Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో సుప్రియ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
  • విద్యార్థిని విద్యార్థులు చిన్ని కృష్ణులుగా గోపికలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
  • తదుపరి విద్యార్థినిలు శ్రీ కృష్ణ లీలా నృత్యాలతో అలరించారు.

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో సుప్రియ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు చిన్ని కృష్ణులుగా గోపికలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తదుపరి విద్యార్థినిలు శ్రీ కృష్ణ లీలా నృత్యాలతో అలరించారు. తదుపరి విద్యార్థులు ఆనందం, ఐక్యతలు ఉట్టిపడే ఉట్టి మహోత్సవ వేడుకలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బాల బాలికలు కోలాటాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీ నరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉట్టి అంటే మన హృదయం, అందులో దాగి ఉన్న వెన్న అంటే జ్ఞానం అని కుల మత వర్గ విభేదాలు లేకుండా సమిష్టిగా అజ్ఞానం,అహంకారం అనే ఉట్టిని పగలగొట్టి జ్ఞాన రూప వెన్నని అందరూ సమానంగా పొందాలి అని ఇందులోని ఆంతర్యాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు సవాళ్లకు భయపడకుండా పట్టుదలతో కృషిచేసి మంచి ఫలితాలను సాధించాలని అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *