Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

మహాత్మా జ్యోతిరావు పూలే – డా. బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహాత్మా జ్యోతిరావు పూలే – డా. బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా మరియు మహిళల హక్కుల కోసం పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మరియు రచయిత అయిన మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి నేడు జరుపుకుంటున్నాము.
  • ఈయన ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలోని పూణే లో జన్మించారు.
  • మహాత్మా ఫూలేను ఆధునిక భారతదేశంలో సామాజిక విప్లవ పితామహుడిగా మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకుంటాము.

భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా మరియు మహిళల హక్కుల కోసం పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మరియు రచయిత అయిన మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి నేడు జరుపుకుంటున్నాము. ఈయన ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలోని పూణే లో జన్మించారు. మహాత్మా ఫూలేను ఆధునిక భారతదేశంలో సామాజిక విప్లవ పితామహుడిగా మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకుంటాము. సామాజిక సంస్కరణల పట్ల ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1888లో సామాజిక కార్యకర్త విఠల్‌రావు కృష్ణజీ వందేకర్ ఆయనకు ‘మహాత్మా’ అనే బిరుదును ప్రదానం చేశారు. తన సతీమణి సావిత్రిబాయి ఫూలేతో కలిసి భారతదేశంలో మహిళా విద్య కోసం ఎనలేని కృషిచేసిన పూలే జయంతి సందర్భంగా ఈ అక్షర నివాళి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*మ* మహారాష్ట్రలో జన్మించి సమసమాజాభివృద్ధినెంచి
*హా* హక్కుల కోసం పోరాడిన సామాజిక విప్లవకారుడు
*త్మా* తమ విధానలక్ష్యంగా సమన్యాయ సత్యశోధకుడు

*జ్యో* జ్యోతి క్షేత్రంగా నడిపించు ఆదర్శభావకుడు
*తి* తీవ్ర వ్యతిరేకి మూఢనమ్మకాలకు
*రా* రచయితగా సామాజిక వెతలరక్షకుడు
*వు* వున్నతికి విద్యార్జన మూలమన్నవాడు

*పూ* పూజ్యుడు ప్రజాపక్ష సాధకుడు
*లే* లేమితనం అజ్ఞానం పనితనంతో సాధిస్తాం

*జ* జనజీవన తారతమ్యాలు తొలగిస్తాం
*యం* యంత్రంలా పనిచేసి విజ్ఞాన బీజాలు నాటేస్తాం అంటూ
*తి* తీరు మార్చిన ఇజం సత్యశోధక సమాజం స్థాపకుడు
నేటికీ సామాజిక హృదయంలో స్ఫూర్తిదాయకుడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment

Your email address will not be published. Required fields are marked *