Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

షఫీ ఉల్లా ఆధ్వర్యంలో ఘనంగా హిందీ భాష దినోత్సవం వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
షఫీ ఉల్లా ఆధ్వర్యంలో ఘనంగా హిందీ భాష దినోత్సవం వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల జిల్లా పరిషత్ఉ న్నత పాఠశాల పాటూరులో హిందీ ఉపాధ్యాయులు షఫీ ఉల్లా ఆధ్వర్యంలో జరిగిన హిందీ భాష దినోత్సవం వేడుకల్లో నందలూరు మండల విద్యాశాఖ అధికారి అనంత కృష్ణ గారు ప్రసంగిస్తూ రాజ్యాంగం ఆమోదించిన భాషలో లో కెల్లా హిందీ…

అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల జిల్లా పరిషత్ఉ న్నత పాఠశాల పాటూరులో హిందీ ఉపాధ్యాయులు షఫీ ఉల్లా ఆధ్వర్యంలో జరిగిన హిందీ భాష దినోత్సవం వేడుకల్లో నందలూరు మండల విద్యాశాఖ అధికారి అనంత కృష్ణ గారు ప్రసంగిస్తూ రాజ్యాంగం ఆమోదించిన భాషలో లో కెల్లా హిందీ అత్యుత్తమైన భాష కాబట్టి దీనిని రాజభాష జాతీయ భాషగా ఎన్నుకోవడం జరిగిందని కాబట్టి మనమంతా జాతీయ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి లత మాట్లాడుతూ హిందీ భాష నేర్చుకోవడం వల్ల భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలియజేశారు హిందీ ఉపాధ్యాయులు షఫీ వు ల్ల మాట్లాడుతూ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలు ఆ దేశ భాషను తప్పకుండా నేర్చుకోవాలని చెప్పారు ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన వకృత్వ పోటీలు స్పీడ్ రీడింగ్ చిత్రలేఖన పోటీలలో మొదటి ద్వితీయ తృతీయ చతుర్ధ పంచమ స్థానాలలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగినది.అలాగే విద్యార్థులకు మాంసంతో కూడినటువంటి పౌష్టిక ఆహారాన్ని షఫీ ఉల్లా అంద చేయటం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *