Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

సమీక్షల పేరుతో కాలయాపన వద్దు.. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సమీక్షల పేరుతో కాలయాపన వద్దు.. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి

వార్త ముఖ్యాంశాలు

  • *సమీక్షల పేరుతో కాలయాపన వద్దు..
  • ప్రజా సమస్యలకు పరిష్కారం చూపండి: బీఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్* నిర్మల్ జిల్లాలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటనపై బీఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ విమర్శలు చేశారు.
  • మంత్రుల పర్యటన ప్రజా సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి పరిశీలన కంటే విహారయాత్రకు వచ్చినట్లుగా సాగిందని ఆయన వ్యాఖ్యానించారు.

*సమీక్షల పేరుతో కాలయాపన వద్దు.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపండి: బీఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్*

నిర్మల్ జిల్లాలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటనపై బీఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ విమర్శలు చేశారు. మంత్రుల పర్యటన ప్రజా సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి పరిశీలన కంటే విహారయాత్రకు వచ్చినట్లుగా సాగిందని ఆయన వ్యాఖ్యానించారు.
జిల్లా స్థాయిలో ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిష్కారం కాని సమస్యలు అనేకం ఉన్నాయని మిర్జా షోయేబ్ అన్నారు. అలాంటి సమస్యలపై మంత్రులు ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహించి, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించాలని డిమాండ్ చేశారు.
భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అటవీ–రెవెన్యూ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రులు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారులకు గడువుతో కూడిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్, సమగ్ర భూసర్వే, పేదలకు ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో స్పష్టం చేయాలని మిర్జా షోయేబ్ ప్రశ్నించారు.
మంత్రులు కేవలం సమీక్ష సమావేశాలు, శంకుస్థాపన కార్యక్రమాలకే పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణంలోని కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాని ప్రతి సమస్యను ప్రజా దర్బార్ ద్వారా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిర్జా షోయేబ్ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *