Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

సిఐటియు అఖిలభారత మహాసభలు జయప్రదంకై సిఐటియు బైక్ ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సిఐటియు అఖిలభారత మహాసభలు జయప్రదంకై సిఐటియు బైక్ ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • సిఐటియు అఖిలభారత మహాసభలు జయప్రదంకై సిఐటియు బైక్ ర్యాలీ *విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి* విశాఖలో ఈ నెల 31 నుండి జనవరి 4వరకు జరుగుతున్న సిఐటియు అఖిలభారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించింది.
  • ఈ బైక్ ర్యాలీని ప్రజాశక్తి జనరల్ మేనేజర్ కె.
  • హరికిషోర్ జెండా ఊపి ప్రారంభించారు.

సిఐటియు అఖిలభారత మహాసభలు జయప్రదంకై

సిఐటియు బైక్ ర్యాలీ
*విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి*
విశాఖలో ఈ నెల 31 నుండి జనవరి 4వరకు జరుగుతున్న సిఐటియు అఖిలభారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ బైక్ ర్యాలీని ప్రజాశక్తి జనరల్ మేనేజర్ కె. హరికిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మద్దిలపాలెం ఆఫీస్ నుండి ప్రారంభమై సత్యం జంక్షన్, సీతమ్మధార, హెచి కాలనీ, వెంకోజీపాలెం, ఎంవిపి, వాల్తేరు మీదుగా సిరిపురం నుండి మద్దిలపాలెంకు చేరుకుంది. ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి పి. వెంకటరావు మాట్లాడుతూ విశాఖలో జరిగే ఆలిండియా మహాసభలకు వివిధ రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. ఎయు కన్వెన్షన్ హాల్లో జరిగే మహాసభల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక పోరాటాలను చర్చించడం జరుగుతుందన్నారు. 27 నుండి జనవరి 2వ తేదీ వరకు బీచ్డ్డులో ఉన్న ఎయు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శ్రామిక ఉ త్సవాలను రేపు సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, సినీ ప్రముఖులు ప్రకాష్రజ్ ముఖ్యఅతిధిగా హజరవుతున్నారన్నారు. 4న మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు.

ఈ ర్యాలీలో సిఐటియు నాయకులు వి.సరేంద్రకుమార్, కె. కుమారి, శంకర్, శ్రీను, నాయుడు, ఆదినారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *