Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

అనుపు నుంచి ఏలేశ్వర గట్టుకు ప్రత్యేక లాంచీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనుపు నుంచి ఏలేశ్వర గట్టుకు ప్రత్యేక లాంచీలు

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు వెసులుబాటు
యూనిట్ మేనేజర్ మస్తాన్ యాదవ్ వెల్లడి
————————————–

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగార్జునసాగర్ సమీపంలోని అనుపు నుంచి ఏలేశ్వర గట్టు మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక లాంచీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు లాంచీ స్టేషన్ యూనిట్ మేనేజర్ మస్తాన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ ఆదివారం శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం..

లాంచీలు ఆదివారం ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని మేనేజర్ తెలిపారు. భక్తులు సురక్షితంగా గట్టుకు చేరుకుని స్వామివారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

టికెట్ ధరల వివరాలు:

ప్రయాణ ఛార్జీల విషయానికొస్తే.. పెద్దలకు రూ. 200, పిల్లలకు రూ. 150 గా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఏలేశ్వర గట్టుకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనుపు నుంచి ఏలేశ్వర గట్టుకు ప్రత్యేక లాంచీలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *