Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎస్ఆర్ నిధులతో పల్లెలకు అదనపు హంగులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎస్ఆర్ నిధులతో పల్లెలకు అదనపు హంగులు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి) జెమిని ఎడిబుల్ ఆయిల్ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
  • వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో రూ.10 లక్షలతో నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు.
  • మరో రూ.10 లక్షలతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి)
జెమిని ఎడిబుల్ ఆయిల్ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో రూ.10 లక్షలతో నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. మరో రూ.10 లక్షలతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో రూ.1.22 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో రూ.70 లక్షలు ఖర్చు చేసేందుకు కంపెనీ ముందుకొచ్చిందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ లైబ్రరీ, గురుకులంలో అదనపు గదులు నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇతర పామాయిల్ కంపెనీలు కూడా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *