Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

100 ఇయర్స్ గోల్డ్ ప్రైస్ హిస్టరీ ఇన్ ఇండియా:* *భారతీయులకు భద్రమైన పెట్టుబడి బంగారం* *ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం భారత్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
100 ఇయర్స్ గోల్డ్ ప్రైస్ హిస్టరీ ఇన్ ఇండియా:* *భారతీయులకు భద్రమైన పెట్టుబడి బంగారం* *ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం భారత్*

*రూ.18 నుండి లక్షా 57 వేలు రూపాయల వరకు.. 100 ఏళ్ల బంగారం చరిత్ర ఇదే*

‘బంగారం’.. భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, భద్రమైన పెట్టుబడి కూడా. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ఇష్టపడే దేశం భారత్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు వందల్లో ఉన్న పసిడి ధర.. ఇప్పుడు లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో గత 100 సంవత్సరాల బంగారం ధరల
చరిత్రను పరిశీలిస్తే.. కాలానుగుణంగా దాని విలువ ఎంతగా పెరిగిందో స్పష్టంగా తెలుస్తుంది. పసిడి ధర రూ.18 నుంచి లక్ష 57 వేలకే చేరింది. బంగారం ధర 100 ఏళ్లలో ఎలా మారిందో ఓసారి చూద్దాం.

1925 ప్రాంతంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.18–20 మధ్యలో ఉండేది. ఆ కాలంలో బంగారం విలువ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డిమాండ్ తక్కువగా ఉండటం, మార్కెట్ పరిమితులు 1940-1960 మధ్య కాలంలో
బంగారం ధరలు కొద్దిగా పెరిగినా పెద్ద మార్పు మాత్రం కనిపించలేదు.1950దశకంలో ధర రూ. 90-100 పరిధిలో ఉండేది. అయితే 1970ల తర్వాత ప్రపంచ ఆర్థిక మార్పులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా పసిడి ధరలు భారీగా పెరగడం ప్రారంభమైంది. 1980లో బంగారం ధర సుమారు రూ.1,300 దాటడం పెద్ద మైలురాయిగా నిలిచింది.1990ల నుంచి 2000ల వరకు బంగారం
పెట్టుబడిదారులకు ఆకర్షణీయ ఆస్తిగా మారింది. 1995 ప్రాంతంలో ధర దాదాపుగా రూ.4,500 ఉండగా 2000 నాటికి రూ.4,400–4,700 మధ్యలో ఉంది. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, డాలర్ మార్పిడి విలువలు, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వల్ల పసిడి ధరలు వేగంగా పెరిగాయి. 2010 వరకు రూ.18, 500గా ఉంది. 2010 తర్వాత బంగారం ధరల పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించింది. 2010లో రూ.18,500 ఉన్న ధర 2020 నాటికి రూ.48,000 దాటింది. ఇటీవల సంవత్సరాల్లో ఊహించని రీతిలో పెరిగింది. 2024 వరకు రూ.78,000 వరకు చేరడం గమనార్హం. అంటే ఒక శతాబ్దంలో బంగారం విలువ వందల రెట్లు పెరిగింది.
ఇక 2025, 2026లో ఊహించని రీతిలో పెరుగుతూ పసిడి ధరలు ఆకాశానికి తాకాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష 57 వేలుగా ఉంది.

100 ఇయర్స్ గోల్డ్ ప్రైస్ హిస్టరీ ఇన్ ఇండియా:* *భారతీయులకు భద్రమైన పెట్టుబడి బంగారం* *ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం భారత్*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *