నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
लेखक पैनल
తూర్పు గోదావరి

స్వచ్ఛతే సంకల్పం.. పరిశుభ్రతే లక్ష్యం

స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛ సంకల్ప అభియాన్”లో భాగంగా అనపర్తి ప్రెస్‌క్లబ్ ప్రాంతంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్లను శుభ్రపరిచారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామ్‌కుమార్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *