Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

బత్తాయి సాగుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కు హాజరైన : కమీషన్ చైర్మన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బత్తాయి సాగుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కు హాజరైన : కమీషన్ చైర్మన్

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) రైతు సంక్షేమ కమిషన్ రెండు రోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం (30 ఆగస్ట్) జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్ లో బత్తాయి రైతులు,ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో, బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సూచనలు, సలహాలపై ఏర్పాటు…
  • అదేవిదంగా జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బత్తాయి మార్కెట్ ను సందర్శించినారు.
  • భవిష్యత్తులో బత్తాయి తోటను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని, జిల్లాలో బత్తాయి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు.

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

రైతు సంక్షేమ కమిషన్ రెండు రోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం (30 ఆగస్ట్) జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్ లో బత్తాయి రైతులు,ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో, బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు సూచనలు, సలహాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి గారు మాట్లాడుతూ కమిషన్ పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లాలో నిడమనూరు మండలంలోని కొన్ని గ్రామాలలో పరిశీలించడమే కాకుండా రైతులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. అదేవిదంగా జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బత్తాయి మార్కెట్ ను సందర్శించినారు.
భవిష్యత్తులో బత్తాయి తోటను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని, జిల్లాలో బత్తాయి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏ రకంగా బత్తాయి మార్కెట్ ను కాపాడవచ్చు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని బత్తాయి పండించే క్షేత్రాలకు వెళ్లి పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వం వీరికి సహకరించి ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు చేస్తే, అటు వినియోగానికి ఇటు రైతులకు బాగుంటుందని సూచించారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *