Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

*హై మాక్స్ లైట్లు, పైలెట్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయండి* *3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*హై మాక్స్ లైట్లు, పైలెట్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయండి* *3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ*

వార్త ముఖ్యాంశాలు

  • భీమిలి జోన్ 3వ డివిజన్లో పలు ప్రాంతాల్లో పైలెట్ వాటర్ స్కీమ్ మరియు హై మాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని భీమిలి జోన్ 3వ డివిజన్ కార్పొరేటర్ గంటా అప్పలకొండ విజ్ఞప్తి చేసారు ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో భాగంగా సోమవారం భీమిలి జోనల్ కమీషనర్ ఒమ్మి…
  • ముఖ్యంగా భీమిలి జోన్ 3వ వార్డు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
  • భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సారథ్యంలో అభివృద్ధి సాగుతుందని అన్నారు.

భీమిలి జోన్ 3వ డివిజన్లో పలు ప్రాంతాల్లో పైలెట్ వాటర్ స్కీమ్ మరియు హై మాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని భీమిలి జోన్ 3వ డివిజన్ కార్పొరేటర్ గంటా అప్పలకొండ విజ్ఞప్తి చేసారు

ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో భాగంగా సోమవారం భీమిలి జోనల్ కమీషనర్ ఒమ్మి అయ్యప్ప నాయుడుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజుతో కలసి కార్పొరేటర్ గంటా అప్పలకొండ పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ముఖ్యంగా భీమిలి జోన్ 3వ వార్డు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సారథ్యంలో అభివృద్ధి సాగుతుందని అన్నారు. అందులో భాగంగా 3వ వార్డులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవసరాన్ని బట్టి పైలెట్ వాటర్ స్కీమ్ మరియు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

గనగళ్ల వీధి, నేరళ్లవలస వికలాంగుల కోలనీ, నేరళ్ల వలస సాక్ష్యం టివి రిపోర్టర్ ఇంటివద్ద, బోయవీధి – కొత్తపేట (శ్రీ నూకాలమ్మ ఆలయం ఎదురుగా), కృష్ణా కోలనీ – బొడ్డోడు గెడ్డ, అప్పికొండ వీధి, తోటవీధి – సంపత్ వినాయక ఆలయం వద్ద, తోటవీధి – బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వెనుక ట్యాంక్ నిర్మాణంతో పాటు పైలెట్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయాలని కోరారు.
చిన్న బజార్ ఎన్టీఆర్ జంక్షన్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, కృష్ణా కోలనీ బస్టాండ్, పాత బస్టాండ్ (అనిల్ ప్రసాద్ షాపింగ్ కాంప్లెక్స్), కృష్ణా కోలనీ బొడ్డోడు గెడ్డ, గొల్లవీధి జంక్షన్ (క్రిష్ణ మందిర్ వద్ద ), నేరళ్లవలస కోలనీ జంక్షన్, నేరళ్లవలస సౌరీస్ ఆశ్రమం వద్ద, జూనియర్ కళాశాల జంక్షన్, అప్పికొండ వీధి జంక్షన్, బ్రాహ్మణవీధి జంక్షన్, డైట్ జంక్షన్, తోటవీధి శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద, బోయవీధి శ్రీ రామమందిరం వద్ద, గాడువీధి స్మశానవాటిక, జలగెడ్డ స్మశాన వాటిక, గనగళ్ల వీధి సర్కిల్, ఎర్నిమాంబ ఆలయం వద్ద, మున్సిపల్ హై స్కూల్ జంక్షన్, రెల్లివీధిలలో హై మాక్స్ లైట్లు వేయవలసినదిగా కోరారు. అదేవిదంగా పలు ఏరియాల్లో సిసిరోడ్లు, కాలువలు అవసరం ఉందని జోనల్ సిబ్బందితో పర్యవేక్షణ చేయించి త్వరతగతిన వేయాలని గంటా నూకరాజు, కార్పొరేటర్ గంటా అప్పలకొండ విజ్ఞప్తి చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *