Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • 10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ.
  • *జనవరి 1 నుండి అన్ని జోనల్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం.
  • * జోనల్ కమిషనర్లు జనవరి 1న జోనల్ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధం చేయాలి.

10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ.

*జనవరి 1 నుండి అన్ని జోనల్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం.

* జోనల్ కమిషనర్లు జనవరి 1న జోనల్ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధం చేయాలి.

– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

*విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో 2026 జనవరి 1వ తేదీ నుండి పునర్వ్యవస్థీకరించిన 10 జోనల్ కార్యాలయాలను కార్యచరణ ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జోనల్ కమిషనర్ లను జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు.

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న జోనల్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది జోన్లను 10 జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు సంబంధించి జోనల్ కార్యాలయాలు, అధికారులు,సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. 2026 జనవరి 1 వ తేదీ నుండి 10 జోనల్ కార్యాలయాలు పనిచేయాలని అందుకు సంబంధించిన ఫైల్స్, రికార్డులు తారుమారు కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఆయా జోన్లకు తీసుకువెళ్లాలన్నారు. ఇకపై సిబ్బంది, అధికారులు ఆయా జోనల్ కార్యాలయాల నుండి విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా జోనల్ కార్యాలయం పరిధిలో ఉన్న వార్డులు, సచివాలయాలు ప్రజలకు తెలిసే విధంగా సచివాలయాల వారీగా వార్డు కార్యదర్శులు అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్లను, అధికారులను కమిషనర్ ఆదేశించారు.

“” జివిఎంసి క్రొత్త జోన్ల వివరాలు””

భీమునిపట్నం జోన్ – వార్డులు: 1, 2, 3, 4 – మొత్తం 4 వార్డులు – 58.884 చ.కి.మీలు,

మధురవాడ జోన్ – వార్డులు: 5, 6, 7, 8, 98 – మొత్తం 5 వార్డులు – 95.668 చ.కి.మీ లు,

ఈస్ట్ జోన్ – వార్డులు: 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 28 – మొత్తం 15 వార్డులు – 48.527 చ.కి.మీ లు,

నార్త్ జోన్ – వార్డులు: 14, 24, 25, 26, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 54, 55 – మొత్తం 17 వార్డులు – 19.928 చ.కి.మీలు,

సౌత్ జోన్ – వార్డులు: 27, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 41 – మొత్తం 13 వార్డులు – 9.698 చ.కి.మీలు,

వెస్ట్ జోన్ – వార్డులు: 40, 52, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 89, 90, 91, 92 – మొత్తం 14 వార్డులు – 72.937 చ.కి.మీలు,

పెందుర్తి జోన్ – వార్డులు: 88, 93, 94, 95, 96, 97 – మొత్తం 6 వార్డులు – 75.038 చ.కి.మీలు,

గాజువాక జోన్ – వార్డులు: 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 86, 87 – మొత్తం 15 వార్డులు – 108.115 చ.కి.మీలు,

అగనంపూడి జోన్ – వార్డులు: 77, 78, 79, 85 – మొత్తం 4 వార్డులు – 102.830 చ.కి.మీలు,

అనకాపల్లి జోన్ – వార్డులు: 80, 81, 82, 83, 84 – మొత్తం 5 వార్డులు – 41.079 చ.కి.మీలు గా విభజించడం జరిగిందని తెలిపారు.

కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇకపై జీవీఎంసీ కల్పిస్తున్న సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాలు ,సేవలు ఆయా జోనల్ కార్యాలయాల ద్వారా పొందవచ్చునని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *