వార్త ముఖ్యాంశాలు
- పి గన్నవరం నుండి ఆగస్టు 18 ( పున్నమి ప్రతినిధి )అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన కుమారి పరమట బాల తేజస్విని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి భీమవరం ఎస్ కే బి ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సాధించుకుంది.కన్వీనర్ కోటాలో…
ఇంజనీరింగ్ విద్యార్థికి ఆర్థిక సహాయం
పి గన్నవరం నుండి ఆగస్టు 18 ( పున్నమి ప్రతినిధి )
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన కుమారి పరమట బాల తేజస్విని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి భీమవరం ఎస్ కే బి ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సాధించుకుంది.కన్వీనర్ కోటాలో అడ్మిషన్ వచ్చినప్పటికీ అడ్మిషన్ ఫీజులు,మెస్ చార్జీలు భరించలేని పేదరికం వలన మానవహక్కుల వేదిక అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు సహకారంతో మానవతా మూర్తులు- సామాజిక సేవా సంస్థని ఆశ్రయించారు.పరిస్థితి అర్థం చేసుకుని గతంలో మానవతా మూర్తులు కి హామీ ఇచ్చిన వారి సహకారంతో ఆమెకు16,000₹ అందించడమైనది.4 సంవత్సరాల పాటు మెస్ చార్జీలు,ఇతర ఖర్చులు భరించలేని కారణంతో స్ధానిక కాలేజీ లో చేరేందుకు ఆ విద్యార్థిని ప్రయత్నం చేస్తుంది.అమలాపురం పట్టణం లోని లేదా ఇతర ఎస్సీ సంఘాల నేతలు,మానవతా మూర్తులు ఆ విద్యార్థినికి తగు సలహాలు చూచనలు ఇస్తూ మార్గదర్శం కావాలనే బోనం రాజు తెలియజేశారు
