Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

సమభావ అంకురం అంబేద్కర్ – డా. బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సమభావ అంకురం అంబేద్కర్ – డా. బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న స్వర్గీయ డా.
  • బి.ఆర్.
  • అంబేద్కర్ గారి జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటాము.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న స్వర్గీయ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్లు పొందిన భారతరత్న డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జన్మించారు. భారత దేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, భారత రాజ్యాంగ రూపశిల్పిగ, రాజ్యాంగ పితామహుడుగ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా గొప్ప మేధావిగా, మరియు స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా సుప్రసిద్ధులు. ఈయన జన్మదినం సందర్భంగా ఈ కవిత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*డా.* డాక్టరుగా కుల వివక్షతకు వైద్యం చేయగ
*భీం* భీష్మించుకున్న అగ్ర వర్ణాలను ఎదుర్కొనగ
*రా* రాజీలేని ప్రయత్నం కొనసాగించగ
*వ్* వావ్ అనిపించుకున్న విద్యాధికుడు.

*రాం* రాంరాం తీరుగ సమససమాజ ఆరాధకుడై
*జీ* జీవించు హక్కుకు సమన్యాయ జీవం పోయగ

*అం* అంతర్జాతీయ న్యాయ సూత్రాలను విశ్లేషించి
*బే* బేశరతు పాలన నియమాలు రూపొందించి
*ద్క* దక్కదగిన సమాజ గౌరవాలు చేకూర్చగ
*ర్* రమణీయ జీవన గమనానికి దారి చూపగ

*ఒ* ఒకే భావజాలాంబుధిని మధించి
*కే* కేవలము నుండి విజయకేతనం వరకు

*దే* దేహం నుండి దేవాలయం వరకు
*శం* శంఖారావ ప్రజా చైతన్య ప్రదాత

*ఒ* ఓపిక లేదిక అనక ప్రజాస్వామ్య దిశగ
*కే* కేసరిగ సమసమాజ స్థాపనాచార్యునిగ

*రా* రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా
*జ్యాం* జన్మెత్తిన ప్రతి ఒక్కరూ ప్రయోజకులు కావాలని
*గం* గమనించి మూర్తీభవించిన సామాజిక స్ఫూర్తితో
రూపొందించిన భారత రాజ్యాంగ పితామహుడు
పరిపాలనాంగ రాజ్యాంగ స్ఫూర్తి ధీరుడు
స్వర్గీయ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment

Your email address will not be published. Required fields are marked *