Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

శ్రీ వారాహి దుర్గా ద్విశక్తి పీఠంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ వారాహి దుర్గా ద్విశక్తి పీఠంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • పెదపూడి, జూలై 22 (రమేష్ నాయుడు - పున్నమి ప్రతినిధి):పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ వారాహి దుర్గా ద్విశక్తి పీఠంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని…
  • ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమృద్ధి, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
  • ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

పెదపూడి, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ వారాహి దుర్గా ద్విశక్తి పీఠంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమృద్ధి, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *