Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

సోలార్ మోటర్ల పథకాన్ని పునఃప్రారంభించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సోలార్ మోటర్ల పథకాన్ని పునఃప్రారంభించాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఎమ్మెల్యే నల్లమిల్లికి నర్సరీ రైతుల వినతి అనపర్తి, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): నర్సరీ రైతులకు సబ్సిడీపై సోలార్ మోటర్లు అందించే పథకాన్ని పునఃప్రారంభించాలని కోరుతూ సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
  • గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జలసిరి, ఆర్‌కేవీవై పథకాల ద్వారా కడియం మండలంలో సుమారు 250 సోలార్ మోటర్లు సబ్సిడీపై మంజూరయ్యాయని అసోసియేషన్ అధ్యక్షుడు పాటంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
  • అదే తరహాలో నర్సరీ రైతులకు సోలార్ మోటర్లు అందించాలని కోరారు.

ఎమ్మెల్యే నల్లమిల్లికి నర్సరీ రైతుల వినతి

అనపర్తి, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): నర్సరీ రైతులకు సబ్సిడీపై సోలార్ మోటర్లు అందించే పథకాన్ని పునఃప్రారంభించాలని కోరుతూ సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జలసిరి, ఆర్‌కేవీవై పథకాల ద్వారా కడియం మండలంలో సుమారు 250 సోలార్ మోటర్లు సబ్సిడీపై మంజూరయ్యాయని అసోసియేషన్ అధ్యక్షుడు పాటంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అదే తరహాలో నర్సరీ రైతులకు సోలార్ మోటర్లు అందించాలని కోరారు.

తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు సోలార్ మోటర్లు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *