Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం సభ విజయానికి రథసారథులు వీరే..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

అనంతసాగరం సెప్టెంబర్ 30,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం (ఆత్మకూరు/రామాపురం):
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురం వద్ద నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమానికి లక్ష మంది ప్రజలు పాల్గొని ఎటువంటి సమస్య చోటు చేసుకోకుండా సభా కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తూ ప్రశంసించారు.. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న జిల్లా రథసారథిలే ఈ విజయానికి నాంది పలకడం విశేషం.. ఐదు రోజులపాటు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అధికారులు రాత్రి పగలు అక్కడి పల్లెటూర్లలోనే ఉంటూ సభ వేదిక నుండి సభ ప్రారంభమై ముగిసే వరకు వ్యూహాత్మక ప్రణాళికతో విజయవంతం కావడానికి శ్రమించారు. ఈ చిత్రంలో ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, గుంటూరు రేంజ్ పోలీస్ శాఖ ఐజి త్రిపాటి, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఆత్మకూరు, ఆర్డీవో బి పావని, జిల్లా డ్వామా పిడి శ్రీనివాసరావు లు నిరంతరం శ్రమించి అన్ని శాఖల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తీవ్రంగా శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మనం కూడా వీరిని అభినందిద్దాం…

సీఎం సభ విజయానికి రథసారథులు వీరే..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *