విశాఖపట్నం, అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రియాంక దండిని నిలపాలని ఆమె అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. విద్యావంతురాలిగా, యువ నాయకురాలిగా, పార్టీకి విధేయురాలిగా ఆమె ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని పేర్కొంటున్నారు.
విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ఆరిలోవలో డ్రగ్స్ సమస్యకు వ్యతిరేకంగా పోరాడారని అభిమానులు గుర్తుచేస్తున్నారు. కేజీహెచ్ అభివృద్ధికి జేడీ ఫౌండేషన్ ద్వారా తన వంతు కృషి చేస్తున్నారని, అనేక ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజల తరఫున నిలిచారని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రియాంక దండికి కాపు సామాజికవర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, యువత, విద్యావంతుల మద్దతు లభించే అవకాశం ఉందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పేరును మేయర్ అభ్యర్థిగా పరిశీలించి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

