వార్త ముఖ్యాంశాలు
- నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం, దేశాయిపెల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతా యువ మోర్చా నాయకులు బుట్టి రాజు గారి తండ్రి అనారోగ్య సమస్యతో హనుమకొండలోని బంధన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
- ఈ విషయం తెలుసుకున్న బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
- అనంతరం ఆయన చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి, బాధితుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం, దేశాయిపెల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతా యువ మోర్చా నాయకులు బుట్టి రాజు గారి తండ్రి అనారోగ్య సమస్యతో హనుమకొండలోని బంధన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
అనంతరం ఆయన చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి, బాధితుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.