Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఋషికొండ ప్యాలస్ ను సైన్స్ అభివృద్ధి కి వినియోగించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *ఋషికొండ ప్యాలెస్‌ను సైన్సు అభివృద్ధికి వినియోగించాలి**పిపిపి మోడ్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేయరాదు*.*సిపిఎం డిమాండ్‌.*గత వైసిపి ప్రభుత్వం 9 ఎకరాల భూమిలో 451 కోట్ల ప్రజాధనంతో భారీ భవణాన్ని ఋషికొండ ప్రాంతంలో నిర్మించింది.
  • అది వినియోగంలోకి రాకుముందే వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది.
  • దీనిని ఏ విధంగా వినియోగించాలో ప్రజల అభిప్రాయాలను సేకరించబోతున్నట్లు పర్యాటక శాఖ, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

*ఋషికొండ ప్యాలెస్‌ను సైన్సు అభివృద్ధికి వినియోగించాలి**పిపిపి మోడ్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేయరాదు*.*సిపిఎం డిమాండ్‌.*గత వైసిపి ప్రభుత్వం 9 ఎకరాల భూమిలో 451 కోట్ల ప్రజాధనంతో భారీ భవణాన్ని ఋషికొండ ప్రాంతంలో నిర్మించింది. అది వినియోగంలోకి రాకుముందే వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. దీనిని ఏ విధంగా వినియోగించాలో ప్రజల అభిప్రాయాలను సేకరించబోతున్నట్లు పర్యాటక శాఖ, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రకటించింది. టిడిపి కూటమి ప్రభుత్వం ఋషికొండ భవనాలను ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్‌ చేసింది. నేడు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈ భవనాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సైన్సు మ్యూజియం, సైన్సు పార్కుగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలోనే దీని నిర్వహణ ఉండాలన్నారు. విశాఖపట్నం, రాష్ట్ర ప్రజల విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇది దోహదం పడుతుందన్నారు. ఒక ప్రక్క ప్రజాభిప్రాయాలను సేకరిస్తూనే మరోవైపు విజయవాడలో పిపిపి మోడ్‌లో ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు పూనుకోవడం సరైంది. ప్రజాభిప్రాయనికి అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ప్రజా అవసరాలకు దీనిని ఉపయోగించే విధంగా ప్రభుత్వం పూనుకోవాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *