Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

సంక్రాంతి సందర్భంగా ఏటికొప్పాక గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు బట్టలు, నిత్యవసరాల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సంక్రాంతి సందర్భంగా ఏటికొప్పాక గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు బట్టలు, నిత్యవసరాల పంపిణీ

ఏటికొప్పాక గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పారిశుద్ధ కార్మికులకు బట్టలు మరియు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి కుమారుడు తన చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కర్రి సింహాచలం, వార్డ్ మెంబర్లు నాయుడు మాస్టర్, ఎర్రంశెట్టి శ్రీను, జాము వెంకటరమణ, ఎర్రంశెట్టి కృష్ణ పాల్గొన్నారు. గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సేవలు ప్రశంసనీయమని నాయకులు పేర్కొన్నారు. పండుగ వేళ వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

సంక్రాంతి సందర్భంగా ఏటికొప్పాక గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు బట్టలు, నిత్యవసరాల పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *