస్ట్ మీటింగ్టీ కావడంతో ఎంపీసీలు ఐదు సంవత్సరముల పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులు చేయవలసిన అభివృద్ధి పనులపై అధికారులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కు వివరిస్తూ ఎంపీటీసీలు కూడా సర్పంచ్ ఎన్నికైనట్టుగానే మేము కూడా ఎంపిక ప్రజల ద్వారా…

అసంతృప్తితో పదవీకాలం పూర్తి చేయనున్న ఎంపిటిసిలు

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి ఆగస్టు 24 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయము నందు మండల జనరల్ బాడీ సమావేశము జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు పదవీకాలం ముగియనుండడంతో లాస్ట్ మీటింగ్టీ కావడంతో ఎంపీసీలు ఐదు సంవత్సరముల పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులు చేయవలసిన అభివృద్ధి పనులపై అధికారులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కు వివరిస్తూ ఎంపీటీసీలు కూడా సర్పంచ్ ఎన్నికైనట్టుగానే మేము కూడా ఎంపిక ప్రజల ద్వారా ఓటు ద్వారా ఎంపికయ్యమని ఎంపీటీసీలకు కనీసం గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు పి గన్నవరం మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక ఎంపీటీసీ అయినపర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ తమ ఐదు సంవత్సరాల పదవీకాలంలో జిల్లా పరిషత్ నుంచి నిధులతో మా గ్రామ అభివృద్ధికి నిధులు ఎక్కువగా తేవడం జరిగిందని మండల పరిషత్ నుంచి ఆశించినట్టుగా రాలేదని ప్రోటోకాల్ ప్రకారంగా కూడా మమ్మల్ని పిలవకుండా అవమానపరిచారని ఆవేదనను వ్యక్తపరిచారు మండలంలో ఎంపీటీసీలను ఎమ్మెల్యేలు సత్కరించగా అయినపర్తి ప్రియదర్శిని సత్కారానికి లేకుండా వెళ్లిపోయారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *