వార్త ముఖ్యాంశాలు
- గంపలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన కుసుమ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది.
- ఆమె తండ్రి దొంతి నాగ బ్రహ్మచారి ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.
- ఇటీవల ప్రమాదవశాత్తు ఆయన కుడిచేయి కాలిపోవడంతో పని చేయలేకపోతున్నారు.
గంపలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన కుసుమ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి దొంతి నాగ బ్రహ్మచారి ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు ఆయన కుడిచేయి కాలిపోవడంతో పని చేయలేకపోతున్నారు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. విషయం తెలుసుకున్న 10వ తరగతి 1994-95 బ్యాచ్ స్నేహితులు కుసుమ చదువుకు రూ.27,500 ఆర్థిక సాయం అందించారు. అలాగే బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.