Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లిలో 57 శాతం సర్ డిజిటలైజేషన్ పూర్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సర్వేపల్లిలో 57 శాతం సర్ డిజిటలైజేషన్ పూర్తి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 6 (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గంలో సోమవారం నాటికి 57 శాతం సర్ డిజిటలైజేషన్ పూర్తయిందని డిప్యూటీ కలెక్టర్, ఈఆర్వో కేశవర్ధన్రెడ్డి తెలిపారు.
  • సోమవారం మనుబోలు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సర్ సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశమయ్యారు.
  • ప్రతి ఓటరును తప్పనిసరిగా నమోదు చేయాలని, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 6 (పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గంలో సోమవారం నాటికి 57 శాతం సర్ డిజిటలైజేషన్ పూర్తయిందని డిప్యూటీ కలెక్టర్, ఈఆర్వో కేశవర్ధన్రెడ్డి తెలిపారు. సోమవారం మనుబోలు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సర్ సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రతి ఓటరును తప్పనిసరిగా నమోదు చేయాలని, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పారు. పాత ఓటరు జాబితాలో వివరాలు లేకపోయినా ఆధార్, ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డు వంటి వ్యక్తిగత ఆధారాలతో సర్ నమోదు చేస్తామని వివరించారు. జూలై 14లోగా 100 శాతం నమోదు పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి, డీటీ ప్రదీప్, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *