వార్త ముఖ్యాంశాలు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గాయత్రీ మాతా ఆలయంతో పాటు గౌశాల,యాగశాల,వేద పాఠశాల కొరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణ ను కలిసి వినతి పత్రం సమర్పించిన బెల్లంపల్లి బ్రాహ్మణ సేవా…
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రాహ్మణ కుటుంబాలు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అందరితో పాటు తమ సంఘానికి కూడా ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు.
- ఈ విషయమై ఇది వరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారితో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గాయత్రీ మాతా ఆలయంతో పాటు గౌశాల,యాగశాల,వేద పాఠశాల కొరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణ ను కలిసి వినతి పత్రం సమర్పించిన బెల్లంపల్లి బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రాహ్మణ కుటుంబాలు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అందరితో పాటు తమ సంఘానికి కూడా ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఇది వరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారితో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు, అన్నీ రాజకీయ పార్టీల నాయకులు సానుకూలంగా స్పందించి తమ వంతుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విఎల్ఎస్ శ్రీనివాస్ రావు, కోశాధికారి జగన్మోహనాచారి,సలహాదారుడు రాంభట్ల హరీష్ శర్మ, రాంపల్లి వెంకన్న,ఇతర ఈసీ సభ్యులు పాల్గొన్నారు.