సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా కార్యక్రమం
రాజమహేంద్రవరం, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ వద్ద ‘ఆశీర్వాద దీపం’ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ నాయకులు APR చౌదరి, వీరన్న చౌదరి వెలిగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, స్వచ్ఛత కార్యక్రమాలతో పాటు సేవా దీపాలు, ఆశీర్వాద దీపాలు వెలిగిస్తున్నట్లు చెప్పారు.
అధికారం కంటే సేవే పరమావధిగా నరేంద్ర మోదీ తన ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాసేవ పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

