Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతగా తిరువూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతగా తిరువూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతగా తిరువూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ తిరువూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకానికి కృతజ్ఞతగా, తిరువూరు పట్టణంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు.
  • ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹15,000 ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
  • పాలాభిషేకం, కృతజ్ఞతా ప్రకటన: ర్యాలీ అనంతరం, ఆటో డ్రైవర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తిరువూరు టౌన్ మండల కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతగా తిరువూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ
తిరువూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకానికి కృతజ్ఞతగా, తిరువూరు పట్టణంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹15,000 ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పాలాభిషేకం, కృతజ్ఞతా ప్రకటన:
ర్యాలీ అనంతరం, ఆటో డ్రైవర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తిరువూరు టౌన్ మండల కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కృతజ్ఞతా కార్యక్రమాలలో టౌన్ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *