Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు ఘన స్వాగతం , సత్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కావలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు ఘన స్వాగతం , సత్కారం

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

కావలి : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ శుక్రవారం కావలి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి నివాసానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికి, శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. కావలి మున్సిపల్ చైర్మన్ సీటు బీజేపీకి కేటాయించడంతో పాటు రాజకీయ అంశాలపై కూడా పరస్పరం చర్చించుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, స్థానిక బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కావలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు ఘన స్వాగతం , సత్కారం

కావలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు ఘన స్వాగతం , సత్కారం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *