Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

రేషన్ డీలర్ల సమస్యలపై అధికారులతో చర్చలు కమిషన్ పెంపు నుంచి విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు వరకు పలు అంశాలపై వి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేషన్ డీలర్ల సమస్యలపై అధికారులతో చర్చలు కమిషన్ పెంపు నుంచి విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు వరకు పలు అంశాలపై వి

విశాఖపట్నం, అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి): విశాఖపట్నం నగర పరిధిలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి జిల్లా ప్రెసిడెంట్ గంట్యాడ అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రతినిధులు సంబంధిత జాయింట్ కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల అధికారి (DSO)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీలర్ల ఆర్థిక ఇబ్బందులు, విద్యుత్ ఛార్జీలు, గన్నీ బ్యాగుల బకాయిలు సహా పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధానంగా రేషన్ డీలర్ల కమిషన్‌ను పెంచి, ప్రతి రూపాయికి అదనంగా రూ.2 చొప్పున పెంపు కల్పించాలని కోరారు. గన్నీ బ్యాగుల పంపిణీకి సంబంధించి గతంలో చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేటగిరీ-2 విద్యుత్ కనెక్షన్లు, జీవీఎంసీ పరిధిలో కమర్షియల్ పన్నుల కారణంగా డీలర్లపై పడుతున్న అదనపు భారాన్ని వివరించారు.

ఈ సమస్యపై జిల్లా పౌర సరఫరాల అధికారి సానుకూలంగా స్పందిస్తూ, ఏపీఈపీడీసీఎల్ చైర్మన్, జీవీఎంసీ కమిషనర్‌కు లేఖలు రాసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఈ వారంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.

రేషన్ పంపిణీకి ఉపయోగించే వేయింగ్ స్కేల్స్ నిర్వహణ, మరమ్మతులకు అవసరమైన సహకారం అందించాలని, ఎసెన్షియల్ కమోడిటీస్ పంపిణీకి అవసరమైన పరికరాలు, పేపర్ రోల్స్‌ను సకాలంలో సరఫరా చేయాలని కోరారు. అదేవిధంగా రేషన్ డీలర్లందరికీ ఈఎస్‌ఐ ఆరోగ్య పథకం ద్వారా వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులకు ఇప్పటికే ఈ విషయాన్ని తెలియజేసినట్లు, మరికొన్ని రోజుల్లో వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమావేశంలో వెల్లడించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంట్యాడ అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు అయ్యపబాలే, కోశాధికారి మణిబాబు, శ్రీను, దుర్గాప్రసాద్, ఈశ్వర అప్పారావు, రాణి, నందిని, హరి తదితర జిల్లా రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

రేషన్ డీలర్ల సమస్యలపై అధికారులతో చర్చలు కమిషన్ పెంపు నుంచి విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు వరకు పలు అంశాలపై వి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *