Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంపూర్ణ సందేశం – నా దేశం ఆదేశం -డా. బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సంపూర్ణ సందేశం – నా దేశం ఆదేశం -డా. బద్రి పీర్ కుమార్
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • 80వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ కవిత దేశ ప్రగతిలో యువత అంకితపాత్ర ఆత్మనిర్భర్ భారత్ దిశగ యాత్ర నైపుణ్యాల వినియోగమే అభివృద్ధి సూత్ర శాస్త్ర సాంకేతిక మరియు వ్యవసాయ రంగాలలో స్వయం సమృద్ధికి మాత్ర అభివృద్ధిని సాధించగ సంకల్ప అడుగులు వేయగ సహజ వనరులు…

80వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ కవిత

దేశ ప్రగతిలో యువత అంకితపాత్ర
ఆత్మనిర్భర్ భారత్ దిశగ యాత్ర
నైపుణ్యాల వినియోగమే అభివృద్ధి సూత్ర
శాస్త్ర సాంకేతిక మరియు వ్యవసాయ రంగాలలో స్వయం సమృద్ధికి మాత్ర

అభివృద్ధిని సాధించగ
సంకల్ప అడుగులు వేయగ
సహజ వనరులు సద్వినియోగం కాగ
భరతమాత రుణం తీర్చుకోగ

ప్రతి పౌరుడు బాధ్యతగా
దేశ ఐక్యతను, శాంతిని కాపాడగ
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగ
మన అందరి కర్తవ్య కాంతులు దారి చూపగ

కులమత భేదం పాటించక
ఆడ మగ తేడాలెంచక
అవకాశాల కొండలు దాటగ
పేదరికానికి లేదు చోటిక
ఆశల విత్తనాలు నాటి
మహా వృక్షమై నిలువిక
ప్రగతి బాటలో చేరును విజయ దీపిక

భారత భవిష్యత్ ప్రయాణం
సమ సమాజ నవ నిర్మాణం
పౌరుల స్వేచ్ఛకు తీర్మానం
ఇదే నా దేశం ఆదేశం
సమృద్ధికి సంపూర్ణ సందేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *