హైదరాబాద్లో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
పున్నమి ప్రతినిధి, ఆగస్టు 21: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్రెడ్డి ఘన స్వాగతం పలికారు. పూల బొకే అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం తెలిపారు.
అనంతరం ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, తదితర అంశాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు.


