Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. ఐఏఎస్ అధికారికి గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. ఐఏఎస్ అధికారికి గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపురాళ్లపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యలో స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా, ఐఏఎస్ అధికారి స్వల్ప గాయాలకు గురయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా సురక్షితంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన రాజీవ్ గాంధీని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *