Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

శ్రీ మహాశక్తి అమ్మవారి సన్నిధిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌తో డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ మహాశక్తి అమ్మవారి సన్నిధిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌తో డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చ పై కరీంనగర్ నగరంలోని చైతన్యపురి కాలనీలో కొలువుదీరిన ప్రసిద్ధ శ్రీ మహాశక్తి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
  • ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భవానీ దీక్షను ఆచరిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బీజేపీ నర్సంపేట నియోజకవర్గ నాయకులతో కలిసి శ్రీ మహాశక్తి దేవాలయాన్ని సందర్శించి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చ పై కరీంనగర్ నగరంలోని చైతన్యపురి కాలనీలో కొలువుదీరిన ప్రసిద్ధ శ్రీ మహాశక్తి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భవానీ దీక్షను ఆచరిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బీజేపీ నర్సంపేట నియోజకవర్గ నాయకులతో కలిసి శ్రీ మహాశక్తి దేవాలయాన్ని సందర్శించి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం భవానీ దీక్షలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని కలిసి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ భేటీలో నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పలు రాజకీయ, సామాజిక అంశాలతో పాటు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు.
నర్సంపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లిన డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం, నర్సంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని ఈ భేటీ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
వారి వెంట నర్సంపేట నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షులు మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *